Sammathame Teaser: రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'సమ్మతమే' టీజర్
'సమ్మతమే' సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం.
తెలుగులో 'రాజావారు రాణి గారు', 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' వంటి సినిమాల్లో హీరో నటించారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు 'సమ్మతమే' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. రీసెంట్ గా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. జూన్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఐ లవ్‌యూ కృష్ణ అంటూ ఓ అమ్మాయి ప్రపోజల్‌తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో పెళ్లికి ముందు ప్రేమ పడదండీ, అందులో నేను పడను అంటూ తన క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ తనకు తెలీకుండానే హీరోయిన్‌తో ఎలా లవ్‌లో పడ్డాడు? అసలది ప్రేమే అని ఎలా తెలుసుకున్నాడనే విషయాలను టీజర్ లో చూపించారు. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.ప్రవీణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా తెలుగమ్మాయి చాందిని చౌదరి నటిస్తోంది. ఈమె విశాఖపట్నానికి చెందిన అమ్మాయి. 2012లో 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' లో చాలా చిన్న పాత్ర చేసింది. ఆ తరువాత 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో హీరోయిన్ గా మారింది. 'కలర్ ఫోటో' సినిమా ఆమెకు మంచిపేరు తీసుకొచ్చింది.
Also Read: చిరంజీవి, రామ్ చరణ్ 'ఆచార్య' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Also Read: 'ఆచార్య'తో కొరటాల శివకు 25 కోట్లు లాస్? వచ్చేది పోయె, వస్తుందని అనుకున్నదీ పోయె!
View this post on Instagram