Raviteja: 'రామారావు ఆన్ డ్యూటీ' కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..
రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే. విదేశాల్లో పాటలను చిత్రీకరించాలని చూస్తున్నారు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈరోజు రవితేజ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ట్రైన్ సన్నివేశం, రొమాంటిక్ ట్రాక్ తో పాటు యాక్షన్, ఫ్యామిలీ సీన్స్ పెట్టి డిజైన్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమాలో ట్రైన్ సన్నివేశం కీలకమని తెలుస్తోంది. పక్కా కమర్షియల్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సత్యన్ సూర్యన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు.
ఈ సినిమాతో పాటు రవితేజ లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి. ఇప్పటికే 'ఖిలాడి' షూటింగ్ పూర్తి చేశారు. అలానే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' అనే సినిమా లైన్ లో పెట్టారు. దీంతో పాటు సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇవన్నీ కూడా నిర్మాణదశలో ఉన్నాయి.
Team #RamaRaoOnDuty wishes Mass Maharaja @RaviTeja_offl a very Happy Birthday 💥💥#HappyBirthdayRaviteja#RamaRaoOnDutyFromMarch25 @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @sathyaDP @SamCSmusic @sahisuresh @RTTeamWorks pic.twitter.com/ZeyryNDGWo
— SLV Cinemas (@SLVCinemasOffl) January 26, 2022
Here's the MASSIVE Birthday CDP of @RaviTeja_offl Garu to kick start the celebrations :)#HappyBirthdayRaviteja 💥💥#RamaRaoOnDuty Mass poster tomorrow at 12:06 PM 😎
— SLV Cinemas (@SLVCinemasOffl) January 25, 2022
Stay tuned to @SLVCinemasOffl pic.twitter.com/d93R6AaHgr
Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..
Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి