అన్వేషించండి

Mohan Babu: నా మౌనం చేతకానితనం, చేవలేనితనం కాదు.. టికెట్ రేట్ ఇష్యూపై మోహన్ బాబు కామెంట్స్.. 

సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను షేర్ చేశారు. అందులో ఏముందంటే..

ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దలు ఏపీ మంత్రులతో ఈ విషయం గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఎవరూ కూడా టికెట్ రేట్స్ గురించి మాట్లాడొద్దని చెప్పారు దిల్ రాజు. అయితే సీనియర్ నటుడు మోహన్ బాబు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఓ లెటర్ ను షేర్ చేశారు. అందులో ఏముందంటే..

''మనకెందుకు మనకెందుకు అని మౌనంగా వుండాలా...

నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు...

కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా వుంటాయ్..

కఠినంగా వుంటాయ్... కానీ నిజాలే వుంటాయ్. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు?

ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా. నాకు నచ్చినట్టు బతకాలా... అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు......

47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట.. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ వుంటుంది అని చర్చించుకోవాలి.

ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి.

అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది..! మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి సమస్యల్ని వివరిస్తే మనకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు.

సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం, కాదనను. కానీ ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి... వాళ్ళని మనం గౌరవించుకోవాలి... మన కష్టసుఖాలు చెప్పుకోవాలి..! జరిగిందా? జరగలేదు.

నేను 'మా' అధ్యక్షుడిగా ఉన్న టైంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి సి.ఎం. డా॥ రాజశేఖర్ రెడ్డి గారిని కలిసి పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి బిక్ష పెట్టండి అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు.. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం.

350 రూపాయలు, 300 రూపాయల టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. 50 రూపాయలు, 30 రూపాయలు టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలు నిలబడ్డం కష్టం.

చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి 'అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది... చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ వున్నాయి.. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు... కానీ ఈరోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం'' అంటూ మోహన్ బాబు తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.   

Also Read:'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?

Also Read: సీనియర్ హీరోయిన్ కి పబ్లిక్ గా పెళ్లి ప్రపోజల్.. వెంటనే ట్వీట్ డిలీట్..

Also Read:ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. ఆ స్థానం నాకొద్దు.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..

Also Read:తల్లి కాబోతున్న కాజల్.. అసలు విషయం చెప్పేసిన గౌతమ్..

Also Read:రెజీనాతో చిరు స్టెప్పులు.. 'సానా కష్టం' ప్రోమో చూశారా..?

Also Read:దీప్తి బ్రేకప్ స్ట్రాటజీ.. సిరి బాయ్ ఫ్రెండ్ ఫాలో అవుతాడా..?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!Dinesh Karthik Hitting vs SRH IPL 2024: ప్రపంచకప్ రేసులోకి ఉసేన్ బోల్ట్ లా వచ్చిన దినేష్ కార్తీక్RCB vs SRH IPL 2024: మీరేంటో మీ విధానాలేంటో.. ఆర్సీబీ స్ట్రాటజీలపై మరోసారి విపరీతంగా ట్రోల్స్Travis Head Century vs RCB IPL 2024: రికార్డ్ స్కోరింగ్ మ్యాచ్ లో మరోసారి బలైన RCB, 25 పరుగులతో ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ వద్ద కేసీఆర్ సుపారీ, కవిత కోసం లొంగిపోయారు - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Vijayawada CP: జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
జగన్‌పై చేతితోనే రాయి విసిరారు, అది అక్కడి నుంచే వచ్చింది - కీలక వివరాలు చెప్పిన సీపీ
Rs 150 Flight Ticket: నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
నిజమండీ బాబూ, 150 రూపాయలకే ఫ్లైట్‌ టిక్కెట్‌, బైక్‌ జర్నీ కన్నా చౌక
ABP CVoter Opinion poll  :  అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా -  ఏబీపీ  న్యూస్ - సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
అస్సాం, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఎవరిది హవా - ఏబీపీ న్యూస్సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో వెల్లడయిన విషయాలు ఇవే
Weather Latest Update: నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
నేటి నుంచి మళ్లీ పెరగనున్న వేడి, 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా - ఐఎండీ
IPL 2024: హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
హై స్కోరింగ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై హైదరాబాద్‌ ఘన విజయం
Hyderabad News: మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
మందు బాబులకు అలర్ట్! ఆ రోజు ట్విన్ సిటీస్‌లో వైన్ షాపులు బంద్
OnePlus Price Cut: ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
ఈ వన్‌ప్లస్ సూపర్ ఫోన్‌పై ఏకంగా రూ.ఐదు వేలు తగ్గింపు - ఇప్పుడు ధర ఎంత?
Embed widget