అన్వేషించండి
Sara Ali Khan: విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుంది - సారా అలీఖాన్ కామెంట్స్!
కరణ్ జోహార్ షోలో పాల్గొన్న సారా అలీఖాన్ ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటుందో చెప్పేసింది.

విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుంది
బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీఖాన్ తాజాగా ఓ షోలో విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలనుందని ఓపెన్ గా కామెంట్స్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ 'కాఫీ విత్ కరణ్' సీజన్ 7ని హోస్ట్ చేస్తున్నారు. ఈ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ ఒక్కొక్కటిగా హాట్ స్టార్ లో టెలికాస్ట్ అవుతున్నాయి. తాజాగా కరణ్.. సారా అలీఖాన్, జాన్వీ కపూర్ లను తన షోకి గెస్ట్ లుగా పిలిచారు.
దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఫన్నీగా ఈ ప్రోమోను కట్ చేశారు. ముందుగా జాన్వీ, సారా అలీఖాన్ ల స్నేహం గురించి ప్రశ్నించిన కరణ్.. ఆ తరువాత ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నావో చెప్పాలని సారాని అడిగారు. దానికి ఆమె ముందు సమాధానం చెప్పనని ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. వెంటనే కరణ్.. జాన్వీకి కూడా విజయ్ అంటే ఇష్టమని అనగా.. ఆమె నవ్వేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ తారల్లో విజయ్ దేవరకొండ ఫాలోయింగ్ చూస్తుంటే ఆయన క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. అందుకే అక్కడి హీరోయిన్లు విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు నటించిన 'లైగర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ కాకుండా పూరి జగన్నాధ్ తో మరో సినిమా ఒప్పుకున్నారు విజయ్. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.
Two of my favourite girls at their unfiltered best!🥳
— Karan Johar (@karanjohar) July 12, 2022
Get ready for episode 2 of #HotstarSpecials #KoffeeWithKaranS7 streaming from July 14 on Disney+ Hotstar!@DisneyPlusHS #JanhviKapoor #SaraAliKhan @apoorvamehta18 @jahnvio @aneeshabaig @Dharmatic_ pic.twitter.com/A9fJoIsjpg
View this post on Instagram
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
క్రైమ్
సినిమా





















