Vijay Devarakonda: 'పుష్పక విమానం' చూశాక... విమానం ఎక్కి విదేశాలు చెక్కేస్తున్న విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ విదేశాలు వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే... తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన 'పుష్పక విమానం' చూసి విమానం ఎక్కి చెక్కేయాలని ప్లాన్ చేసుకున్నారు.
విజయ్ దేవరకొండ ఈ రోజు (గురువారం) సాయంత్రం 'పుష్పక విమానం' సినిమా చూడటానికి మహబూబ్ నగర్ వెళ్తున్నాడు. సొంతూరిలో సొంత మల్టీప్లెక్స్‌లో తమ్ముడి సినిమా చూడనున్నాడు. 'పుష్పక విమానం' చూసిన తర్వాత విమానం ఎక్కి విదేశాలు చెక్కేయడానికి అంతా ప్లాన్ చేసుకున్నాడు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా 'లైగర్'. సాలా క్రాస్ బ్రీడ్.. అనేది ఉపశీర్షిక. మూడు నాలుగు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అవును... మూడు నాలుగు రోజుల్లోనే! ఈ రోజు 'పుష్పక విమానం' చూసిన తర్వాత మహబూబ్ నగర్ నుంచి విజయ్ దేవరకొండ హైదరాబాద్ వస్తారు. అక్కడి నుంచి అమెరికా విమానం ఎక్కుతారు. శుక్రవారం విజయ్ దేవరకొండ ప్రయాణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 14న లేదంటే... 15న 'లైగర్' అమెరికా షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం. 'లైగర్'లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్, విదేశీ ఫైటర్లతో కొన్ని యాక్షన్ దృశ్యాలను అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. తొలుత కరోనా నేపథ్యంలో ఆ సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ... ఇప్పుడు పరిస్థితులు ముందు కంటే మెరుగ్గా ఉండటంతో అమెరికా వెళ్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటిస్తున్నారు.
'పుష్పక విమానం' సినిమాకు విజయ్ దేవరకొండ ఓ నిర్మాత. అలాగే, సినిమాలో హీరో ఆనంద్ దేవరకొండ అతని తమ్ముడు. అందుకోసం, సినిమాను ఎంత ప్రమోట్ చేయాలో... అంతా చేశాడు. అందుకోసం 'లైగర్' షెడ్యూల్స్ మధ్యలో బ్రేక్ కూడా తీసుకున్నాడు. చివరగా, విడుదలకు ముందు సినిమా చూసి 'లైగర్' అమెరికా షెడ్యూల్ ప్రారంభించనున్నాడు.
Also Read: తిరిగిచ్చేద్దాం అన్న కేటీఆర్.. ఇలాంటోళ్లు ఉండాలన్న మహేశ్... ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్
Also Read: 'అఖండ' విడుదల తేదీ ఖరారు... బాలకృష్ణతో భారీ చిత్రాల సందడి మొదలు!
Also Read: భార్య పేరు కలిసి వచ్చేలా... ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన హీరో
Also Read: ప్రకటనల్లో నటించిన వారే అన్నింటికీ బాధ్యులా ? అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాల్సిందేనా ? సెలబ్రిటీల ప్రకటనలపై వివాదాలెందుకు ?
Also Read: 'క్రాక్' ఎక్కించిన టైమ్ లోనే 'కిక్' ఇవ్వనున్న 'ఖిలాడీ'..
Also Read: బిగ్ బాస్ హౌస్ లో హనీ మూన్ కపుల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు...ఓ రేంజ్ లో ఆడేసుకున్న సన్నీ...
Also Read: గని ప్రపంచంలో ఉండేది వీళ్లే... టీజర్ విడుదల ఎప్పుడంటే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి