Karthika Deepam ఫిబ్రవరి 3 ఎపిసోడ్: డాక్టర్ బాబు ఆపరేషన్ చేసి కూతుర్ని బతికించాడు.. కానీ మోనితకి దొరికిపోయినట్టేనా... కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 3 గురువారం 1266 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం ఫిబ్రవరి 3 గురువారం ఎపిసోడ్
కొన్నిగంటల్లో ఆపరేషన్ చేయకపోతే పాపకి ప్రమాదం.. కానీ ఈ ఆపరేషన్ నేను చేయలేనని చెబుతాడు డాక్టర్ ధనుంజయ్. గతంలో ఆల్రెడీ పాపకి కార్తీక్ ఆపరేషన్ చేశారు కాబట్టి సమస్య ఏంటో, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆయనకే తెలుసు అంటాడు. దీంతో దీప నేను ఎలాగైనా కార్తీక్ సార్ కాళ్లు పట్టుకుని బతిమలాడుకుంటాను, మీరు ఏర్పాట్లు చేయండని చెబుతుంది దీప. అది సాధ్యమయ్యే పనికాదు..డాక్టర్ కార్తీక్ ని కలవాలంటే ఈ రోజు అపాయింట్ మెంట్ తీసుకుంటే వచ్చే నెల దొరుకుతుంది..అంత గొప్ప వ్యక్తి అపాయింట్ మెంట్ అంటే సాధ్యమా అంటారు. ఇదంతా విన్న కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతాడు.
Also Read: సౌందర్య ఫ్యామిలీని వెంటాడుతున్న రుద్రాణి, మోనిత… మళ్లీ రంగంలోకి దిగిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్…
నేను ఆపరేషన్ చేయడం ఏంటి..నా పిరిస్థితి తెలిసి ఎలా మాటిస్తావ్ అని అడుగుతాడు కార్తీక్. అత్తమ్మని కాపాడేందుకు ఇంతకన్నా మార్గం లేదు..మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది అంటుంది అంటుంది దీప. అత్తమ్మ ఆరోగ్యం కన్నా ఎక్కువా..మనసులో ఆలోచనలు తీసేయండి..వాళ్ల హాస్పిటల్లో ఆపరేషన్ చేసేందుకు ఒప్పుకున్నారు, డాక్టర్ కార్తీక్ వస్తే సరే అన్నారు..మీరే కార్తీక్ అని వాళ్లకి తెలియదు...శౌర్యకి ఆపరేషన్ అవకాశం మీకొచ్చింది..ఇంకా ఆలోచించకండి మీకు దండం పెడతాను.. ఇంత కష్టపడిందీ పిల్లల కోసం వాళ్ల భవిష్యత్ కోసమే కదా...తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఆరోగ్యం ఏంటో నాకన్నా మీకే బాగా తెలుసు...చూస్తూ చూస్తూ కళ్లముందే పిల్లని దూరం చేసుకుంటామా దాని ప్రాణాలు పోతే అని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తీక్ ని పెళ్లిచేసుకున్న దీపలా కాకుండా శౌర్య తల్లిగా అడుగుతున్నా..డాక్టర్ కార్తీక్ గారూ నా కూతురికి ప్రాణబిక్ష పెట్టండి మీ కాళ్లు పట్టుకుంటునంటుంది దీప.
Also Read: పాయసం పంచుకున్న రిషి-వసు.. జగతిపై దేవయాని మరోకుట్ర.. గుప్పెడంతమనసు బుధవారం ఎపిసోడ్..
మరోవైపు కోటేష్ బిడ్డని ఎత్తుకెళ్లిన వీడియో చూస్తూ మోనిత బాధపడుతుంది. కార్తీక్ ఎక్కడున్నాడో.. పది రోజుల్లో కార్తీక్ ని వెతికి పట్టుకోగలనా, ఇది అయ్యే పనేనా అనుకుంటూ గెలవాలనే కసితో కార్తీక్ ని, బాబుని కనిపెడతావ్, నువ్వు గెలవాలి, ఛాలెంజ్ విసరగానే సరిపోదు, గెలిచి చూపించాలి అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ భారతితో ఆవేశంలో ఓ పని చేశాను అనగానే నువ్వు అన్నీ ఆవేశంలోనే చేస్తావ్ అందులో కొత్తేముంది అంటుంది భారతి. పదిరోజుల్లో కార్తీక్ ని, బాబుని తీసుకొస్తానని శపథం చేశానంటుంది మోనిత. అదెలా సాధ్యం అని భారతి అంటే..సాధ్యం అవుతుందని చెబుతుంది. ఫోన్ ద్వారా ట్రేస్ చేయొచ్చు కానీ పోన్ లేకపోవడంతో కష్టమవుతోంది. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానులే అంటుంది. నా ప్రేమే కార్తీక్ ని నన్ను కలుపుతుంది...నా బాబుని నా దగ్గరకు రప్పిస్తుంది.. కార్తీక్ వచ్చాక డాక్టర్ గా ప్రాక్ట్రీస్ చేయొచ్చా, తనని మెడికల్ అసోసియేషన్ ఒప్పుకుంటుందా..నేను ఊరు వెళుతున్నాను, నువ్వు వస్తావా అంటుంది. నా ఫ్రెండ్ అంజలి కాల్ చేసి రమ్మంది వెళుతున్నా అంటుంది. నువ్వు వస్తావా అంటే నేను కార్తీక్ ని, బాబుని వెతకాలి అంటుంది మోనిత. అంతలోనే...ఏమో అదే ఊర్లో కార్తీక్ ఉన్నాడేమో అని ఆలోచించిన మోనిత సరే నేను కూడా వస్తానంటుంది.
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని అన్నట్టున్న వసు-రిషి, ఊహల్లో గౌతమ్... గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్..
కట్ చేస్తే రుద్రాణి ఇంటి ముందు తిరుగుతూ రగిలిపోతుంటుంది. ఇప్పటి వరకూ అనుకున్న ఏ పనీ ఆగలేదు.. వీళ్లు నాతో ఆడుకుంటున్నారు ఈ ఆట ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటుంది. వాళ్లని వదిలేది లేదు..హిమని తీసుకురాకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు అనుకుంటుంది. అక్క వెతకమని చెప్పింది..వీళ్లు ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలియడం లేదనుకుంటారు ఇద్దరు రౌడీలు. ఇలా తలుచుకున్నామో లేదో అక్క కాల్ చేస్తోంది తిడుతుందేమో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తారు. దీప వాళ్లు ఏ హాస్పిటల్లో ఉన్నారో తొందరగా వెతికి చెప్పండి..చేతులు ఊపుకుంటూ వస్తే చేతులు విరగ్గొడతా జాగ్రత్త అంటుంది. ఆత్మాభిమానం ఉంది కానీ డబ్బుల్లేవ్... కష్టాల మీద కష్టాలు వస్తున్నాయ్.. వాటిని నాకు లాభంగా మార్చుకుందామనుకున్నా కుదరడం లేదు..వాళ్లు ఏ హాస్పిటల్లో ఉన్నారో తెలిస్తే అక్కడకు వెళ్లి వీరంగం వేస్తానంటుంది.
Also Read: శౌర్య బతకాలంటే డాక్టర్ కార్తీక్ రావాలన్న మరో డాక్టర్, రప్పిస్తా అన్న వంటలక్క.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
మరోవైపు శౌర్యకి ఆపరేషన్ చేయడానికి కార్తీక్ సిద్ధమవుతాడు. డాక్టర్ కార్తీక్ వచ్చారని ఓ నర్స్ వచ్చి డాక్టర్ అంజలికి చెబుతుంది. ఆమె షాక్ అవుతుంది. ఫేమస్ కార్డియాలజిస్ట్ మన హాస్పిటల్ కి వచ్చారా అంటూ వెళుతుంది.
రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన కార్తీక్...దీపని చూస్తూ బయటకు వెళ్లిపోతాడు.ఇంతలో బయటకు వచ్చిన డాక్టర్స్ కంగ్రాట్స్ ఆపరేషన్ సక్సెస్ అని చెబుతారు. ఇంతకీ మీ ఆయన ఏరి కనిపించడం లేదని అడిగితే..డాక్టర్ కార్తీక్ వైపు చూస్తూ నిలబడుతుంది దీప....
Also Read: మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ… జోరందుకున్న రిషి-వసు లవ్ ట్రాక్, గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్