MAA Elections: ప్రకాష్ రాజ్ కి రాజకీయ సపోర్ట్.. ఇప్పుడు విష్ణు ఏం చేస్తాడో..
'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అద్దంకి దయాకర్ ఓ వీడియో విడుదల చేశారు.
'మా' ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కి తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ మద్దతు ప్రకటించారు. సినిమా గ్రూపులకు అతీతంగా అందరూ ఒక్కమాటపై ప్రకాష్ రాజ్ ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమస్యలపై, సమాజంపై అవగాహన ఉన్న వ్యక్తికి ఓటు వేస్తేనే అందరికీ మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. ఘన చరిత్రకు గ్రహణం పట్టిస్తున్న విభేదాలు
''బహుభాషా నటుడు, విలక్షణ నటుడు ఈ తరం నటుల్లో ప్రత్యేకతను చాటుకున్న ప్రకాష్ రాజ్ 'మా' అధ్యక్ష పదవికి పోటీ చేయడమనేది సంతోషకరం. రాజకీయ పార్టీలకు అతీతంగా, సినిమా పరిశ్రమ గ్రూపులకు అతీతంగా ప్రజాస్వామ్య వాదిని గెలిపించాలనేది నా విజ్ఞప్తి. సమస్యలపైన, సమాజంపైన అవగాహన ఉన్న వ్యక్తి. తను 'మా' అధ్యక్షుడైతే దక్షిణ భారతదేశానికి ఒక మంచి విలువైన నాయకుడు దొరుకుతాడు. సినిమా పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న మిగతా అందరినీ కూడా ఆదుకునే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి'' అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం 'మా' ఎన్నికల్లో జరుగుతున్న గ్రూపు రాజకీయాలకు భిన్నంగా సభ్యులంతా ఓటు వేయాలని.. అద్దంకి దయాకర్ కోరారు. ప్రకాష్ రాజ్ ని గెలిపించడం ద్వారా సినీ పరిశ్రమ ప్రజాస్వామ్యయుతంగా ఉందని నిరూపించాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు సినీ రంగానికి మాత్రమే పరిమితమైన 'మా' ఎన్నికల్లో మొదటిసారి రాజకీయ మద్దతు ప్రకాష్ రాజ్‌కే దక్కినట్లు ఉంది. ఇప్పుడు మంచు విష్ణు కూడా తన పలుకుబడి ఉపయోగించి ఇలాంటి వాయిస్ బైట్స్ తీసుకొస్తాడేమో చూడాలి.
ఇక అక్టోబర్ 10న జరగనున్న 'మా' ఎన్నికల్లో పోటీ పడబోతున్న మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ లకు చాలా మంది తమ మద్దతుని తెలుపుతున్నారు. ఈ క్రమంలో లోకల్, నాన్ లోకల్ అనే వివాదం కూడా తెరపైకి వచ్చింది. మంచు విష్ణుని గెలిపించే ప్రయత్నాలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఈసారి 'మా' ఎలెక్షన్స్ లో తెలుగువాడే గెలవాలనేది ప్రతిష్టాత్మకంగా మారింది...!
Also Read: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు
Also Read: మర్యాద తప్పుతున్న ‘మా’ సభ్యులు.. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారంటూ నరేష్, కళ్యాణిపై హేమ ఫిర్యాదు
Also Read: 'మా' ఎలెక్షన్స్.. ఎన్టీఆర్ ఇలా బుక్కైపోయాడేంటి..?
Also Read: "రిపబ్లిక్" సినిమాపై కొల్లేరు ప్రజల ఆగ్రహం ! అసలు వివాదం ఏమిటంటే ?
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి