By: ABP Desam | Updated at : 24 Jan 2022 01:09 PM (IST)
అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ పక్క నటిగా దూసుకుపోతూనే.. తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. బాలీవుడ్ లో నెపోటిజం, క్యాస్టింగ్ కౌచ్ ఇలా చాలా విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. స్టార్ కిడ్స్ ను డైరెక్ట్ గా ఎటాక్ చేస్తుంటుంది. రీసెంట్ గా రాజకీయాల్లో కూడా తలదూరుస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేస్తోంది.
తాజాగా మరోసారి బాలీవుడ్ పై మండిపడింది. సౌత్ స్టార్స్ ని పొగుడుతూ.. బాలీవుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా నార్త్ లో బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతుంది. అలానే యష్ నటించిన 'కేజీఎఫ్ 2' సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.
ఈ క్రమంలో అల్లు అర్జున్, యష్ ల ఫొటోలను షేర్ చేసిన కంగనా.. సౌత్ స్టార్స్ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారని.. వారు తమ కుటుంబాలకు, బంధాలకు ఎక్కువ విలువనిస్తారని.. సినిమాపై వారికున్న ప్యాషన్ ను దేనితో మ్యాచ్ చేయలేమని చెప్పింది కంగనా. సౌత్ హీరోలపై పొగడ్తలు కురిపిస్తూనే.. బాలీవుడ్ మిమ్మల్ని కరెప్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందని.. దాని వలలో పడొద్దని సూచించింది కంగనా. ప్రస్తుతం కంగనా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
'తలైవి' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ 'తేజస్' అనే సినిమాలో నటిస్తోంది. అలానే తన బ్యానర్ లో డైరెక్టర్ గా ఓ సినిమా చేయబోతుంది. వీటితో పాటు ఇందిరా గాంధీ బయోపిక్ లో ఆమె నటించనుందని తెలుస్తోంది.
Also Read: శ్రీముఖి పేరును చేతి మీద టాటూగా వేయించుకున్న క్రేజీ ఫ్యాన్
Also Read: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Balakrishna: బాలయ్య కథను లీక్ చేసిన దర్శకుడు - ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదే
JC Prabhakar Reddy : మంత్రుల బస్సు యాత్రపై రాళ్లు పడే అవకాశం, జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rainbow Island: సప్తవర్ణాల దీవి, అందులోని మట్టితో సాస్, మసాలాల తయారీ
In Pics : దావోస్ లో ఏపీ పెవిలియన్ ను ప్రారంభించిన సీఎం జగన్
Rashmi Gautham: పింక్ చీరలో బుట్టబొమ్మలా రష్మీ గౌతమ్