అన్వేషించండి
Raviteja: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!
మాస్ మహారాజ రవితేజ డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. 'రావణాసుర' సినిమా కోసం అంతా రియల్‌గా ఉండేలా చూసుకుంటున్నారని తెలిసింది. ఇంతకీ, ఆయన ఏం చేస్తున్నారంటే?
![Raviteja: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్! For the first time Raviteja decided to shoot complete talkie part of a film Ravanasura, in natural locations of Hyderabad Raviteja: రవితేజ కెరీర్‌లోనే ఇది తొలిసారి... 'రావణాసుర' కోసం డేరింగ్ స్టెప్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/a7c232bb58a6c37c01df1e046cd4d8ff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రవితేజ
మాస్ మహారాజ రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ రూపొందిస్తున్న సినిమా 'రావణాసుర'. ఇటీవల హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. రాత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రవితేజ డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. కరోనా టైమ్‌లోనూ అవుట్ డోర్ షూటింగ్ చేయడానికి రెడీ అయ్యారు. అదీ సినిమా టాకీ పార్ట్ మొత్తం!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... 'రావణాసుర' సినిమా టాకీ పార్ట్ మొత్తాన్ని హైదరాబాద్‌లోని రియల్, నేచురల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఒక్క సెట్ కూడా వేయడం లేదట. రవితేజ కెరీర్‌లో ఇలా చేయాలని అనుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ చేసిన సినిమాల కోసం ఏదో ఒక సన్నివేశం కోసం సెట్ వేశారు. కొన్ని సినిమాలు సెట్స్‌లో చేశారు. బహుశా... 'రావణాసుర' సాంగ్స్ కోసం సెట్స్ ఏమైనా వేస్తే వేయవచ్చు. పక్కా ప్లాన్ ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా టాకీ పార్ట్ షూటింగ్ నేచురల్ లొకేషన్స్‌లో తెరకెక్కించేలా దర్శకుడు సుధీర్ వర్మ షెడ్యూల్స్ వేశారట. ఆయన ప్లాన్‌కు రవితేజ ఓకే చెప్పారని తెలిసింది.
కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత 'క్రాక్'లో కొంత పార్ట్ షూటింగ్ చేశారు రవితేజ. కరోనా నేపథ్యంలో అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పుడు ఎవరికీ రాలేదు. ఆ అనుభవంతో ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేస్తున్నారట.
Also Read: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?
'రావణాసుర' సినిమాకు వస్తే... అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నారు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు హీరోయిన్లు సినిమాలో ఉన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా.

Also Read: అందుకు ఎనిమిదేళ్లు పట్టింది... కీర్తీ సురేష్‌కు ఈ సినిమా సో స్పెషల్!
Also Read: ఫ్రెండ్స్... ఆ దరిద్రాన్ని (కొవిడ్‌ను) సీరియస్‌గా తీసుకోండి! - తరుణ్ భాస్కర్
Also Read: 'ఆచార్య'కు 'శ్యామ్ సింగరాయ్' నచ్చాడు... మీసం మెలేసిన మెగాస్టార్, నేచురల్ స్టార్!
Also Read: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఇండియా
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion