News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Karthika Deepam జనవరి 29 ఎపిసోడ్: డాక్టర్ బాబుకి మరీ ఈ రేంజ్ కష్టాలా, శౌర్య ఆపరేషన్ కోసం హిమ త్యాగం..కార్తీకదీపం శనివారం ఎపిసోడ్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 29 శనివారం 1262 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 
Share:

కార్తీకదీపం జనవరి 29 శనివారం ఎపిసోడ్

స్కిప్పింగ్ ఆడుతూ శౌర్య కిందపడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లేందుకుడబ్బుల్లేక దీప-కార్తీక్ టెన్షన్ పడతారు.  తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి అడిగి తీసుకొద్దామని ప్రకృతి ఆశ్రమానికి వెళితే అప్పటికే అక్కడి నుంచి సౌందర్య, ఆనందరావు వెళ్లిపోతారు. నిరాశగా వెనుతిరిగిన కార్తీక్ హోటల్ యజమాని దగ్గరకు వెళ్లి డబ్బులు అడుగుదాం అనుకుంటాడు. ఇంతలో కార్తీక్ ఎక్కడున్నా తీసుకురమ్మని రుద్రాణి చెప్పడంతో ఇద్దరు రౌడీలు ఊరంతా తిరుగుతారు. ఎదురుపడిన కార్తీక్ ని అడ్డుకుని రుద్రాణి రమ్మందని చెప్పడంతో.. నా బిడ్డకు బాలేదు అర్జెంటుగా వెళ్లాలంటాడు కార్తీక్. పిల్లల విషయంలో అబద్ధం చెబుతున్నావా, అసలు వాళ్లు నీ బిడ్డలేనా అన్న రౌడీలపై చేయి ఎత్తినకార్తీక్ కొట్టకుండా పక్కకు తోసేసి సైకిల్ పై వెళ్లిపోతాడు.  వాళ్లు వెంటపెడతారు.

Also Read: శౌర్యకి ట్రీట్మెంట్, రుద్రాణికి చెక్.. సౌందర్య రీఎంట్రీతో తాడికొండ ఎపిసోడ్ ముగుస్తుందా.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
మరోవైపు ఇంట్లో శౌర్య... నాకు అస్సలు బాలేదు అమ్మా ... నాన్న ఇంకా రాలేదంటమ్మా.. నానమ్మ-తాతయ్యని చూడాలని ఉందని ఏడుస్తుంది. భారతంలో కర్ణుడిలా అయిపోయింది డాక్టర్ బాబు పరిస్థితి అని బాధపడుతుంది దీప. ఇప్పటికైనా నానమ్మ-తాతయ్యకి కాల్ చేద్దాం, వాళ్లు వచ్చి శౌర్యని హాస్పిటల్ కి తీసుకెళతారు, ఇంకా ఎందుకు ఇలా ఉంటున్నాం, ఎప్పటికీ హైదరాబాద్ వెళ్లమా అని హిమ క్వశ్చన్స్ వేస్తుంటే..దీప ఇప్పుడేం మాట్లాడకు అంటుంది. అటు డబ్బులకోసం హోటల్ కి వెళ్లిన కార్తీక్ ...అప్పారావ్ గురించి వెతుకుతాడు. హోటల్లో ఉన్న సర్వర్ ని అడిగితే యజమాని బయటకు వెళ్లారు, అప్పారావ్ సంతకి వెళ్లాడంటాడు. ఇంతలో రుద్రాణి మనుషులు అక్కడకు కూడా వచ్చి తమతో రావాలని గొడవ చేస్తారు. మీరు మా వెంట వచ్చేవరకూ మీ వెంట పడుతూనే ఉంటాం అనడంతో రుద్రాణి దగ్గరే తేల్చుకుంటా అంటూ వెళతాడు కార్తీక్. 

Also Read: చీకటి గదిలో రిషి-వసుధార, గౌతమ్ కి ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.. గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్
ఎక్కడికి వెళ్లారుడాక్టర్ బాబు , తొందరగా రండి నా గుండె ఆగిపోతోందని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో నానమ్మ, తాతయ్యలకు, బాబాయ్ కి కాల్ చేయమ్మా హాస్పిటల్ కి వెళదాం అని హిమ అంటుంది. మరోవైపు రుద్రాణి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్... డబ్బులిస్తానని చెప్పాకదా నీ ప్రాబ్లెమ్ ఏంటని అడుగుతాడు. నా కూతురికి బాలేదు వెళుతున్నా..నీ బాధల్లో నేను ఉంటే అక్క రమ్మంటుంది అంటారు.. మీ ప్రాబ్లెమ్ ఏంటి రుద్రాణి గారు, డబ్బులిస్తానని సంతకం పెట్టాకదా అని ఫైర్ అవుతాడు. స్పందించిన రుద్రాణి ఏంటి సారూ మీరు చెప్పేది నేను నమ్ముతున్నా కానీ డబ్బులిచ్చే వారికి సెంటిమెంట్స్ ఉండవు , ముందు నా బాకీ కట్టి ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తావో నీ ఇష్టం అంటుంది. మీ డబ్బులివ్వకుండా తాడికొండ గ్రామం వదిలి వెళ్లను, నేను వెళుతుంటే వీరు నా వెంట రావడం, నేను అరవడం నచ్చకే నా అంతట నేనుగా ఇక్కడకు వచ్చానంటాడు. 

Also Read:  సంతోషంలో జగతి, మహేంద్ర.. వసుపై రిషి స్పెషల్ కేర్.. గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
తనని చూసి ఏడుస్తున్న హిమని చూసి...నువ్వు ఏడ్వకు, నీకు ఏడిస్తే జ్వరం వస్తుంది కదా అంటుంది శౌర్య. అమ్మా నాకు ఒకసారి అందర్నీ చూడాలని ఉందంటుంది. అత్తమ్మ నువ్వు ఇవన్నీ ఆలోచించకు అంటుంది దీప. ఇంతలో అక్కడకు వచ్చిన అప్పారావ్ ఏమైంది అక్కా అని అడుగుతాడు. పాపకి ఒంట్లో బాగాలేదని హోటల్ ఓనర్ని డబ్బులు అడిగాడట..మీ ఇద్దరూ భార్య,భర్త అని హోటల్ ఓనర్ చెప్పాడక్కా అంటాడు అప్పారావ్. మనకు ఎవరైనా వడ్డీకి డబ్బులిచ్చేవారున్నారా అని అడిగితే ఏదైనా బంగారం పెడితేనే ఇస్తారక్క అంటాడు. పాపం డాక్టర్ బాబు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏంటో అనుకుంటుంది. మరోవైపు రుద్రాణి ఇంటినుంచి బయలుదేరిన కార్తీక్ ని ఒక్క నిముషం సారూ అని అగమని చెప్పి.. 5 లక్షలు ఇస్తుంది. పిల్లలంటే నాకిష్టం, పిల్లలంటే నాకు ప్రేమ అందుకే మీకు ఈ డబ్బు ఇస్తున్నాను తీసుకో సారూ అంటుంది. కార్తీక్ ఆలోచనలో పడతాడు..

రేపటి ఎపిసోడ్ లో
పాతబాకీ రద్దుచేస్తాను, ఇప్పుడిస్తున్నది అప్పేకాదు... బదులుగా ఈ బంగారాన్ని ఇవ్వండని హిమని చూపించి అడుగుతుంది రుద్రాణి. దీప-కార్తీక్ కోప్పడటంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే నేరుగా రుద్రాణి ఇంటికి వెళ్లిన హిమ... నేను మీ దగ్గరే ఉంటాను డబ్బులివ్వండి ఆంటీ అని అడుగుతుంది. రుద్రాణి మురిసిపోతుంది....

Also Read: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్

Published at : 29 Jan 2022 08:38 AM (IST) Tags: Karthika Deepam Nirupam Paritala doctor babu premi viswanath Monitha Karthik Deepa Small Screen Serials Rudrani karthika Deepam Serial Today Episode karthika deepam latest episode Sobha Shetty Vantalakka కార్తీక దీపం కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ Karthika Deepam Written Update Future story of Karthika Deepam Nirupam Paritala as Karthik Premi Viswanath as Deepa Shobha Shetty as Monitha Bhavana Reddy as Rudraani. Written UpdateKarthika Deepam 29 January 2022

ఇవి కూడా చూడండి

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

Lyca Productions: మలయాళంలో లైకా ప్రొడక్షన్స్ ఎంట్రీ - బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘కేజీయఫ్ 3’ అప్‌డేట్, ‘స్కంద’ కలెక్షన్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Siddharth: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Ram Charan 16 Heroine : రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ హీరోయిన్ - నిర్మాత కుమార్తె?

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా

టాప్ స్టోరీస్

Harish Rao : చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు !

Harish Rao :  చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరం - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు !

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Rs 2,000 Exchange Deadline: రూ. 2000 నోట్లు మార్చుకోలేదా, అయితే మీకు RBI శుభవార్త - చివరి తేదీ ఇదే

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Nara Lokesh: టీడీపీ ఎంపీలతో నారా లోకేష్ అత్యవసర భేటీ, నోటీసులపై చర్చ

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?

Aston Martin DB12: ఆస్టన్ మార్టిన్ డీబీ12 లాంచ్ చేసిన కంపెనీ - మనదేశంలో ఎంత ధర?