Thank You Trailer: 'పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ గొప్పది' - చైతు 'థాంక్యూ' ట్రైలర్ వచ్చేసింది!
నాగచైతన్య నటిస్తోన్న 'థాంక్యూ' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

రీసెంట్ గా 'లవ్ స్టోరీ', 'బంగార్రాజు' సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అక్కినేని నాగచైతన్య త్వరలో 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూలై 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
ఇప్పటికే సినిమా నుంచి టీజర్ ను, పాటలను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను వదిలారు. అన్ని ఎలిమెంట్స్ ను టచ్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. 'మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరుకున్న గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు' అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. 'ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
డిఫరెంట్ స్టేజెస్ లో హీరో లైఫ్ జర్నీను ట్రైలర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ని మరింత ఎలివేట్ చేసింది. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
Also Read: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుంది - సారా అలీఖాన్ కామెంట్స్!
Also Read: 'ఫుల్లుగా తాగేసి ఇంటికెళ్లా, ప్రెగ్నెన్సీ విషయంలో అబద్దం చెప్పా' - రెజీనా కామెంట్స్!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

