అన్వేషించండి

Manjummel Boys: 17 అడుగుల లోతు, 3 నెలల టైమ్ - ‘మంజుమ్మెల్ బాయ్స్’ గుణ గుహ కోసం ఇంత కష్టపడ్డారా?

Manjummel Boys : బ్లాక్ బస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’లో అత్యంత ప్రమాదకరమైన గుణ గుహను కళ్లకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ గుహ సెట్ నిర్మాణం కోసం ఎంతో కష్టపడ్డట్లు చెప్పారు ప్రొడక్షన్ డిజైనర్.

Manjummel Boys Guna Cave Set : 2006లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన మలయాళీ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’. చిందబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. సుమారు రూ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ. 250 కోట్లు వసూళు చేసింది. మలయాళ మూవీ ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డుకెక్కింది.     

గుణ గుహను కళ్లకు కట్టినట్టు చూపించిన మేకర్స్

‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో అత్యంత ప్రమాదకరమైన గుణ గుహలను కళ్లకు కట్టినట్లు చూపించారు. సుమారు 900 అడుగుల లోతున్న గుణ గుహలోనే ఈ సినిమాను షూట్ చేశారా? అన్నట్లుగా చిత్రీకరించారు. కొంత మంది నిజంగానే గుణ గుహల్లో షూట్ చేశారని చెప్తే, మరికొంత మంది మాత్రం స్పెషల్ గా సెట్ వేశారన్నారు. తాజాగా ఈ ఊహాగానాలకు చెక్ పెట్టారు మూవీ ప్రొడక్షన్ డిజైనర్ అజయన్ చలిస్సేరి. ఈ సినిమాలో చూపించిన గుహ నిజమైనది కాదన్నారు. పెరుంబవూరులోని ఓ పాత గోడౌన్‌ లో సెట్ వేసినట్లు వివరించారు. “కొడైకెనాల్ లోని గుణ గుహ నిషేధిత ప్రాంతం. ఆ గుహను చూసేందుకు మమ్మల్ని అనుమతించేందుకు కూడా అటవీశాఖ వెనుకాడింది.  చాలా కండీషన్లు పెట్టింది. అన్నింటికీ ఓకే చెప్పి గుణ గుహను చూడ్డానికి వెళ్లాము. గుహ అత్యంత ప్రమాదకరంగా ఉంది.  నీటిలో చాలా కొమ్మలు, ఇతర శిథిలాలు పేరుకుపోయే సీన్ సినిమాలో చూపించాం. అక్కడ కూడా పరిస్థితి అలాగే ఉంది. గుహలోకి 80 అడుగుల కిందకు వెళ్లేందుకు మాకు పర్మిషన్ ఇచ్చారు. అక్కడి వరకు వెళ్లి గుహ ఫోటోలను తీసుకున్నాం. 2006లో ప్రమాదం జరిగిన ప్రాంతంలోని కొలతలు కూడా తీసుకున్నాం” అని వివరించారు. 

సెట్ వేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది- అజయన్

సినిమా కథ అనుకునే సమయంలోనే గుణ గుహ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినట్లు అజయన్ తెలిపారు. “గుణ గుహ ఫోటోలు, వివరాల కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాం. గుణ గుహకు సంబంధించి ఫోటోలు, వీడియోలు క్వాలిటీగా లేవు.‘గుణా’ సినిమాలోని వీడియో కూడా అనుకున్నట్లుగా లేదు. అందుకే గుహకు సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు వెళ్లాం. అక్కడ చూసి వచ్చాక.. గుణ గుహ కోసం ఒక సెట్ వేసేందుకు హైదరాబాద్ లోని స్టూడియోలు చూడ్డానికి వెళ్లాం. కానీ, భూగర్భంలో  సెట్ నిర్మించుకునే పరిస్థితి కనిపించలేదు. నిజానికి సుభాష్ ఎంత లోతులో పడ్డాడో చూపించడానికి 17 అడుగుల లోతు తవ్వాలి. ఏ స్టూడియోలోనూ అది సాధ్యం కాలేదు. చివరకు పెరుంబవూరులోని ఓ గోడౌన్‌ లో ఈ సినిమా సెట్ వేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించాం. ఈ సెట్ నిర్మించేందుకు సుమారు 3 నెలల సమయం పట్టింది. గుహలో ఉన్నట్లు రాళ్లను నిర్మించేందుకు కొడైకెనాల్‌లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన ఫైబర్‌ వాడాం. అందుకే, గుహ చాలా నేచురల్ గా కనిపించింది. ఈ సెట్ చూసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆశ్చర్యపోయారు” అని అజయన్ వెల్లడించారు.   

Read Also: ‘కన్నప్ప’లో ప్రభాస్‌కు నచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాడు, ఎవరి మాటలు నమ్మొద్దు - మంచు విష్ణు

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today October 27th: కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి కలిసిన సూరజ్‌, జ్యోత్స్న! చెల్లి మీద దీప ఫైర్! సూరజ్ ఇంట్లో టైంకి జ్యోత్స్న!
కార్తీకదీపం 2 సీరియల్: రాత్రి కలిసిన సూరజ్‌, జ్యోత్స్న! చెల్లి మీద దీప ఫైర్! సూరజ్ ఇంట్లో టైంకి జ్యోత్స్న!
Bigg Boss Season 10 Today October 26th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కూల్‌గా నామినేషన్లు! చివరిలో వర్షిణి, త్రిగుణ్‌ ఎమోషనల్ హైలెట్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కూల్‌గా నామినేషన్లు! చివరిలో వర్షిణి, త్రిగుణ్‌ ఎమోషనల్ హైలెట్!
Jagadhatri Serial Today October 26: ఇల్లు మూడుముక్కలు చేసేందుకు వైజయంతి,నిషిక ప్రయత్నం...భార్యబిడ్డలపై మండిపడిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: ఇల్లు మూడుముక్కలు చేసేందుకు వైజయంతి,నిషిక ప్రయత్నం...భార్యబిడ్డలపై మండిపడిన సుధాకర్‌
Nara Lokesh: బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే
బాలయ్యకు ఆ ఒక్కరంటే భయమే! బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ చెప్పిన నారా లోకేష్.. షో టెలికాస్ట్ ఎప్పుడంటే

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget