అన్వేషించండి

Chiranjeevi: 'మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను' - మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్!

చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా 'ప్రాణం ఖరీదు'. ఈ సినిమా విడుదలైన ఈరోజుకి 44 ఏళ్లు అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi).. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. తన నటన, డాన్స్, యాక్షన్ తో కోట్లాది మందిని అభిమానులుగా మార్చుకున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన చిరు.. ఈరోజు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన సినిమా 'ప్రాణం ఖరీదు'. ఈ సినిమా విడుదలైన ఈరోజుకి 44 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా చిరు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 

'మీకు తెలిసిన ఈ చిరంజీవి.. చిరంజీవిగా పుట్టిన రోజు.. ఈ రోజు 22 సెప్టెంబర్ 1978. ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ప్రాణం పోసి.. ప్రాణపదంగా, నా ఊపిరై.. నా గుండె చప్పుడై.. అన్నీ మీరై 44 సంవత్సరాలు నన్న నడిపించారు. నన్నింతగా ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను.. ఎప్పటికీ మీ చిరంజీవి..' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. 

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళ 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార(Nayanthara), సత్యదేవ్(Satyadev) లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కథ ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) ఇందులో క్యామియో రోల్ పోషిస్తున్నారు. చిరంజీవికి బాడీగార్డ్ లా కనిపించే రోల్ ఇది. కానీ సినిమా మొత్తం సల్మాన్ కనిపించరు. ఒక యాక్షన్ సీన్ లో ఆయన క్యారెక్టర్ ని హైలైట్ చేసి చూపించబోతున్నారు. 

ఈ సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. దానికి 'వాల్తేర్ వీరయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే మరికొంతమంది స్టార్స్ ను తీసుకున్నారు. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నారు. 

కథ ప్రకారం.. చిరు, రవితేజ సవతి సోదరులుగా కనిపించబోతున్నారు. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. పూర్తి మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. తెరపై చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే క్లాష్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు.  

Also Read: క్రియేటివిటీకి కళ్లజోడు పెడితే.. సింగీతం శ్రీనివాసరావు 

Also Read : రాంగ్ రూట్‌లో ఆస్కార్స్‌కు 'ఛెల్లో షో'? - సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న డౌట్స్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గెస్‌ చేసి గోట్ అయ్యేదెవరు? శివ, ముకేశ్‌ల గొడవకు కారణమేంటి? అమన్ నిర్ణయం సరైనదేనా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గెస్‌ చేసి గోట్ అయ్యేదెవరు? శివ, ముకేశ్‌ల గొడవకు కారణమేంటి? అమన్ నిర్ణయం సరైనదేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: భక్తవత్సలాన్ని కాపాడిన మహా! హరికృష్ణ మర్డర్ మిస్టరీని మహా ఛేదిస్తోందా!
Rukmini Vasanth: రుక్మిణితో రోడ్ ట్రిప్... తమిళంలో ఫిమేల్ సెంట్రిక్ సినిమా
రుక్మిణితో రోడ్ ట్రిప్... తమిళంలో ఫిమేల్ సెంట్రిక్ సినిమా
Mystery Thriller Series OTT : ఒకే ఇంట్లో కోడళ్ల మరణాలకు సమాధానం - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒకే ఇంట్లో కోడళ్ల మరణాలకు సమాధానం - మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Asian Para Dominance: బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత
బంగారు పంటతో సెంచరీ దాటిన పతకాల జోరు.. ప్రపంచ రికార్డులతో మోనా అగర్వాల్, సందీప్ కుమార్ ఊచకోత, జపాన్ గడ్డపై భారత్ ప్రభంజనం
Embed widget