Masooda: ‘మసూద’కు ఓటీటీ ప్రేక్షకులు ఫిదా - ట్విట్టర్‌లో మీమ్స్ వరద
‘మసూద’ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ప్రేక్షకులు ఈ మూవీపై తమ స్పందనను సోషల్ మీడియాలో మీమ్స్‌తో వ్యక్తం చేస్తున్నారు.
‘మసూద’.. చిన్న సినిమాగా థియేటర్ లో విడుదలైన మంచి సక్సెస్ సాధించింది. సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. ‘మసూద’ ఇప్పుడు నేరుగా ప్రేక్షకుల ఇంటికే వెళ్లి భయపెడుతోంది. ఓటీటీలో ఈ మూవీని చూస్తున్నవారు.. అరే, థియేటర్‌లో చూసి ఉండాల్సిందే అని తెగ ఫీలైపోతున్నారు.
‘మసూద’ మూవీతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో కనిపించారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమాను రాహుల్ యాదవ్ నక్కా రూపొందించారు. ‘మసూద’ మూవీ నవంబరు 18న థియేటర్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 21 నుంచి ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ మూవీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ట్విట్టర్‌లో ఈ మూవీ గురించి పాజిటివ్ మీమ్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్లో చూసి ఉంటే భలే ఉండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు ఏమంటున్నారో చూసేయండి.
View this post on Instagram
Literally me 😅#Masooda pic.twitter.com/1Isiooh1NG
— Ŕebel (@RebellionRevolt) December 25, 2022
Multi verse😅#masooda https://t.co/3Nv9I6mPE1
— Ravana (@Ravana_101) December 25, 2022
#Masooda was an awesome horror film from Telugu cinema after ages. Such an eerie atmosphere was created and the buildup to the character of Masooda was truly haunting. If there is one genre we’ve been lacking in its horror and Masooda really is a great step forward to real horror pic.twitter.com/fHUoTwDsGY
— Ganeshen (@Ganeshen5) December 25, 2022
Ninna chusa #Masooda 😮
— Torchbearer ᴸᵒᵏᶦ (@TorchbearerEdit) December 25, 2022
Gud watch & recent best horror mvi.. pic.twitter.com/4sq4Hf15Hu
Most powerful ghost award iccheyandi sir maa #Masooda gariki. pic.twitter.com/M6AX2y0Ywc
— PeruSaaho (@Chengumama) December 25, 2022
#Masooda pic.twitter.com/FIxJXmfPlf
— Raj..🇮🇳JSP✊✊ (@Rajhasin1) December 24, 2022
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ఇటీవల కాలంలో హార్రర్ సినిమాలు అంటే అందులో ఫన్ ఎలిమెంట్ ను కూడా మిక్స్ చేస్తున్నారు. అలాంటి సినిమాల్లో ఒకటో రెండో హిట్ అవుతున్నాయి. మిగతా సినిమాలు రొటీన్ గా మారుతున్నాయి. ఆ విషయంలో ‘మసూద’ దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడనే చెప్పాలి. ఈ మధ్య వచ్చిన హార్రర్ కామెడీ సినిమాల్లా కాకుండా పూర్తిగా కథతో నడుస్తుంది సినిమా. మూవీలో సంగీత నటనకి మంచి మార్కులే పడ్డాయి. మదర్ సెంటిమెంట్ ని పండించడంలో ఆమె సక్సెస్ అయ్యింది. దెయ్యం పట్టిన కూతురు వింత ప్రవర్తనకి భయపడటం, అలాగే తిరువీర్ తో కలసి కూతుర్ని కాపాడటానికి ఆమె చేసిన సాహసాలు ప్రేక్షకులని మెప్పంచాయి. మూవీ లో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించినా ఆద్యంతం భయం కలిగించేలా సాగుతుంది. చివరి అరగంట సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావడం చాలా అరుదు. అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించారు. మరి ఈ ‘మసూద’కు డిజిటల్ వేదికపై ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.