X

MAA elections: ‘మా’ ఎన్నికలు.. దీనికి కూడా బయట వాళ్లు ఎందుకు? దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

‘మా’ ఎన్నికలపై దర్శకుడు, నటుడు రవిబాబు కీలక వ్యాఖ్యాలు చేశారు. ‘మా’కు మనోళ్లు పనికిరారా? అని ప్రశ్నించారు.

FOLLOW US: 

‘మా’ ఎన్నికల ఇప్పుడు లోకల్ Vs నాన్ లోకల్‌గా మారిపోయాయి. అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ బరిలో దిగడం వల్ల ఎన్నడూ లేనంత రచ్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు విష్ణు ప్యానల్‌కు మద్దతు తెలుపుతున్నారు. నరేష్, సీవీఎల్ నరసింహ రావు ఇప్పటికే విష్ణుకు మద్దతు తెలపగా.. మరికొందరు సీనియర్ ఆర్టిస్టులు సైతం విష్ణుకు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. తాజాగా ఈ జాబితాలో నటుడు, దర్శకుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది లోకల్, నాన్ లోకల్ విషయం కాదు. ఏ ప్యానల్‌కు ఓటేయాలో నేను చెప్పడం లేదు. సినిమాలు తీసేవారు మన క్యారెక్టర్ ఆర్టిస్టులను వదిలేసి.. బయట భాషల నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి.. వారికి వేషాలిలిచ్చి.. వాళ్ల డిమాండ్లకు ఒప్పుకుని.. వాళ్లతో యాక్ట్ చేయిస్తున్నారు. డబ్బులు ఎవరు పెడితే వారి ఇష్టం కదా. మన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆ పాత్రలకు సూట్ కారేమో. లేదా బయట నుంచి వచ్చే ఆర్టిస్టుల వల్ల డబ్బింగ్ రైట్స్ ద్వారా ఎక్కువ డబ్బులు పెట్టేవారికి లాభం రావచ్చేమో. అది బయట నుంచి వచ్చే ఆర్టిస్టుల అదృష్టం. మన ఆర్టిస్ట్‌ల దురదృష్టం. హైదరాబాద్ సిటీలో దాదాపు 150 నుంచి 160 మంది తెలుగు కెమేరా మెన్‌లు పనిలేక ఇంట్లో కూర్చున్నారు. కానీ మన సినిమాలు తీసేవారు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి, వారికి వర్క్ ఇచ్చి.. వాళ్లకు ఎక్కువ డబ్బులిచ్చి వాళ్ల డిమాండ్స్ అన్నింటికీ ఒప్పుకుని సినిమాలు తీస్తున్నారు. చివరికి ఆ కెమేరా మ్యాన్‌లు చేసే ఔట్ డోర్ యూనిట్ బిల్లులు చూసి తలలు బాదుకుంటున్నారు. చివరికి మేకప్ మ్యాన్‌లు హెయిర్ డ్రెస్సర్‌లను కూడా బోంబే నుంచే తెచ్చుకుంటున్నారు. మన టెక్నీషియన్స్ దౌర్భా్గ్యం అది. మనమందరం కలిసి ‘మా’ అనే చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. మన సమస్యలు పరిష్కరించుకోడానికి, వేరే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లతో సమస్యలు వస్తే.. వాళ్లతో చర్చించడానికి..  పెట్టుకున్నాం. ఇలాంటి చిన్న ఆర్గనైజేషన్‌కు కూడా మనలో ఒకడు పనికిరాడా? దీనికి కూడా బయట నుంచి మనుషులను తెచ్చుకోవాలా. లోకల్, నాన్ లోకల్ సమస్య కాదు. ఇది మన సంస్థ మనం నడుపుకోలేమా? బయట నుంచి ఎవరో వచ్చి మనకు నేర్పించాలా? ఆలోచించండి’’ అని అన్నారు. మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పూర్తి మద్దతు విష్ణుకేనని, ప్రకాష్ రాజ్‌కు కాదని రవిబాబు స్పష్టం చేశారు. 

Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!

Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Maa elections Prakash raj మా ఎన్నికలు ప్రకాష్ రాజ్ Ravi Babu

సంబంధిత కథనాలు

Mahesh Babu: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!

Mahesh Babu: సర్కారు వారి పాట... ఇంతే ఒక వెయ్యి... లీకయ్యిందిగా!

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'

Ritu Varma: ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Ritu Varma:  ఇంట్లో ఇబ్బంది లేదు... పెళ్లి నిర్ణ‌యం నాదే!

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Samantha Defamation Case: సమంత కేసులో కోర్టు తీర్పు ఇదే.. పర్సనల్ విషయాలను షేర్ చేయొద్దని సూచన.. 

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!

Romantic: రొమాన్స్ విషయంలో కొడుకు మాట వినని పూరి!
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

T20 WC Update: వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు 30 నిమిషాల ముందు క్వింటన్ డికాక్ దూరం.. వేటు తప్పదా.. అసలు వివాదం ఏంటంటే..?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

Amazon Festival Sale: తెలుగువారు ఎక్కువగా కొంటున్న ఉత్పత్తులపై అమెజాన్‌ ఆఫర్లు.. ఏంటో తెలుసా?

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

TSRTC UPI Payments: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం.... జూబ్లీ బస్టాండ్ లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభం

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్

Sreemukhi Photos: ట్రెండీ లుక్ లో శ్రీముఖి.. ఫొటోలు వైరల్