Acharya Result Effect: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!

'ఆచార్య'తో దర్శకుడు కొరటాల శివకు భారీ నష్టం వాటిల్లిందా? ఆయనకు రూ. 25 కోట్లు కంటే ఎక్కువే పోతుందా? ఫిల్మ్ నగర్ టాక్ ఏంటంటే...

FOLLOW US: 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే అగ్ర దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇప్పటివరకు ఆయన తీసింది ఐదు చిత్రాలే (ఆచార్యతో కలిపి) అయినప్పటికీ... దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'మిర్చి' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల, ఆ తర్వాత మహేష్ బాబు కథానాయకుడిగా 'శ్రీమంతుడు' & 'భరత్ అనే నేను', ఎన్టీఆర్ హీరోగా 'జనతా గ్యారేజ్' చిత్రాలు తీశారు. బాక్సాఫీస్ దగ్గర అవన్నీ మంచి వసూళ్లు నమోదు చేశాయి. 'భరత్ అనే నేను' సినిమా పంపిణీ హక్కులు అమ్మే విషయం (బిజినెస్ డీల్స్) లో కొరటాల శివ క్రియాశీలకంగా వ్యవహరించారు. వల్ల ఆయనకు మంచి లాభాలు వచ్చాయని ట్రేడ్ పండితులు చెబుతుంటారు.

'ఆచార్య' (Acharya) సినిమాకు వస్తే... బిజినెస్ విషయంలో కొరటాల శివ అంతా తానై వ్యవహరించారట. సినిమా బడ్జెట్ మీద నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డికి 5 కోట్లు ఇచ్చేలా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అన్ని కొరటాల శివ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఓవర్సీస్, సీడెడ్ (రాయలసీమ) రైట్స్ అమ్మేసిన కొరటాల... ఆంధ్రాలో మెజారిటీ జిల్లాలో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేశారట. లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు సినిమాను ఇచ్చారట. నైజాం ఏరియాను వరంగల్ శ్రీనుతో కలిసి డిస్ట్రిబ్యూట్ చేశారని టాక్. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ముందుగానే అడ్వాన్సులు కట్టేశారట. దాంతో వడ్డీలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ ఖబర్.

'ఆచార్య' విడుదలకు ముందు బజ్ సరిగా ఏర్పడకపోవడంతో... ఆశించిన రీతిలో కొరటాల శివకు లోకల్ డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్సులు కట్ట లేదని తెలుస్తోంది. ఇప్పుడు సినిమా టాక్ ఏంటనేది అందరికీ తెలిసిందే. ప్రేక్షకులు ఏమాత్రం థియేటర్లకు వస్తారనేది ఎవరు సరిగా అంచనా వేయలేకపోతున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ లాభాల్లో వాటా తీసుకునేలా కాకుండా... విడుదలకు ముందే 75 కోట్లు తీసుకున్నారనేది మరో టాక్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో చిరంజీవి 5 కోట్లు వెనక్కి ఇచ్చారట. తన కథ, కథనం, దర్శకత్వంపై నమ్మకంతో బిజినెస్ వ్యవహారాలలో ఇన్వాల్వ్ అయిన కొరటాల శివ భారీగా నష్టపోవాల్సి వస్తోందని టాలీవుడ్ టాక్.

దర్శకుడిగా కొరటాల శివ (Koratala Siva) కు ఉన్న ఇమేజ్, పేరు వల్ల ఈజీగా 20 నుంచి 25 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కొంతమంది నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఆచార్యకు కూడా రెమ్యూనరేషన్ తీసుకోవాలని భావిస్తే... ఆయనకు 25 కోట్లు వచ్చేవే.‌ కానీ, కొరటాల శివ అలా చేయలేదు. తన సినిమాపై నమ్మకంతో పంపిణీ హక్కుల్లో వాటా తీసుకున్నారు. అదే కొంప ముంచిందని ఫిలిం నగర్ గుసగుస. ఆయన రెమ్యూనరేషన్ పక్కన పెడితే (Acharya Losses)... సినిమా విడుదలకు ముందు ఫైనాన్షియర్లకు డబ్బులు ఇవ్వడానికి జేబులో డబ్బులు బయటకు తీయాల్సి వచ్చిందట.

Also Read: కొరటాలతో ఎన్టీఆర్ సినిమాపై 'ఆచార్య' ఎఫెక్ట్? ఆందోళనలో యంగ్ టైగర్ ఫ్యాన్స్??

సినిమాకు ఇంత అని పారితోషికం తీసుకుని ఉంటే... కొరటాల శివ జేబులోంచి పాతిక కోట్లు ఎటూ పోయేవి కాదు. ఇప్పుడు అసలు కాదు, వడ్డీ కట్టాల్సి వచ్చిందని అంటున్నారు. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం (పంపిణీ హక్కుల్లో వాటా తీసుకోవడం) కాస్ట్‌లీ మిస్టేక్‌గా అయ్యిందని టాలీవుడ్ జనాల గుసగుస.

Also Read: 'ఆచార్య' రివ్యూ: చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే?

Published at : 30 Apr 2022 08:53 AM (IST) Tags: Koratala siva Achaya Movie Acharya Losses Koatala Shiva To Bare Acharya Loss Acharya Result Effect On Koratala Siva

సంబంధిత కథనాలు

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

టాప్ స్టోరీస్

Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Mahanadu Chandrababu :  నేను వస్తా.. దోచినదంతా  కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్