News
News
వీడియోలు ఆటలు
X

Mama Mascheendra: సుధీర్ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ టైటిల్ ఎందుకు? టీజర్ చూసి చెబితే స్పెషల్ ప్రైజ్!

నైట్రో స్టార్ సుధీర్ బాబు లేటెస్ట్ చిత్రం 'మామా మశ్చీంద్ర' టీజర్ రిలీజ్ పై తాజాగా అనౌన్స్ మెంట్ చేశారు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్టు ఇన్స్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

FOLLOW US: 
Share:

Mama Mascheendra Teaser: నైట్రో స్టార్ సుధీర్ బాబు తాను చేయబోయే నెక్ట్స్ సినిమా 'మామా మశ్చీంద్ర'పై లేటెస్ట్ గా అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 14న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇన్స్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు, దర్శకుడు హర్షవర్ధన్ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే, ఇందులో వారు ఈ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ టైటిల్ ఉంచాలా లేదా ‘మాయ మశ్చింద్ర’గా మార్చాలా అనే గందరగోళంలో ఉన్నారు. అంతా ఈ సినిమా టైటిల్‌ను ‘మాయ మశ్చీంద్ర’ అని తప్పుగా చదువుతున్నారని, దాన్ని ఆ టైటిల్‌కు మార్చేద్దామని హర్షవర్ధన్ అంటే.. సుధీర్ మాత్రం టైటిల్ మార్చొద్దని పట్టుబట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే, టీజర్ రిలీజైన తర్వాత ప్రేక్షకులే ఏ టైటిల్ ఉంచాలో నిర్ణయిస్తారని తెలిపారు. టీజర్‌లో చూసిన తర్వాత ఆ సినిమాకు ‘మామా మశ్చీంద్ర’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో గెస్ చేసి చెబితే బహుమతి ఇస్తారట. ఫస్ట్ పది మందికి మాత్రమే ఈ ప్రైజ్ లభిస్తుందని స్పష్టం చేశారు.

రొటీన్ కథలకు గుడ్ బై చెప్పి.. వెరైటీ స్టోరీలపై దృష్టి పెట్టారు సుధీర్ బాబు. అందులో భాగంగానే 'మామా మశ్చీంద్ర' మూవీకి ఓకే చేశారు. నటుడు- - దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన 'మామా మశ్చీంద్ర'లో సుధీర్ బాబు మూడు విభిన్న లుక్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనపడగా, ఫస్ట్ లుక్ తో పూర్తి భిన్నంగా కనిపించారు. వాటిలో ఒకటి దుర్గ కాగా, మరొకటి పరశురామ్, ఇంకోటి డీజే.

సుధీర్ బాబు ట్రిపుల్ రోల్ చేస్తోన్న ‘మామా మశ్చీంద్ర’లో ఊబకాయం ఉన్న దుర్గ, ఓల్డ్ డాన్ పరశురామ్, డిజె క్యారెక్టర్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. మొదటి రెండు గెటప్‌లలో డీ-గ్లామ్ లుక్స్‌లో కనిపించిన సుధీర్.. మూడో లుక్‌లో డీజేగా తన రిథమ్‌తో మనసుల్ని దోచుకునేలా కనిపించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి సుధీర్ బాబు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 14న టీజర్ రిలీజ్ కానున్నట్టు స్పష్టం చేశారు. కాగా ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తుండగా.. వెరైటీ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

మారుతీ డైరెక్షన్ లో వచ్చిన 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు హీరో నాగ సుధీర్ బాబు. ఈ మూవీ అప్పట్లో భారీ హిట్ అవ్వడమే కాకుండా బాక్సాఫీస్ వద్దా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా.. హిట్ మాత్రం కలిసి రాలేదు. 'సమ్మోహనం' మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకున్నా.. దాన్ని నిలుపుకునేందుకు చాలానే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్లీ చాలా రోజులకు ఇటీవల సుధీర్ బాబు హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'హంట్'. ఈ సినిమా భారీ హైప్ తో, భారీ అంచనాల మధ్య రిలీజైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిల్చింది. ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 'గన్స్ డోంట్ లై' అనే ఉప శీర్షికతో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. మంచి కంటెంట్ ఉన్న సినిమానే అయినా... అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేకపోయింది. అదీ కాకుండా ఆ సమయంలోనే నందమూరి బాలకృష్ణ 'వీరసింహా రెడ్డి', మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' కూడా రిలీజ్ కావడం సుధీర్ బాబు సినిమా ప్లాఫ్ కు మరో కారణమయ్యాయి. ఆ తర్వాత ఈ సినిమా రిలీజైన రెండు వారాల్లోనే మేకర్స్ ఓటీటీలో విడుదల చేశారు.

Also Read: ఈ ఒక్క నాణెం చాలు ‘ప్రాజెక్ట్-K’ కథ చెప్పేస్తుంది - ఇంతకీ ఏంటీ దాని ప్రత్యేకత?

Published at : 10 Apr 2023 07:14 PM (IST) Tags: Sudheer Babu Teaser Mama Mascheendra Harsha Vardhan Mama Mascheendra Teaser

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham June 8th: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన

Ennenno Janmalabandham June 8th: యష్, వేద సంతోషం చూసి రగిలిపోతున్న మాళవిక- కూతురి జీవితం గురించి భయపడుతున్న సులోచన

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

LGM Teaser: ‘కచ్చితంగా నీ కథ ముగించేస్తారు’ - ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ టీజర్ చూశారా!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

Intinti Ramayanam Trailer: ‘ఇంటింటి రామాయణం’ ట్రైలర్ - ఇంతకీ, ఆ పని చేసింది ఇంటి దొంగేనా?

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి