Karthika Deepam ఫిబ్రవరి 1 ఎపిసోడ్: శౌర్య బతకాలంటే డాక్టర్ కార్తీక్ రావాలన్న మరో డాక్టర్, రప్పిస్తా అన్న వంటలక్క.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఫిబ్రవరి 1 మంగళవారం 1264 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం ఫిబ్రవరి 1 ఎపిసోడ్
రుద్రాణి దగ్గరికి వెళ్లిన హిమ...శౌర్య ప్రాణాలు కాపాడండి నేను మీతోనే ఉంటానని చెబుతుంది. సంతోషించిన రుద్రాణి హిమని దగ్గరకు తీసుకుని స్వీట్స్ తినిపిస్తుంది. అయినా శౌర్యకి ఆరోగ్యం బాగాలేదని ఏడుస్తుంది. పెంపకం అంటే ఇలా ఉండాలంటుంది రుద్రాణి. ఇంతలో అక్కడకు వచ్చిన దీప రుద్రాణిపై ఫైర్ అవుతుంది. స్పందించిన హిమ...నాకు నేనుగా వచ్చాను, ఎవ్వరూ తీసుకు రాలేదు.. డబ్బులు తీసకుని శౌర్యకి ట్రీట్మెంట్ చేయించు అని అంటుంది. ఆవేశంగా సమాధానం చెప్పిన దీప హిమని తీసుకుని వెళ్లిపోతుంది. ఎంతోమందికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ బాబు చేతులు కట్టేశారు, నా అన్నవాళ్లకి దూరం చేశారని బాధపడుతుంది. ఊర్లో కనిపించిన వారందర్నీ వడ్డీకి డబ్బులిస్తారా అని అడుగుతుంది. ముక్కు మొహం తెలియని వాళ్లకి ఎవరైనా ఇస్తారా అనే సమాధానం వస్తుంది అందర్నుంచి. మళ్లీ దారిలో ఎదురుపడిన రుద్రాణి...అప్పులకోసం చెప్పులు అరిగేలా తిరిగి అలసిపోయినట్టున్నావ్.. నేనిస్తాను తీసుకో అంటుంది. ఎప్పటిలానే దీప అరుపులు..రుద్రాణి విసర్లు సాగుతాయి... ఎంత తిరిగినా నీకు తాడికొండలో అప్పు పుట్టదని చెబుతుంది. ఎంత తిరిగినా చివరకు నా దగ్గరకే రావాలని క్లారిటీ ఇస్తుంది.
Also Read: దీప కన్నీళ్లకు కార్తీక్ కరుగుతాడా, కూతురికోసం మళ్లీ డాక్టర్ గా యూ టర్న్ తీసుకుంటాడా... కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మరోవైపు శౌర్యని హాస్పిటల్ మారుస్తారు. అప్పారావ్ చెప్పిన అడ్రస్ ప్రకారం దీప హాస్పిటల్ కి వెళుతుంది. కార్తీక్ రిసెప్షన్ దగ్గర శౌర్య ప్రాబ్లెం గురించి చెబుతుంటే.. మీరే డాక్టర్ అయినట్టు మాట్లాడతారేంటి అంటారు. శౌర్య చూసి కార్తీక్ కంగారుపడుతుంటే స్ట్రెక్చర్ కావాలి పాపని పక్కన కూర్చోబెట్టమని చెబుతారు. పరిస్థితి చెబుతున్నా ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు, థియేటర్లో డాక్టర్లు బిజీగా ఉన్నారని కార్తీక్ చెబుతాడు. శౌర్యకి ఏమీకాదుకదా అని హిమ అంటే..నేనున్నాను కదా అన్న కార్తీక్ ( నీకు చెబుతున్నా లోపల నాకు ధైర్యం చెప్పేవారు లేరనుకుంటాడు). ఎవ్వరూ పట్టించుకోవడం లేదు గట్టిగా అడుగుదాం అని అప్పారావ్ అంటే..జేబులో డబ్బుల్లేనప్పుడు అడిగే హక్కు మనకు లేదని చెబుతాడు కార్తీక్.
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని అన్నట్టున్న వసు-రిషి, ఊహల్లో గౌతమ్... గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్..
మరోవైపు రుద్రాణి ఇంటి ముందు కూర్చుని..కోటేష్-శ్రీవల్లి అప్పు గురించి, కార్తీక్ సంతకం పెట్టిన విషయం గురించి మొత్తం కథ తన దగ్గరున్న రౌడీలకు గుర్తుచేస్తుంది. డబ్బైనా వసూలు చేయాలి లేదా హిమన అయినా తెచ్చుకోవాలి అంటుంది. వాళ్లని పరామర్శించేందుకు వెళదాం బండి తీయండి అంటుంది. ఏ హాస్పిటల్స్ కి వెళ్లారో వెతికి పట్టుకుందాం పదండి అంటుంది రుద్రాణి. హాస్పిటల్లో మాత్రం సేమ్ సీన్... రౌడీ అని కార్తీక్, అత్తమ్మ అని దీప ఏడుస్తూనే ఉంటారు. ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండండని చెప్పి కార్తీక్ బయటకు వెళతాడు. అటు రుద్రాణి ప్రతి హాస్పిటల్ తిరుగుతుంటుంది. కట్ చేస్తే కార్తీక్ మెడికల్ షాపులో వేరేవాళ్లు అడిగిన మందులు లేవని చెబితే.. వేర్ మందులు సజెస్ట్ చేస్తాడు. మెడికల్ షాప్ లో ఉన్న వ్యక్తి మీరు డాక్టరా అని అడిగితే ఒకప్పుడు మెడికల్ షాప్ ఉండేదని చెబుతాడు. తన దగ్గరున్న డబ్బులతో శౌర్యకి అవసరమైన మందులు కొని తీసుకెళతాడు.
రేపటి (బుధవారం) ఎపిసోడ్ లో
ఇది చాలా క్రిటకిల్ సర్జరీ... డాక్టర్ కార్తీక్ తప్ప ఎవ్వరూ చేయలేరంటాడు అక్కడి డాక్టర్. స్పందించిన దీప..డాక్టర్ కార్తీ ఇంట్లో నేను నెల రోజులు వంటమనిషిగా పనిచేశాను ఆయన్ని పిలిపించుకుంటానంటుంది. దీప భర్త కార్తీక్ గా కాదు..శౌర్య తల్లి దీపగా అడుగుతుననా నా కూతుర్ని బతికించండి అని కార్తీక్ ని కన్నీళ్లతో ప్రాధేయపడుతుంది. మరి కార్తీక్ ఏం చేయబోతున్నాడో చూడాలి...
Also Read: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
Also Read: చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్