By: ABP Desam | Updated at : 01 May 2022 03:25 PM (IST)
బ్రేకప్ తో బిజీగా ఉన్నావా? షణ్ముఖ్ పై నాగార్జున సెటైర్లు
బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక రెండు, మూడు రోజులుగా కంటెస్టెంట్స్ కి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు బిగ్ బాస్. ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ ను హౌస్ లోకి పంపించారు. ఇక వీకెండ్ లో హౌస్ మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ను, మరికొందరి పేరెంట్స్ ను, బంధువులను స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. వారిని చూసి మరోసారి సర్‌ప్రైజ్ అయ్యారు కంటెస్టెంట్స్.
దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అఖిల్ కోసం సోహైల్ స్టేజ్ పైకి వచ్చి.. తన ఫ్రెండ్ ను తెగ పొగిడేశాడు. 'నాకోసం కూడా చెప్పరా..' అంటూ అరియనా మధ్యలో లేచి నిలబడింది. దీంతో సోహైల్ తనదైన స్టయిల్ లో పంచ్ ఇచ్చాడు. ఆ తరువాత షణ్ముఖ్.. యాంకర్ శివ కోసం స్టేజ్ పైకి వచ్చాడు. షణ్ముఖ్ ని చూసిన హోస్ట్ నాగార్జున 'బిగ్ బాస్ తరువాత ఎక్కడా కనిపించలేదేంటి..? బ్రేకప్ తో బిజీగా ఉన్నావా..?' అని ప్రశ్నించడంతో నవ్వేసి ఊరుకున్నాడు షణ్ముఖ్.
ఆ వెంటనే అషురెడ్డి.. 'దీప్తి ఎలా ఉంది..?' అని షణ్ముఖ్ ని అడిగింది. దానికి షణ్ముఖ్.. 'అషుకి నోటి దురద' అంటూ కౌంటర్ వేశాడు. అనంతరం సిరిని స్టేజ్ పై చూసి ఎమోషనల్ అయింది మిత్రాశర్మ. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్.. మిత్రా మంచి ఫ్రెండ్స్. అనిల్ కోసం అతడి తండ్రి, అరియనా కోసం ఆమె సోదరి, దేవి నాగవల్లి స్టేజ్ పైకి వచ్చారు. షో కోసం వచ్చిన గెస్ట్ లను టాప్ 5లో ఎవరు ఉంటారో చెప్పమని గేమ్ ఆడించారు నాగార్జున.
Also Read: చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!
“SoKhil Forever” 🤜🤛
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 1, 2022
and we have more family & friends coming in! Don’t miss the Bigg Boss Non-Stop fun at 6PM with @iamnagarjuna on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/ubnvND20Cr
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
Samajika Nyaya Bheri: శ్రీకాకుళం నుంచి వైఎస్సార్సీపీ బస్సుయాత్ర ప్రారంభం - ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్న మంత్రులు
Simha Koduri As USTAAD: రాజమౌళి ఫ్యామిలీలో యంగ్ హీరో కొత్త సినిమాకు 'ఉస్తాద్' టైటిల్ ఖరారు
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?