X

Ravanasura Begins: రావణాసుర... ఎంతమంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 'రావణాసుర' సినిమా భోగి సందర్భంగా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో చూశారా?

FOLLOW US: 

మాస్ మహారాజ రవితేజ (Raviteja) కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ సంస్థలపై రూపొందుతున్న సినిమా 'రావణాసుర' (Ravanasura). దీనికి సుధీర్ వర్మ దర్శకుడు. అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. భోగి సందర్భంగా శుక్రవారం పూజా కార్యక్రమాలతో సినిమా మొదలు అయ్యింది.

రవితేజపై చిత్రీకించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇవ్వగా, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కె.ఎస్. రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం   దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. 'రావణాసుర' పోస్టర్‌ను చిరంజీవి విడుదల చేశారు. సినిమా ఓపెనింగ్ రోజునే విడుదల తేదీని అనౌన్స్ చేశారు రవితేజ. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

'రావణాసుర' సినిమాలో రవితేజ న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. ఇందులో రాముడిగా సుశాంత్ నటించనున్నట్టు ఇటీవల వెల్లడించారు. అయితే... ఈ సినిమాలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నారో చూశారా? అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ - మొత్తం ఐదుగురు నటిస్తున్నట్టు ఈ రోజు చెప్పారు. అందరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఉంటుందట. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, సత్య, జయప్రకాష్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.

Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: అయ్యప్ప దీక్షలో అజయ్‌ దేవగన్.. శబరిమలైలో ప్రత్యక్షమైన RRR స్టార్
Also Read: 'సూప‌ర్ మ‌చ్చి' రివ్యూ: సూప‌ర్ అనేలా ఉందా? లేదా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: raviteja Anu Emmanuel Megha Akash Sushanth sudheer varma abhishek nama Faria Abdullah Daksha Nagarkar Ravanasura Movie Poojitha Ponnada Raviteja Ravanasura Raviteja Ravanasura Movie Release Date

సంబంధిత కథనాలు

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Supritha: సురేఖావాణి కూతురు ఓల్డ్ ఐడియా.. వర్కవుట్ అవ్వలేదే.. 

Maruthi About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Maruthi  About Prabhas Movie: ప్ర‌భాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

Akhanda on OTT: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..

AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?

AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్ట‌ర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?