Konda Trailer: 'వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత'.. ఆర్జీవీ 'కొండా' ట్రైలర్ చూశారా..?
ఇప్పటికే విడుదలైన 'కొండా' సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా ఎవరి జీవితం ఆధారంగానైనా సినిమాలు చేసేస్తుంటారు. గతంలో పరిటాల రవి జీవిత కథాంశంతో వర్మ తెరకెక్కించిన 'రక్తచరిత్ర' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇదే తరహాలో ఆయన కొండా దంపతుల నిజజీవితకథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకి 'కొండా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
యంగ్ హీరో అదిత్ అరుణ్, వర్మ ‘భైరవగీత’ లో నటించిన ఐరా మోర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది. ఇందులో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ వినిపించాయి.
'పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. విపరీత పరిస్థితుల నుంచే విపరీతవ్యక్తులు ఉద్భవిస్తారని చచ్చి ఏలోకాన ఉన్నాడో కానీ కార్ల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్యలో పుట్టినవాడే కొండా మురళి' అంటూ తన హీరో క్యారెక్టర్ ను పరిచయం చేశారు ఆర్జీవీ.
ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్ లతో పాటు నక్సల్స్ బ్యాక్ డ్రాప్ కూడా చూపించారు. అలానే కొండా దంపతుల రాజకీయప్రవేశాన్ని కూడా టచ్ చేశారు. ఈ మధ్యకాలంలో ఆర్జీవీ నుంచి వచ్చిన సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమా ట్రైలర్ చాలా బెటర్ గా ఉంది. 'రక్తచరిత్ర' రేంజ్ లో 'కొండా' సినిమా తీయడానికి ప్రయత్నించినట్లు ఉన్నారు ఆర్జీవీ. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి హిట్ తీసుకొస్తుందో చూడాలి!
Here is KONDA film TRAILER , the story of an ultra dynamic couple KONDA MURALI and KONDA SUREKHA played by @ActorThrigun and @Irra_mor https://t.co/pNrxi7rHhG #KondaFilm
— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2022
Live link Konda trailer launch https://t.co/RlIvXM61iU
— Ram Gopal Varma (@RGVzoomin) January 26, 2022
Also Read: మహేష్ మరదలిగా మలయాళ బ్యూటీ.. త్రివిక్రమ్ తెగ ప్రమోట్ చేస్తున్నారుగా..
Also Read: నన్ను సినిమా నుంచి తప్పించాలని ఇరిటేట్ చేశారు.. రాజశేఖర్, జీవితలపై దర్శకుడి వ్యాఖ్యలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి