అన్వేషించండి
Advertisement
Ante Sundaraniki: నాని 'అంటే సుందరానికి' అప్డేట్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?
ఈరోజు ఉగాది సందర్భంగా నాని నటిస్తోన్న 'అంటే సుందరానికి' సినిమా చిత్రబృందం ఆడియన్స్ కు ఓ అప్డేట్ ఇచ్చింది
'శ్యామ్ సింగరాయ్' సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. మొదటినుంచి 'ఆవకాయ్ సీజన్'లో తమ సినిమాను విడుదల చేస్తామని యూనిట్ చెబుతూ వస్తోంది. అయితే... ప్రతి సినిమా విడుదల తేదీలు మారుతున్న నేపథ్యంలో ఒకేసారి ఏడు విడుదల తేదీలు ప్రకటించి ఈ సినిమా టీమ్ అందరినీ సర్‌ప్రైజ్ చేసింది.
రీసెంట్ గానే ఈ సినిమా నుంచి నాని క్యారెక్టర్ ను రివీల్ చేస్తూ.. ఓ టీజర్ ని వదిలింది చిత్రబృందం. ఈ టీజర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. 'బ్రోచేవారేవరురా', 'మెంటల్ మదిలో' వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు ఉగాది సందర్భంగా చిత్రబృందం ఆడియన్స్ కు ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ పంచెకట్టుని ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు ఓ పోస్టర్ ని వదిలారు. అందులో నాని అమెరికాలో ఉన్నట్లు.. కారులో నుంచి చాలా ఎగ్జైటెడ్ గా బయటకు చూస్తూ కనిపించారు.
ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో నాని 'K.P.V.S.S.P.R సుందర ప్రసాద్' అనే పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: ప్రభాస్ 'ఊ' అంటాడా? 'ఊ ఊ' అంటాడా?
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion