News
News
X

Kiara Advani Sidharth Malhotra: ఆ హీరోతో కియారా అద్వానీ పెళ్లి? ఆ పోస్ట్‌తో అయోమయంలో పడేసిన బ్యూటీ

కియార అద్వానీ సిద్దార్థ మల్హోత్రా జంట గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది.

FOLLOW US: 
Share:

కియార అద్వానీ సిద్దార్థ మల్హోత్రా జంట గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ప్రేమ పేరుతో ఈ జంట ముంబై మొత్తం చుట్టేశారు. మాల్దీవుల పర్యటన నుంచి ‘షేర్షా’ వరకూ వీరిద్దరూ ఏ రేంజ్ లో వైరల్ అయ్యారో చూశారు. దీంతో ఈ జంట పెళ్లిపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీరు ఎప్పుడూ బయటపడలేదు. అయితే తాజాగా కియార సోషల మీడియాలో ఓ పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు కియారా-సిద్దార్థ పెళ్లిపై క్లారిటీ వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం కియారా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 

కియారా పోస్ట్ ను చూసిన ఆమె అభిమానులు ఇది కచ్చితంగా పెళ్లికి సంబంధించిన వార్తే అంటూ సంబరపడిపోతున్నారు. ఆదివారం ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఆమె సిగ్గుపడుతూ నవ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఆ వీడియోకి ‘‘ఇక నేను ఈ రహస్యాన్ని ఎక్కువ కాలం దాచిపెట్టలేను త్వరలో ప్రకటిస్తాను వేచి ఉండండి డిసెంబర్ 2 వరకు’’ అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. దీంతో అంతా కియరా తన పెళ్లి గురించి ప్రకటించనుందని అనుకుంటున్నారు. 

దీనిపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో చూస్తుంటే ఇది పెళ్లికి ముందు జరిగిన వేడుకలో తీసిన వీడియోలా ఉందని ఒక అభిమాని అభిప్రాయపడ్డాడు. అలాగే ఇంకో అభిమాని కియారా, మల్హోత్రాకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా అంటూ కామెంట్ చేశాడు. ఇంకో అభిమాని స్పందిస్తూ ఇది పెళ్లి ప్రకటన కు హింట్ అయి ఉంటుందంటూ రాసుకొచ్చాడు. మొత్తం మీద కియారా పోస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.

ఇప్పటికే వీరి పెళ్లిపై పలు ఇంగ్లీష్ పత్రికలు వార్తలను ప్రచురిస్తూ వస్తున్నాయి. అయితే గతంలో కియారా-మల్హోత్రా వివాహానికి వేదిక సిద్దమైందంటూ వార్తలు వచ్చాయి. గుజరాత్ లో ని ఒబేరాయ్ సుఖ్ విల్లా స్పా రిసార్ట్ ను  వివాహ వేడుక కోసం కియాా జంట సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇదే ప్రదేశంలో బాలీవుడ్ కు చెందిన రాజ్ కుమార్-పత్రలేఖ పెళ్లి కూడా జరిగింది. అయితే ముందు గోవాలో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేయాలని ఆలోచించినా.. తర్వాత సిద్దార్థ్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని గుజరాత్ కు మారినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కియారా ఏం చెప్పాలని అనుకుంటుందో తెలియాలంటే డిసెంబరు 2 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

కియారా ప్రస్తతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. హిందీలో 'ఎం.ఎస్.ధోని' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కియార తర్వాత తెలుగులో 'భరత్ అనే నేను' తో సినిమాలో కూడా నటించింది. అయితే హిందీ లోనే ఆమెకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. కియార ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తోంది. 

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

Published at : 28 Nov 2022 11:52 AM (IST) Tags: Kiara Advani Sidharth Malhotra Kiara-Sidharth Wedding

సంబంధిత కథనాలు

Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు

Pathaan Movie: ‘పఠాన్’ మూవీ గురించి మీకు తెలియని 8 ఇంట్రెస్టింగ్ విషయాలు

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam