అన్వేషించండి

MAA Elections Live Updates: ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదు.. మంచు విష్ణు భావోద్వేగం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఫలితాల వివరాలను తెలుసుకొనేందుకు ఈ పేజ్ క్లిక్ చేయండి.

⦿ ఎన్నికల ఫలితాల్లో మంచు విష్ణుకు విష్ణు 381, ప్రకాష్ రాజ్ 274 ఓట్లు పోలయ్యాయి. 107 తేడాతో విజయం సాధించారని ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. ప్రకాష్ ప్యానల్ నుంచి పోటీ చేసి జీవిత ఓటమి చవిచూశారు. ఆమె రఘుబాబు విజయం సాధించారు. 

⦿ విష్ణు విజయం తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ..  ‘‘ఇది అందరి సభ్యుల విజయం. అందరూ మనోళ్లే. అందరి ఆశీస్సులతో విష్ణు గెలిచాడు. అతడు ఇచ్చిన హామీలను వంద శాతం చేసి చూపిస్తాడు. గతం గతః.. జరిగింది, జరిగిపోయింది. అందరం ఒక తల్లి బిడ్డలం అని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా. భవిష్యత్తులో ఇలా ఎన్నికలు జరగకూడదు. ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నా. పెద్దలూ ఆలోచించండి. అధ్యక్షుడి అనుమతి లేనిదే మీడియాతో ఎవరూ మాట్లాడకూడదు. కొంతమంది వచ్చి గెలుకుతారు, విష్ణు గానీ, మరెవరుగానీ స్పందించొద్దు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలి. నరేష్ నాకు తమ్ముడిలాంటోడు.. అతడు ఎంత కష్టపడ్డాడో మీకు తెలీదు. అతను నాకు తమ్ముడులాంటోడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అందరి ఆశీస్సులు నా బిడ్డకు ఉండాలి’’

⦿ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు వారబ్బాయి అనుకున్నది సాధించారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్‌పై 65 ఓట్ల ఆధిక్యంతో విష్ణు గెలుపొందినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

⦿ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, హేమ గెలుపొందగా.. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు విజయం సాధించారు.

⦿ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ విజయం సాధించారు. విష్ణు ప్యానల్‌కు చెందిన అభ్యర్థి బాబు మోహన్‌పై శ్రీకాంత్ గెలుపొందారు.

⦿ మా ఎలక్షన్ కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మరొకరు విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన జీవితా రాజశేఖర్‌పై 7 ఓట్ల తేడాతో విష్ణు ప్యానల్ సభ్యుడు రఘుబాబు గెలుపొందారు.

⦿ మా ఎన్నికల్లో ట్రెజరర్‌గా శివ బాలాజీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్‌ నుంచి పోటీ చేసిన శివ బాలాజీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి నాగినీడుపై గెలుపొందారు. 

⦿ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ పూర్తైంది. 3.30 నుంచి కౌంటింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. సాయంత్రం సుమారు 5.30 నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం విష్ణు ప్యానల్ నుంచి 10 మంది అభ్యర్థులు, 8 మంది అభ్యర్థులు లీడ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన నటులు శివారెడ్డి, కౌశిక్‌, సురేష్ కొండేటి విజయం సాధించినట్లు తెలిసింది. అనసూయ ప్రస్తుతం లీడ్‌లో ఉంది.

ప్రకాష్ రాజ్ ప్యానల్:
MAA Elections Live Updates: ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదు.. మంచు విష్ణు భావోద్వేగం

మంచు విష్ణు ప్యానల్:

MAA Elections Live Updates: ఇలాంటివి ఎప్పుడూ జరగకూడదు.. మంచు విష్ణు భావోద్వేగం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు 3 గంటలకు ముగిసాయి. వాస్తవానికి ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకే ముగియాలి. కానీ, రిగ్గింగ్ ఆరోపణలు రావడంతో సుమారు గంటసేపు పోలింగ్ ఆపేశారు. కొంతమంది తారలు విమానాల్లో వస్తున్నారని, చేరుకోడానికి ఆలస్యమవుతుందని చెప్పడంతో 3 గంటల వరకు సమయాన్ని పొడిగించారు. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో మధ్యాహ్నం 3.30 నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. 

ఈసారి గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్లు పోలైనట్లు తెలిసింది. ‘మా’లో మొత్తం 905 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 883 మందికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంది. మరో 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు. ఆదివారం పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 605 ఓట్లు పోలయ్యాయి. వీటిని కలుపుకుంటే.. మొత్తం 665 ఓట్ల పడినట్లు లెక్క. గతంతో పోల్చితే.. ఈ సారి పోలింగ్ ఘననీయంగా పెరిగింది. 2019లో జరిగిన ఎన్నికల్లో 472 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అప్పట్లో అధ్యక్షుడిగా బరిలోకి దిగిన నరేష్‌కు 268 ఓట్లు దక్కాయి. ప్రత్యర్థి శివాజీ రాజాకు 199 ఓట్లు పడ్డాయి. దీంతో నరేష్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

కనిపించని స్టార్ హీరోలు: ఈ ఎన్నికలకు పలువురు స్టార్ హీరోలు దూరంగా ఉన్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, వెంకటేష్‌తోపాటు నితిన్ నాగచైతన్య, రానా తదితర హీరోలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రాలేదు. ఇలియానా, అనుష్క రకుల్, హన్సిక, త్రిష తదితరులు కూడా ఓటు వేయలేదు. షూటింగులో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసినట్లు తెలిసింది. 

ఇదీ మా చరిత్ర: తమిళనాడు నుంచి తెలుగు నేలపై అడుగుపెట్టిన సినీ రంగం కొన్నాళ్లు పెద్ద మనుషులు లేకుండానే సాగింది. టాలీవుడ్‌లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క వేదిక కూడా ఉండేది కాదు. తమ మొరను వినే పెద్ద దిక్కు లేదా అంటూ కళాకారులు కుమిలిపోతున్న రోజుల్లో.. నేనున్నా అంటూ పుట్టిందే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) పుట్టింది. ఒకప్పుడు హూందాగా మొదలైన సేవలు.. ఆ తర్వాత లుకలుకలతో అంతర్గత కలహాలతో వర్గాలుగా విడిపోయారు. అయితే, ఇన్నాళ్లూ ఇంట్లోనే కొట్టుకున్న సభ్యులు.. ఇప్పుడు రోడ్డున పడ్డారు. పంతాలు, ఆదిపత్యం కోసం ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్నారు.

 

పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సాయం చేసేందుకు 1993లో తెలుగు తారలంతా విశాఖపట్నంలో క్రికెట్ ఆడి నిధులు సమకూర్చారు. అనంతరం విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తిరిగివస్తున్న సమయంలో చిరంజీవి, మురళీ మోహన్‌లకు మూవీ ఆర్టిస్టుల సమస్యలను తీర్చేందుకు ఒక సంఘం ఉంటే బాగుంటుందనే ఆలోచన కలిగింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సీనియర్ నటులతో చర్చించి.. ‘మా’కు జీవం పోశారు. 1993, అక్టోబరు 4వ తేదీన ‘మా’ అసోసియేషన్ ఏర్పాటైంది. సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ.. రెబల్ స్టార్ కృష్ణం రాజులను ముఖ్య సలహాదారులుగా ఎంపిక చేశారు. ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు నిర్మించిన సొసైటీ భవనంలోని ఓ గదిలో ‘మా’ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. 

Also Read: ‘మా’ ఎన్నికలు.. మోహన్ బాబు కాళ్లు మొక్కబోయిన ప్రకాష్ రాజ్, విష్ణుకు హగ్!

Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Embed widget