అన్వేషించండి

Dasara VS Ravanasura: ‘దసరా’ vs ‘రావణాసుర’ - ఓటీటీలో పోటాపోటీ!

నాని నటించిన ‘దసరా’, రవితేజ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలోకి వచ్చేశాయి. ఏప్రిల్ 27న ‘దసరా’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాగా, ఇవాళ (ఏప్రిల్ 28న) అమెజాన్ లో ‘రావణాసుర’ అందుబాటులోకి వచ్చిది.

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరెక్కిన చిత్రం ‘దసరా’, మాస్ మహారాజా రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమాలు ఓటీటీలో పోటాపోటీగా విడుదలయ్యాయి. ముందుగా అనుకున్నట్లుగానే ఏప్రిల్ 28న నెట్ ఫ్లిక్స్ లో ‘దసరా’ విడుదల కాగా, అనుకున్న సమయానికి అంటే ముందే అమెజాన్ లో ‘రావణాసుర’ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో ఈ సినిమాలు చూడని అభిమానులు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.  

ఏప్రిల్ 27న ఓటీటీలోకి 'దసరా'

తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల ప్రాంతంలోని ఓ పల్లెలో జరిగిన కథతో ‘దసరా’ రూపొందింది. ఈ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల అయ్యింది. తొలి షో నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ  సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 27న విడుదల చేసింది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమైన చిత్రమిది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది. 'దసరా'లో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించింది. దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో నటించారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా  మొదలైన ఈ సినిమా, ఆ తర్వాత మహిళలను చెరబట్టే ఓ కామ పిశాచిని హీరో ఎలా అంతం చేశాడు? మద్యపానానికి మగవాళ్ళు బానిసలు కావడంతో మహిళలు పడుతున్న సమస్యలను హీరో ఎలా తొలగించాడు? అనే అంశాలతో ముగిసింది. కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని స్థాయిని ఓ మెట్టు పైకి ఎక్కించిన సినిమాగా 'దసరా' చరిత్రకు ఎక్కింది. వంద కోట్లు వసూలు చేసిన సినిమాగా నిలించింది. తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో 'దసరా'కు మంచి ఓపెనింగ్ లభించింది. 

అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి 'రావణాసుర'!

'ధమాకా' బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజా రవితేజ నటించిన చిత్రం 'రావణాసుర'.  సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 7న రిలీజైంది. ఫరియా అబ్దుల్లా, ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్లుగా ఈ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైనా.. ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మే 5 నుంచి OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ వస్తున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇవాళ(ఏప్రిల్ 28న) విడుదల అయ్యింది.  

మాస్ హీరో రవితేజ నటించిన 'రావణాసుర' సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగినా.. చివరికి మాత్రం ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ ప్రేక్షకులకు మరింత చిరాకును తెప్పిస్తాయి. కాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామనుకునే లోపే మళ్లీ.. స్టోరీ దారి తప్పినట్టనిపిస్తుంది. మధ్యలో వచ్చే మ్యూజిక్, పాటలు కొన్ని సార్లు చాలా అడ్డంకిగా, బలవంతంగా స్టోరీలోకి నెట్టబడినట్టు అనిపిస్తాయి. ఇన్ని నెగెటివ్ కామెంట్స్ మధ్య 'రావణాసుర' మూవీ రవితేజ ఫ్యాన్స్ కు అత్యంత నిరాశకు గురి చేసింది.  ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వరరావు’తో పాటు సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలో రవితేజ నటిస్తున్నారు.  

Read Also: టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో దుమ్మురేపిన విశాల్, అంచనాలు పెంచేస్తోన్న ‘మార్క్‌ ఆంథోని‘ టీజర్

టాప్ హెడ్ లైన్స్

KilleR Movie: మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
మూవీ ట్విస్ట్‌ కనిపెట్టండి... కోటి గెలుచుకోండి - 'కిల్లర్' టీమ్ బంపర్ ఆఫర్
Nindu Manasulu Serial Today October 22nd: నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
నిండు మనసులు: ప్రేరణకు నిజం చెప్పిన గణ! పశ్చాత్తాపంతో కులిమిపోయిన ప్రేరణ! సిద్ధూ క్షమిస్తాడా!
Ramayana OTT: ఆ ఓటీటీలోకి 'రామాయణ'... కానీ ఓ ట్విస్ట్, సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు గురూ
ఆ ఓటీటీలోకి 'రామాయణ'... కానీ ఓ ట్విస్ట్, సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు గురూ
Actress Rajitha: మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget