Prabhu Deva: 'మై డియర్ భూతం' ఫస్ట్ లుక్ - డిఫరెంట్ గెటప్ లో ప్రభుదేవా
ప్రభుదేవా కొత్త సినిమా పోస్టర్ ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు.
తన కెరీర్‌లో ప్రభుదేవా డాన్స్ మాస్టర్‌గానే కాకుండా.. నటుడిగా కూడా రాణించారు. సినిమాకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్ లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలకు పని చేశారు. ఇప్పుడు ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ సినిమాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
తమిళంలో పలు హిట్ సినిమాలు రూపొందించి సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్. రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకుమించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్‌కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ సినిమా అలరించనుందట. జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారనిపిస్తోంది. ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనే చెప్పాలి. ఈ లుక్ కోసం ఎలాంటి విగ్ వాడలేదట.
Also Read: కరణ్ జోహార్ కిడ్నాప్ - బిష్ణోయ్ గ్యాంగ్ ప్లాన్ ఇదే!
Also Read: నా బర్త్ డే రోజే ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది: అడివి శేష్
ఈ సినిమాలో రమ్య నంబీసన్ కీలక పాత్ర పోషించగా.. బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. యూకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో హైలైట్ కానుందట. వీఎఫ్ఎక్స్ వర్క్ అబ్బురపరచనుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటించనున్నారు.
View this post on Instagram