Surekha Vani Daughter: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!
నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారా? అంటే... 'అవును' అని చెప్పాలేమో!? రానా రూటులో ఆమె తన ప్రేమను సోషల్ మీడియాలో చెప్పడం విశేషం.
![Surekha Vani Daughter: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన! Actress Surekha Vani Daughter Supritha posted the first picture with Hyderabad based rapper and actor Rocky Jordan, announces her relationship Surekha Vani Daughter: ఔను... వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! ప్రేమలో సురేఖావాణి కుమార్తె... రానా రూటులో ప్రకటన!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/20/d3e76e7de31e80c005b3f26f90647f67_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సినిమా ప్రేక్షకులకు సురేఖావాణి తప్పకుండా తెలిసే ఉంటారు. ఆమె తెలుగులో చాలా చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు. సోషల్ మీడియాలో సురేఖావాణిని ఫాలో అయ్యేవారికి ఆమె కుమార్తె సుప్రీత కూడా తెలిసే ఉంటారు. తల్లీకుమార్తెలు ఇద్దరూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.
ఇప్పుడు మేటర్ ఏంటంటే... సురేఖావాణి కుమార్తె సుప్రీత ప్రేమలో పడ్డారు. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. అదీ రానా దగ్గుబాటి తరహాలో! పెళ్లికి ముందు మిహీక బజాజ్ ఫొటో షేర్ చేసిన రానా 'షి సెడ్ ఎస్' (ఆమె అవును అన్నది) అని కాప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలో సుప్రీత ఓ పోస్ట్ చేశారు. 'ఐ సెడ్ ఎస్' అని ఆమె ఓ ఫొటో పోస్ట్ చేశారు. అందులో ఆమెతో పాటు మరో అబ్బాయి ఉన్నారు. అతడి పేరు రాకీ జోర్డాన్. ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకున్నదాని ప్రకారం చూస్తే... ర్యాపర్, యాక్టర్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, డైరెక్టర్. సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, పాటల రచయితగా చేస్తున్నట్టు ఉన్నారు. ఇంకా బ్రేక్ వచ్చినట్టు లేదు.
View this post on Instagram
సుప్రీత పోస్ట్ చేసిన ఫొటో పోస్ట్ చేసిన రాకీ జోర్డాన్... 'షి సెడ్ ఎస్' అంటూ రానా తరహాలో రాసుకొచ్చారు. ఇద్దరూ లవ్ ఎమోజీలు యాడ్ చేశారు. రీసెంట్‌గా నందు అనే అబ్బాయి గురించి సుప్రీతను కొంత మంది అడిగారు. అతను 'మీ బాయ్ ఫ్రెండా?' అని! అందుకు ఆమె ఘాటుగా బదులు ఇచ్చారు. బహుశా... నెటిజన్స్ ఎవరెవరితోనో రిలేషన్ అంటగట్టడానికి ముందు తన ప్రేమ గురించి ప్రపంచానికి చెప్పాలని భావించారేమో!? లేదంటే... రాకీ జోర్డాన్ సాంగ్ కోసం దేనికైనా ఇలా వెరైటీగా పబ్లిసిటీ ప్లాన్ చేశారో!? వెయిట్ అండ్ సి.
View this post on Instagram
Also Read: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్
Also Read: విడాకుల వేడిని క్యాష్ చేసుకుంటున్న సుమంత్ అండ్...
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)