News
News
X

Varalaxmi Sarathkumar: జయమ్మ జోరు తగ్గట్లేదుగా... మరో పాన్ ఇండియా సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్

'క్రాక్' తర్వాత తెలుగునాట కూడా వరలక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌కు అభిమానులు ఏర్పడ్డారు. నటిగా ఆమె జోరు పెరిగింది. మరో పాన్ ఇండియా సినిమా ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.

FOLLOW US: 

వరలక్ష్మీ శరత్ కుమార్ కెరీర్ గురించి, ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఆమె సంతకం చేస్తున్న సినిమాల గురించి చెప్పాలంటే... 'క్రాక్'కు ముందు, 'క్రాక్'  తర్వాత అని చెప్పాలి. ఒక్క సినిమాతో ఆమెకు బోల్డంత పేరు వచ్చింది. జయమ్మ పాత్రలో వరలక్ష్మీ నటనకు ప్రశంసల వర్షం కురిసింది. ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా మరో పాన్ ఇండియా సినిమాకు ఆమె సంతకం చేశారు.

సందీప్ కిషన్ కథానాయకుడిగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'మైఖేల్'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, కరణ్ సీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు నేడు చిత్రబృందం వెల్లడించింది.

'మైఖేల్'లో సందీప్ కిషన్ సరసన దివ్యాంశా కౌశిక్ నటిస్తున్నారు. బహుశా... విజయ్ సేతుపతి జోడిగా వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించే అవకాశం ఉందా? వెయిట్ అండ్ సి. ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా కాకుండా సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న బహు భాషా సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. 

Also Read: విడాకుల వేడిని క్యాష్ చేసుకుంటున్న సుమంత్ అండ్...
Also Read: అమ్మాయిలు స్కూల్ ఎందుకు మానేస్తున్నారో తెలుసా? తెలంగాణ ప్రభుత్వానికి లక్ష్మీ మంచు మద్దతు
Also Read: పుట్టబోయే బిడ్డ కోసం... కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ
Also Read: కాపురాల్లోకి తొంగి చూడొద్దు... విడాకులకు, డబ్బుకు సంబంధమా? - చిన్మయి ఫైర్
Also Read: మెగా హీరోతో పెళ్లి పుకార్లకు పరోక్షంగా... తెలివిగా సమాధానం ఇచ్చిన లావణ్యా త్రిపాఠీ!?
Also Read: 'సుడిగాలి' సుధీర్ vs 'హైపర్' ఆది... సేమ్ క్యారెక్టర్ చేశారుగా!
Also Read: ఇన్‌స్టాలో తన పేరు చివర భర్త పేరు తొలగించిన చిరంజీవి చిన్న కుమార్తె!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 20 Jan 2022 04:35 PM (IST) Tags: Vijay Sethupathi Sundeep Kishan Divyansha Kaushik Varalaxmi Sarathkumar మైఖేల్ Michale Movie Ranjith Jeyakodi

సంబంధిత కథనాలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే

PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Tollywood: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి - ఓటీటీలోకి 'షంషేరా'!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

Weather Updates: నేడు తీవ్ర వాయుగుండం - ఏపీకి రెయిన్ అలర్ట్, తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు IMD

Weather Updates: నేడు తీవ్ర వాయుగుండం - ఏపీకి రెయిన్ అలర్ట్,  తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు IMD

Health Tips: ఈ పనులు చేస్తే, వ్యాయామం అవసరం లేకుండానే ఆరోగ్యం మీ సొంతం!

Health Tips: ఈ పనులు చేస్తే, వ్యాయామం అవసరం లేకుండానే ఆరోగ్యం మీ సొంతం!

Junior Lecturers: జూనియర్‌ లెక్చరర్లకు బీఈడీ తప్పనిసరి, ఏపీ ప్రభుత్వ నిర్ణయం!

Junior Lecturers: జూనియర్‌ లెక్చరర్లకు బీఈడీ తప్పనిసరి, ఏపీ ప్రభుత్వ నిర్ణయం!