MAA Elections Betting: 'మా' పోలింగ్ ప్రారంభం.. లక్షల్లో బెట్టింగ్.. మరెవరు గెలుస్తారో..?
'మా' ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారడంతో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు.
ఎన్నడూలేని విధంగా ఈసారి 'మా' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధ్యక్ష బరిలో పోటీ పడుతోన్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ 'నువ్వా నేనా' అన్నట్లుగా తలపడుతున్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రకాష్ రాజ్ పై పాత వివాదాలన్నీ తీసుకొచ్చి మంచు విష్ణు తిట్టడం, నోరు అదుపులో పెట్టుకో అంటూ ప్రకాష్ రాజ్ బదులివ్వడం.. కొన్నాళ్లుగా ఇదే జరుగుతోంది. ఇది చాలదన్నట్లు కొన్ని టీవీ ఛానెల్స్ వీరిని స్టూడియోలకు తీసుకొచ్చి డిబేట్లు పెడుతున్నారు. రోజురోజుకి ఈ వివాదాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. రేపు జరగబోయే ఎన్నికలతో ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందో.. లేక కొత్త వివాదాలకు దారి తీస్తుందో చూడాలి!
ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారడంతో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. ఎవరూ ఊహించని విధంగా ఈసారి 'మా' ఎన్నికలకు హైప్ వచ్చింది. విష్ణు గెలుస్తాడా..? లేక ప్రకాష్ రాజా..? అనే విషయంలో బెట్టింగ్ జరుగుతోంది. నటీనటులు, దర్శకులు, కొంతమంది నిర్మాతలు.. లోపాయకారిగా బెట్టింగ్ వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు ఎవరనే విషయంలో మాత్రమే కాదు.. ఏ ప్యానెల్ నుంచి ఎవరు గెలుస్తారు..? అంటూ మిగిలిన వాళ్లపై కూడా బెట్టింగ్ మొదలెట్టేసినట్లు తెలుస్తోంది.
Also Read: ప్రకాష్ రాజ్ చుట్టూ వివాదాలే.. బ్యాన్ చేసిన మెగాఫ్యామిలీ ఈరోజు సపోర్ట్ చేస్తుందే..
ఈసారి ఓ ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న ఓ సభ్యుడు తన గెలుపుపై అతి నమ్మకంతో.. లక్షల కొద్దీ బెట్ వేసినట్లు ఫిల్మ్ నగర్ లో మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు మొదలైన రోజుల్లో ప్రకాష్ రాజ్ గెలుపు చాలా ఈజీ అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా రేసులోకి మంచు విష్ణు వచ్చేశాడు. ఓ దశలో విష్ణుదే గెలుపనిపించింది. అయితే విష్ణు ప్యానెల్ లో తప్పులు జరగడం, మెగాబ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి అని చెప్పడంతో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి.
Also Read: 'నాకు నేనే కింగ్..' షణ్ముఖ్ కామెంట్ కి నాగార్జున పంచ్..
Also Read: మోనార్క్ Vs మంచు: ‘మా’ పోరుపై ఉత్కంఠ.. విజయావకాశాలు అతడికే ఎక్కువట!
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి