అన్వేషించండి

NBK On Aditya 999 Max : బాలయ్య కథతో 'ఆదిత్య 369' సీక్వెల్ - ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారంటే?

Nandamuri Balakrishna On Aditya 369 Sequel Aditya 999 Max : 'ఆదిత్య 369' సీక్వెల్ గురించి నట సింహం నందమూరి బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్‌లో స్పెషల్ సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో 'ఆదిత్య 369' (Aditya 369) ది మరీ మరీ స్పెషల్ ప్లేస్. కంటెంట్, టెక్నాలజీ పరంగా హాలీవుడ్ స్థాయి సినిమా అది. ఆ సినిమాకు సీక్వెల్ వస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. బాలకృష్ణ కూడా సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఆయన వందో సినిమాగా అదే చేస్తారని వినిపించింది. అయితే... కుదరలేదు అనుకోండి! ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కే సమయం వచ్చిందని బాలకృష్ణ మాటలను బట్టి అర్థం అవుతోంది.   

'ఆదిత్య 999 మాక్స్' కథ బాలకృష్ణదే!
Balakrishna Pens Aditya 999 Max Script : 'ఆదిత్య 369' సీక్వెల్‌కు 'ఆదిత్య 999 మాక్స్' టైటిల్ ఖరారు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... ఆ చిత్రానికి బాలకృష్ణ స్వయంగా కథ రాశారు. అవును... 'ఆదిత్య 999 మాక్స్' కథ బాలయ్యే రాశారు. ఈ విషయాన్ని శర్వానంద్, అడివి శేష్‌తో 'అన్‌స్టాపబుల్ 2' ఎపిసోడ్‌లో వెల్లడించారు.
    
వచ్చే ఏడాది సెట్స్ మీదకు!
Aditya 999 Max will be launched in February 2023 : వచ్చే ఏడాది 'ఆదిత్య 999 మాక్స్' సెట్స్ మీదకు వెళ్లనుందని, రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని బాలకృష్ణ వెల్లడించారు. మరో నాలుగు నెలల తర్వాత... ఫిబ్రవరిలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయట. ఇందులో బాలకృష్ణతో పాటు ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటించే అవకాశాలు ఉన్నాయని వినికిడి. 

'ఆదిత్య 999 మాక్స్'తో మోక్షజ్ఞను కథానాయకుడిగా బాలకృష్ణ పరిచయం చేస్తారా? లేదా? అనేది కొన్ని రోజులు ఆగితే స్పష్టత వస్తుంది. మొత్తం మీద... కల్ట్ క్లాసిక్‌కి సీక్వెల్ రావటం పక్కా అన్నమాట. ఇప్పుడు ఈ విషయమే బాలయ్య, నందమూరి అభిమానులను  ఖుషీ చేస్తోంది.  

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన 'ఆదిత్య 369'కు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించారు. అందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో అద్భుతంగా నటించారు. ప్రత్యేకించి శ్రీకృష్ణదేవరాయలు ఆహార్యంలో ఆయన నటన అద్భుతం. ప్రస్తుతం సింగీతం వయసు దృష్ట్యా 'ఆదిత్య 999 మాక్స్'కు ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు తక్కువ. వేరొకరి చేతిలో బాలకృష్ణ దర్శకత్వ బాధ్యతలు పెడతారా? లేదంటే ఆయనే చేపడతారా? అనేది చూడాలి.

Also Read : వదిలేస్తే వరస్ట్‌గా చేస్తున్నారేంటి? - ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్

Balakrishna Upcoming Movie : ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... దర్శకుడు గోపీచంద్ మలినేనితో 'వీర సింహా రెడ్డి' (Veera Simha Reddy Movie) చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రెండిటి తర్వాత 'ఆదిత్య 999 మాక్స్' స్టార్ట్ కావచ్చు. దర్శకులు పరశురామ్, వెంకటేష్ మహా కూడా ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satya Kumar On YS Jagan: ఒక్కో మెడికల్ కాలేజీ కాంట్రాక్టర్‌ నుంచి వంద కోట్ల వసూలు- జగన్‌పై మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు 
ఒక్కో మెడికల్ కాలేజీ కాంట్రాక్టర్‌ నుంచి వంద కోట్ల వసూలు- జగన్‌పై మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు 
Bapatla Crime News: బావ పొట్టిగా ఉన్నాడని చంపేసిన బావమరిది- పెళ్లైన పది రోజులకే దారుణం
బావ పొట్టిగా ఉన్నాడని చంపేసిన బావమరిది- పెళ్లైన పది రోజులకే దారుణం
Mirai OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్' - 4 భాషల్లోనే స్ట్రీమింగ్... ఇప్పుడే చూసెయ్యండి
ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్' - 4 భాషల్లోనే స్ట్రీమింగ్... ఇప్పుడే చూసెయ్యండి
Tesla Model Y SUV కొన్న రోహిత్ శర్మ - కార్‌ నంబర్‌ 3015 వెనుక ఉన్న సెంటిమెంట్ ఇదే
Tesla Model Y SUV కొన్న రోహిత్ శర్మ - కార్‌ నంబర్‌ సెంటిమెంట్‌, ఫీచర్లు అదిపోయాయి
Advertisement

వీడియోలు

India vs South Africa Women's ODI World Cup | నిరాశపర్చిన భారత మిడిల్ ఆర్డర్
India vs West Indies 2nd Test Preview | వెస్టిండీస్ తో భార‌త్ ఢీ
Hyderabad Beach : బీచ్ ఏర్పాటుకు కొత్వాల్ గూడ ఎందుకు ఎంచుకున్నారు..!? ఇక్కడ ప్రత్యేకతలేంటి..? | ABP
Women's ODI World Cup 2025 | విమెన్స్ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ పరమ చెత్త ప్రదర్శన
Women's ODI World Cup 2025 | ఓటమనేదే లేని విశాఖలో సౌతాఫ్రికాతో తలపడనున్న టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satya Kumar On YS Jagan: ఒక్కో మెడికల్ కాలేజీ కాంట్రాక్టర్‌ నుంచి వంద కోట్ల వసూలు- జగన్‌పై మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు 
ఒక్కో మెడికల్ కాలేజీ కాంట్రాక్టర్‌ నుంచి వంద కోట్ల వసూలు- జగన్‌పై మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు 
Bapatla Crime News: బావ పొట్టిగా ఉన్నాడని చంపేసిన బావమరిది- పెళ్లైన పది రోజులకే దారుణం
బావ పొట్టిగా ఉన్నాడని చంపేసిన బావమరిది- పెళ్లైన పది రోజులకే దారుణం
Mirai OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్' - 4 భాషల్లోనే స్ట్రీమింగ్... ఇప్పుడే చూసెయ్యండి
ఓటీటీలోకి వచ్చేసిన 'మిరాయ్' - 4 భాషల్లోనే స్ట్రీమింగ్... ఇప్పుడే చూసెయ్యండి
Tesla Model Y SUV కొన్న రోహిత్ శర్మ - కార్‌ నంబర్‌ 3015 వెనుక ఉన్న సెంటిమెంట్ ఇదే
Tesla Model Y SUV కొన్న రోహిత్ శర్మ - కార్‌ నంబర్‌ సెంటిమెంట్‌, ఫీచర్లు అదిపోయాయి
Vrusshabha Release Date: మోహన్ లాల్ 'వృషభ' రిలీజ్ వాయిదా - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
మోహన్ లాల్ 'వృషభ' రిలీజ్ వాయిదా - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్- కోర్టు స్టేతో SEC నిర్ణయం 
AP DSC 2026: ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
ఏపీలో వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ - మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చిన లోకేష్‌
Gold Loan: బంగారంపై రుణాలు తీసుకునే వారికి బిగ్ షాక్‌- సిబిల్ స్కోర్ ప్రమాదంలో పడే అవకాశం
బంగారంపై రుణాలు తీసుకునే వారికి బిగ్ షాక్‌- సిబిల్ స్కోర్ ప్రమాదంలో పడే అవకాశం
Embed widget