అన్వేషించండి

Karthika Deepam ఫిబ్రవరి 2 ఎపిసోడ్: సౌందర్య ఫ్యామిలీని వెంటాడుతున్న రుద్రాణి, మోనిత… మళ్లీ రంగంలోకి దిగిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్…

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 2 బుధవారం 1265 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం ఫిబ్రవరి 2 బుధవారం ఎపిసోడ్

శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళ్లిన కార్తీక్, దీప కంగారు పడుతుంటారు. ఏ డాక్టరూ ముందుకు రాకపోవడంతో కార్తీక్ ట్రీట్మెంట్ మొదలుపెడతాడు.  ఇక తన క్యాబిన్ లో కూర్చున్న డాక్టర్ అక్కడ సీసీ ఫుటేజీ ఆధారంగా కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆశ్చర్యపోతుంటుంది.  కార్తీక్ ఎవరికీ కనిపించకుండా దీప వాళ్లను అడ్డుగా ఉండమని చెబుతాడు. అక్కడున్న నర్స్ వచ్చి ఏం చేస్తున్నారు..మీరు ట్రీట్మెంట్ ఎలా చేసుకుంటారని క్వశ్చన్ చేస్తుంది. వెంటనే మరో పేషెంట్ కి సీరియస్ గా ఉందని తెలిసి అక్కడి నుంచివెళుతుంది. కార్తీక్ మాత్రం శౌర్యని కాపాడే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగి అక్కడున్న స్టాఫ్ నర్స్ పై అరుస్తుంది. హాస్పిటల్ కి వచ్చి అన్నీ మీరే చేసుకుంటే మేం ఎందుకు ఇక్కడ..  మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండంటుంది డాక్టర్...

Also Read:   శౌర్య బతకాలంటే డాక్టర్ కార్తీక్ రావాలన్న మరో డాక్టర్, రప్పిస్తా అన్న వంటలక్క.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
మరోవైపు మోనిత.. ఆదిత్య, శ్రావ్య వాళ్లకు ఎదురుపడుతుంది. ఎప్పటిలా మాటల తూటాలు పేలుతాయి. మనం అంతా ఒక్కటే, అంతా ఒకేఫ్యామిలీ, నీ దీపూ గాడికి తమ్ముడిని ఇచ్చాను, ఆ ఇంటికి మరో వారసుడిని ఇచ్చాను అంటూ తన స్టైల్లో వాగుతూ ఉంటుంది. నీకు-మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు చేసిన పనులు వల్ల జరిగింది చాలు.. నాకు మా దీపక్కలా ఓపిక లేదు, నేను మా అమ్మ భాగ్యం టైప్.. ఇక్కడి నుంచి పో అని క్లాస్ వేస్తుంది శ్రావ్య. స్పందించిన మోనిత... చూడమ్మా చిట్టిచెల్లెలు అంటూ ...దీప పెద్ద కొడలు, నేను దేవుడిచ్చిన కోడలు, నువ్వు చిన్న కోడలివి అంటుంది. నన్ను ఇంట్లోకి రాకుండా చేయడంలో నీ పాత్ర కూడా ఉంది కదా అన్న మోనిత.. మీ అన్నయ్య, వదిన, పిల్లల్ని వెతక్కుండా గాలికి తిరిగుతున్నారేంటి... మీరే ఎక్కడైనా దాచి పెట్టారా.. మీరంతా ఏం చేసినా ఆ ఇంట్లోకి రావడాన్ని ఆపలేరు... పదిరోజుల్లో కార్తీక్, బాబులతో మీ ముందు ఉంటానని శపథం చేస్తుంది. 

Also Read: మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ… జోరందుకున్న రిషి-వసు లవ్ ట్రాక్, గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
డాక్టర్ దగ్గరకు వెళ్లిన దీప-కార్తీక్ ..శౌర్యకి ట్రీట్మెంట్ చేయాలని ప్రాధేయపడతారు. సొంత వైద్యం చేసుకుని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారని మండిపడుతుంది. కాసేపు బతిమలాడడంతో మరో డాక్టర్ కి రిఫర్ చేస్తానని చెప్పి డబ్బు ఏర్పాట్లు చేసుకోండి అంటుంది. డాక్టర్ ధనుంజయ్ దగ్గరకు పాపను తీసుకెళ్లండి అని చెబుతుంది. మరోవైపు  రుద్రాణి కూడా కార్తీక్, దీప గురించి ఆలోచిస్తూ కోపంతో రగిలిపోతుంది. వాళ్ళు ఎక్కడున్నారని తన మనుషులను అడుగుతుంది. వారిని ఎలాగైనా పట్టుకుంటానని.. ఏం చేసైనా సరే హిమను లాక్కుని తాడికొండలో ఇంకో రుద్రాణిని తయారు చేయబోతున్నా అంటుంది.  అటు హాస్పిటల్లో శౌర్య పరిస్థితి చూసిన డాక్టర్ ధనుంజయ్...పరిస్థితి సీరియస్ గానే ఉందంటాడు. గతంలో ఇలాంటి ట్రీట్మెంట్ జరిగిందా అంటే హార్ట్ కి సర్జరీ జరిగిందని చెబుతాడు కార్తీక్.  ఎవరు చేశారని అడిగితే... డాక్టర్ కార్తీక్ చేశారని చెబుతారు. అక్కడున్న డాక్టర్లిద్దరూ షాక్ అవుతారు..మీ పాపకి అంత పెద్ద డాక్టర్ ఎలా చేశారు, ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరకదు అంటారు. స్పందించిన దీప ... కార్తీక్ గారి ఇంట్లో వంటమనిషిగా చేశానంటుంది దీప. అయితే ఈ సర్జరీ చేయడం నా వల్ల కాదన్న ధనుంజయ్...మళ్లీ డాక్టర్ కార్తీక్ రావాలంటాడు. 

Also Read: దీప కన్నీళ్లకు కార్తీక్ కరుగుతాడా, కూతురికోసం మళ్లీ డాక్టర్ గా యూ టర్న్ తీసుకుంటాడా... కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
రేపటి( గురువారం) ఎపిసోడ్ 
ఏం చేయాలో అర్థంకావడం లేదు దీప అని కార్తీక్ తలపట్టుకుంటాడు. తన పరిస్థితేంటో నాకన్నా మీకే తెలుసుకదా..చూస్తూ చూస్తూ కళ్లముందే పిల్లని దూరం చేసుకుంటామా.. దాని ప్రాణాలు కాపాడండి అంటుంది. కోటు వేసుకుని డాక్టర్ బాబు రంగంలోకి దిగుతాడు. డాక్టర్ కార్తీక్ వచ్చారా అని హాస్పిటల్లో ఉన్న డాక్టర్ షాక్ అవుతుంది...

Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని అన్నట్టున్న వసు-రిషి, ఊహల్లో గౌతమ్... గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్..

టాప్ హెడ్ లైన్స్

Survival Thriller OTT : ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
ఫారెస్ట్‌లో డేంజరస్ జర్నీ - ఓటీటీలో రాజీవ్ కనకాల సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
Haiku Movie : కళ్లతో ఏ భాషైనా మాట్లాడే శ్రీదేవి - కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్లే మూవీ 'హైకూ'... నిర్మాత కోన వెంకట్
కళ్లతో ఏ భాషైనా మాట్లాడే శ్రీదేవి - కాలేజీ డేస్‌లోకి తీసుకెళ్లే మూవీ 'హైకూ'... నిర్మాత కోన వెంకట్
Spirit: దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
దీపావళి 2027కి 'స్పిరిట్'... 'ఫౌజీ'కి లైన్ క్లియర్, వెనక్కి వెళ్లిన సందీప్ రెడ్డి వంగా సినిమా
Allari Naresh Kanakadurga Song : ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ - అల్లరి నరేష్ మూవీ డివోషనల్ సాంగ్ లిరిక్స్
ఇంద్రకీలాద్రిపై లోకాలనేలే కనకదుర్గమ్మ - అల్లరి నరేష్ మూవీ డివోషనల్ సాంగ్ లిరిక్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Embed widget