అన్వేషించండి

NTR Song: 'నందమూరి తారక రామామృత'.. ఎన్టీఆర్ పై పాట.. బాలయ్య ప్రశంసలు.. 

దివంగత నటుడు, రాజకీయనాయకుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఓ పాటను రూపొందించారు అశ్విన్ అట్లూరి.

దివంగత నటుడు, రాజకీయనాయకుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఓ పాటను రూపొందించారు అశ్విన్ అట్లూరి. 'తెలుగు తల్లి చేసిన పుణ్యం.. తెలుగు తెరపై వెలసిన దైవం' అంటూ సాగే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను నిర్మించడమే కాకుండా.. లిరిక్స్ కూడా అందించారు అశ్విన్ అట్లూరి.
 
అంజనా సౌమ్య, స్వరాగ్ కీర్తన్ ఈ పాటను ఆలపించగా.. 'బుల్లెట్టు బండి' సాంగ్ కి సంగీతం అందించిన ఎస్కే బాజీ ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. గౌతమ్ రాజు ఎడిటింగ్ వర్క్ చేశారు. అయితే ఈ పాటపై బాలయ్య సైతం స్పందించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు.
 
''నవరస నటనా సార్వభౌమ,
రాజకీయ భీష్మ, ప్రజాభీష్ట నందమూరి తారక రామ మహాప్రస్థానాన్ని పాటగా రచించి, నిర్మించిన అశ్విన్ అట్లూరి గారికి మరియు వారి టీం కి నా అభినందనలు.  ఓ ప్రజానాయకా,
తెలుగుతల్లి పాడుతుంది నీ గీతికా
'నందమూరి తారక రామామృత' గీతాన్ని అద్భుతంగా ఆదరిస్తున్న అన్నగారి అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు నా కృతఙ్ఞతలు.
జై ఎన్టీఆర్.. జయహో ఎన్టీఆర్…జోహార్ ఎన్టీఆర్'' అంటూ బాలకృష్ణ రాసుకొచ్చారు. 

 
సాంగ్ లిరిక్స్:
 
తెలుగు తల్లి చేసిన పుణ్యం
తెలుగు తెరపై వెలసిన దైవం

తెలుగు నేలకు వచ్చిన ధైర్యం
తెలుగు భాషకు తెచ్చిన గర్వం

ఓ విశ్వ విఖ్యాత - నట సార్వభౌమా !
మా... నందమూరి - తారకరామా !

పల్లవి :

అంతయు నీవే తారకరామా...
అంతము లేనిది నీపై ప్రేమా  

ఎక్కడ విన్నా నీ నామస్మరణా...
ఎన్నడు మరువము చల్లని కరుణా

నేలను విడిచిన ఓ రామన్నా !
మళ్ళీ రావా...మా అన్నా !!

చరణం 1:

తెలుగునాట నీ చరిత - సువర్ణాక్షరాల రాత !

తెగువ చూపిన ఘనత - నిను మరవదు ఈ జనత !

మడమ తిప్పనిది నీ నైజం
మైమరపించే రాజసం !

కఠినమైన నీ క్రమశిక్షణా
కాలు దువ్వితే సింహగర్జనా !

నీ రూపం... ముగ్ధ మనోహరం...
నీ పలుకే... తొలకరి మకరందం...

నీ పౌరాణిక పాత్రల సృష్టీ  ..
వ్యాస వాల్మీకులె పెట్టిరి దిష్టీ !

అంతయు నీవే తారకరామా...
అంతము లేనిది నీపై ప్రేమా  

చరణం 2:

గుప్పున రగిలిన - నిప్పుల ఉప్పెన - నీలో ఆవేశం

గుప్పెడు గుండెను - తట్టి లేపినది - నీ ఉపన్యాసం!

నీ అభిమానం నదీ ప్రవాహం
ఆత్మాభిమానం అనంతగగనం !

నీ పట్టుదలే ఈ మట్టి దృఢత్వం
నీ ప్రతి అడుగూ ఓ ప్రభంజనం !!

ఆ పంచభూతాలే కలిసీ...  
నిలిచాయి పంచెకట్టులో వెలసీ...!

పేదోళ్ళకు కంచంలొ అన్నమా !  ..
నీ అభిమానులకూ - 'అన్న'వే సుమా !  

అంతయు నీవే తారకరామా...
అంతము లేనిది నీపై ప్రేమా  
 
చరణం 3:

పాతుకు పోయిన - పాత పార్టీకి - పాతర వేసావూ

పేదల గుండెలె - పసుపు జెండాగ - పైకెగరేసావూ

మన తెలుగోళ్ళను కించపరిచే
ఆ మదరాసీ ముద్ర చెరిపీ

ఖండాలూ తీరాలు దాటీ  
చాటావే ఘన తెలుగు ఖ్యాతి !

బలహీన వర్గాల దన్నుగా...
నవ శకమే…నిర్మించినావుగా...!

భరత జాతికే శిరోరత్నమా !
మహా నాయకా... స్ఫూర్తిదాయకా !

అంతయు నీవే తారకరామా...
అంతము లేనిది నీపై ప్రేమా
 

Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'

Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!

Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!

Also Read: ఫ్రెండ్స్‌... ఆ ద‌రిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియ‌స్‌గా తీసుకోండి! - త‌రుణ్ భాస్క‌ర్‌

Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
Rakul Preet Singh wedding: పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
Singareni Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
Congress Candidate: లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on Gas Cylinder : ఆరు గ్యారెంటీల్లో మరో హామీ అమలు ప్రకటించిన సీఎం రేవంత్| ABP DesamRakul Preet Singh Wedding : గోవాలో గ్రాండ్ గా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం | ABP DesamVarun Tej on Lavanya Tripathi : పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానంటున్న వరుణ్ తేజ్ | ABP DesamTDP Leaders Welcoming Vemireddy prabhakar reddy : వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్న నేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
Rakul Preet Singh wedding: పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
Singareni Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
Congress Candidate: లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మార్చి నుంచి ఆ త్యాగం చేయక తప్పదు!
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మార్చి నుంచి ఆ త్యాగం చేయక తప్పదు!
Chandrababu Letter To DGP: సీఎం జగన్‌పై చర్యలు తీసుకోండి- డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్‌పై చర్యలు తీసుకోండి- డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
BRS News: హైదరాబాద్‌లో BRS భారీ బహిరంగ సభకు ప్లాన్! ఈసారి అజెండా ఇదే!
హైదరాబాద్‌లో BRS భారీ బహిరంగ సభకు ప్లాన్! ఈసారి అజెండా ఇదే!
Hansika Motwani: పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక
పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక
Embed widget