Mahesh Babu: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..
ఇదివరకు సమంత, పూజాహెగ్డేలతో అలానే వరుసగా సినిమాలు చేశారు త్రివిక్రమ్. ఇప్పుడు సంయుక్తను తన ప్రాజెక్ట్ లలో రిపీట్ చేస్తున్నట్లు సమాచారం.

'భీమ్లానాయక్' సినిమాలో రానా భార్యగా ముందుగా ఐశ్వర్య రాజేష్ ను అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ను తీసుకున్నారు. అప్పటినుంచి దర్శకుడు త్రివిక్రమ్ ఈ బ్యూటీని తెగ ప్రమోట్ చేస్తున్నారు. ఆమె నటన, లుక్స్ ఆకట్టుకోవడంతో త్రివిక్రమ్ తన తదుపరి సినిమాల్లో ఆమెని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు సమంత, పూజాహెగ్డేలతో అలానే వరుసగా సినిమాలు చేశారు.
ఇప్పుడు సంయుక్తను తన ప్రాజెక్ట్ లలో రిపీట్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ నిర్మిస్తోన్న 'సార్' సినిమాలో సంయుక్తను హీరోయిన్ గా తీసుకున్నారు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు సినిమాలో కూడా సంయుక్తకు ఆఫర్ వచ్చినట్లు టాక్.
త్రివిక్రమ్ తన సినిమాల్లో కనీసం ఇద్దరు హీరోయిన్లు ఉండేలా చూసుకుంటారు. అక్క, మరదలి పాత్రల కోసం ఫేమ్ ఉన్న హీరోయిన్లను తీసుకుంటారు. 'జల్సా' నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే రిపీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్-త్రివిక్రమ్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది.
పూజాహెగ్డే సోదరి పాత్రలో సంయుక్త నటించనుందని తెలుస్తోంది. హీరోయిన్ సిస్టర్ రోల్ అయినప్పటికీ ఆమె పాత్రకి మంచి ప్రాముఖ్యత ఉంటుందని చెబుతున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు దుబాయ్ లో జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకొచ్చాయి. నిజానికి సంక్రాంతి తరువాత ఈ సినిమా మొదలవ్వాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమైంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?
Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















