Samantha: విడాకుల అనౌన్స్మెంట్.. పోస్ట్ డిలీట్ చేసిన సమంత..
రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్ట్ ను డిలీట్ చేసింది.
టాలీవుడ్ స్టార్స్ సమంత-చైతు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. 2021 అక్టోబర్ 2న చైతు-సమంత విడాకులు తీసుకుంటున్నట్లు అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇద్దరూ విడాకులు విషయం ప్రకటించి మూడు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఈ విషయం హాట్ టాపిక్ గానే ఉంది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటనకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్ట్ ను డిలీట్ చేసింది. దీంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. చైతుతో సమంత మళ్లీ కలవబోతుందా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చైతు ఇన్స్టాగ్రామ్ లో మాత్రం విడాకుల అనౌన్స్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి సమంత పొరపాటున ఈ పోస్ట్ డిలీట్ చేసి ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె సరికొత్త పాత్రలో కనిపించబోతుంది. దీంతో పాటు శ్రీదేవి మూవీస్ లో ఓ సినిమా, అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.
మరోపక్క నాగచైతన్య 'బంగార్రాజు' సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ప్రస్తుతం ఈ హీరో 'థాంక్యూ' సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. బాలీవుడ్ లో 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నారు. అలానే ఓ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నారు.
View this post on Instagram
Also Read: ఆస్కార్ బరిలో సూర్య 'జైభీమ్'.. మోహన్ లాల్ 'మరక్కార్'
Also Read: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్... ఆ దరిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియస్‌గా తీసుకోండి! - తరుణ్ భాస్కర్
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి