Krishna Mukunda Murari April 13th: ఎందుకు మోసం చేశారని మురారీని నిలదీసిన కృష్ణ- ప్రేమ కోసం తపిస్తున్న ముకుంద
అటు కృష్ణ, ఇటు భవానీ ఒకరికొకరు తెలియకుండా నందిని పెళ్లి చేయాలని ట్రై చేస్తుండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
ముకుంద అందంగా ముస్తాబై మురారీని గదికి రమ్మని మెసేజ్ చేస్తుంది. ఈ టైమ్ లో రమ్మనడం ఏంటి ఎవరైనా చూస్తే ఎంత చండాలంగా ఉంటుందని అనుకుని మురారీ ముకుంద దగ్గరకి వెళతాడు. ఎలా ఉన్నాను మురారీ కొత్త పెళ్లి కూతురులాగా ఉన్నాన అని అడుగుతుంది. మురారీ కోపంగా తన గదిలో నుంచి బయటకి వెళ్ళిపోతాడు. అలా చేసేసరికి ముకుంద చాలా బాధపడుతుంది. ఎందుకు బయట నిలబడ్డావ్ అని అడుగుతుంది. ఈ టైమ్ లో నీ గదికి రావడం సంస్కారం కాదని చెప్తాడు. ఇది నందిని కోసం కొన్న పెళ్లి చీర పెళ్లి అయ్యేంత వరకు తనే కట్టుకోకూడదు నువ్వు ఎలా కట్టుకుంటావని అంటాడు. మనల్ని ఇలా చూస్తే ఇంట్లో వాళ్ళు, కృష్ణ ఏమనుకుంటారు. నీ మీద నాకు సానుభూతి ఉంది అందుకే నలిగిపోతున్నానని మురారీ అంటాడు.
ముకుంద: నీ నుంచి నేను కోరుకుంటుంది ప్రేమ.. సానుభూతి కాదు. నువ్వు కనీసం నాకు కృష్ణకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం లేదు నా మనసు ఎంత నలిగిపోతుంది
Also Read: పెళ్ళికూతురిగా ముస్తాబైన దివ్య, మురిసిన విక్రమ్- పెళ్ళికి రాకుండా ప్రియని బంధించిన రాజ్యలక్ష్మి
మురారీ: ఇప్పుడు మనం ప్రేమ గురించి మాట్లాడుకోవడం కూడా అనైతికం అవుతుంది ఈ మాటలు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. నీలో ప్రేమ కావాలనే తపన రోజురోజుకీ పెరిగిపోతుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి అయిన రోజే నీ స్థానం మారిపోయింది
ముకుంద: నీ ప్రవర్తన వల్ల నేను కఠినంగా మారిపోతున్నా ఏ తప్పు చేయని కృష్ణ మీద అసూయ, ద్వేషం పెంచుకుంటూ వస్తున్నా. అది నా అసలు క్యారెక్టర్ కాదు కానీ నేను సంస్కారం మర్చిపోతున్నా. నీకునాకు మధ్య కృష్ణ అడ్డు గోడలాగా కనిపిస్తుంది.
మురారీ: నీకు నాకు మధ్య అడ్డుగోడ కృష్ణ కాదు మన మధ్య అడ్డుగోడలు నైతిక విలువలు నీ మెడలో ఆదర్శ్ కట్టిన తాళి నేను కృష్ణ కట్టిన తాళి ఉంది
ముకుంద: నేను మానసికంగా నీ దాన్ని అయ్యాను. ఇప్పుడు వేరే వాళ్ళకి దగ్గర అయితే ప్రేమకి ద్రోహం చేసినట్టు ఇప్పుడు నా చేతుల్లో ఏమి లేదు నా ఆశ అడియాస అయిన రోజు నేను ప్రాణాలతో ఉండనని ఫోన్ తెచ్చుకుని తనతో సెల్ఫీ దిగి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళి గుండెలు పగిలేలా ఏడుస్తుంది.
Also Read: రాజ్ ని మర్యాదలతో ముంచెత్తిన కనకం అండ్ కో- రాహుల్ కి దిమ్మతిరిగే షాకిచ్చిన స్వప్న
కృష్ణని చూస్తే గౌతమ్ సర్ పెళ్లి చేయాలని చూస్తుంది. అది మంచి పనే అటు పెద్దమ్మ కూడా కూతురి పెళ్లి చేయాలని చూస్తుంది. గౌతమ్ పెళ్లి నెక్స్ట్ వీక్ పెట్టుకోమని చెప్దామని అనుకునేలోపు కృష్ణ లేచి మోసం చేశారు. నన్ను నమ్మించవద్దు జరగాల్సింది జరిగిపోయిందని కోపంగా మురారీ కాలర్ పట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఎవరో తెల్సుకుని భయపడి పెళ్లి చేయకుండా తప్పించుకుని మోసం చేశారని ఏదేదో వాగి నిద్ర వస్తుందని చెప్పి మళ్ళీ పడుకుంటుంది. లేస్తే మళ్ళీ ఎన్ని పేజీలు తిడుతుందోనని మురారీ భయపడతాడు. వెంటనే కృష్ణ నిద్రలేచి గుడ్ మార్నింగ్ చెప్తుంది. లైవ్ లో తిత్తి కలలో తిట్టానని అనుకునే తింగరి పక్షిని నిన్నే చూస్తున్నానని మురారీ అంటాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకుంటారు. నందుని చేసుకునే అబ్బాయి కిరణ్ భవానీకి ఫోన్ చేసి నగలు తీసుకుంటానని చెప్తాడు. కానీ భవానీ వద్దని చెప్తుంది. నందిని పెళ్ళికి కళ్యాణ మండపం సెట్ చేయడానికి వెళ్తున్నామని ముకుంద అంటుంది. ఏదైనా సీక్రెట్ గా కృష్ణకి తెలియకుండా జరగాలని భవానీ చెప్తుంది.