By: ABP Desam | Updated at : 26 Jan 2022 02:58 PM (IST)
బ్యాడ్ లక్ రూమర్స్ పై కీర్తి స్ట్రాంగ్ కౌంటర్..
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది.
2021, నవంబర్ 26న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించిన కొన్ని రోజులకు పరిస్థితుల దృష్ట్యా.. డిసెంబర్ 10న రిలీజ్ చేస్తామని చెప్పారు. అప్పుడు కూడా సినిమా రాలేదు. ఇప్పుడు జనవరి 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కీర్తిని బ్యాడ్ లక్ వెంటాడుతోందని.. అందుకే సినిమా ఆలస్యమవుతుందని వార్తలను ప్రచురించారు.
ఈరోజు జరగబోయే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఆయనకు కోవిడ్ రావడంతో రామ్ చరణ్ వస్తున్నారు. దీంతో మరోసారి కీర్తి బ్యాడ్ లక్ రూమర్స్ మొదలయ్యాయి. కీర్తి సినిమాకి అన్నీ అడ్డంకులే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ రూమర్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
'లక్కు లే.. గిక్కు లే.. నా రిలీజ్‌కి..' అంటూ ట్విట్టర్ లో 15 సెకన్ల పాటను షేర్ చేసింది. 'మీ కూతలతో నాకస్సలు ఏం పనిలే.. నా రాతని నేనిలా రాసేస్తాలే..' అంటూ సాగే ఈ పాటతో గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికైనా ఆమెపై ఈ రూమర్లు ఆగుతాయేమో చూడాలి.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ షూటర్ పాత్రలో నిపించనుంది. ఓ పల్లెటూరి అమ్మాయి నేషనల్ లెవెల్ షూటర్ గా ఎలా ఎదిగిందనేదే సినిమా. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న 'గుడ్ లక్ సఖి' సినిమాని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్' బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Luck le gikku le na release ki. 🤧🤧 @shravyavarma @ThisIsDSP#GoodLuckSakhiOn28thJan https://t.co/xicwAxJ8Jy pic.twitter.com/2bZMbWkoJZ
— Keerthy Suresh (@KeerthyOfficial) January 26, 2022
Also Read: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?
Also Read: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..
Sriya Lenka: 'K-పాప్' ఆర్టిస్ట్ గా ఎన్నికైన ఇండియన్ అమ్మాయి - ఎవరంటే?
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !