Sarkaru Vaari Paata: 'మహేష్ ఫ్యాన్స్ కు ఇదొక ట్రీట్' - 'సర్కారు వారి పాట' సినిమాపై కీర్తి కామెంట్
తాజాగా 'సర్కారు వారి పాట' డబ్బింగ్ ను పూర్తి చేసింది కీర్తి సురేష్. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్‌లో 'సర్కారు వారి పాట' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ విడుదల కాగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 12న సినిమాను విడుదల చేయబోతున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేశారు.
'కళావతి', 'పెన్నీ సాంగ్', టైటిల్ సాంగ్ అన్నీ కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. మే 2న సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. దీని కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా సినిమా డబ్బింగ్ ను పూర్తి చేసింది కీర్తి సురేష్. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ.. 'సర్కారు వారి పాట' సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పింది.
ఇక ఆమె షేర్ చేసిన ఫొటోల్లో దర్శకుడు పరశురామ్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నారు.
మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: బ్రేకప్ తో బిజీగా ఉన్నావా? షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్లు
View this post on Instagram