Karthika Deepam జనవరి 27 ఎపిసోడ్: శౌర్య అనారోగ్యం కార్తీక్ ని తల్లిదండ్రులకు దగ్గరయ్యేలా చేస్తుందా.. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 27 గురువారం 1260 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం జనవరి 27 గురువారం ఎపిసోడ్
హోటల్లో సర్వర్ గా పనిచేస్తున్న కార్తీక్ ని చూసిన దీప ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ పనిచేస్తున్నారా అయ్యో దేవుడా ఏంటిది అని ఏడుస్తుంది. ఇది చూడ్డానికిగా నేను బతికింది, ఇది చూడ్డానికా పదకొండేళ్లు ఊపిరి బిగపట్టి కష్టాలను ఓర్చుకుంది...ఏంటిది..ఈ చేతులతో ఒకప్పుడు మీరు చేసిన పనేంటి, ఇప్పుడు చేస్తున్న పనేంటి...ఈ పని చేసేముందు నా గొంతునొక్కి చంపేసి ఉన్నా బావుండేది..నేను బతికి ఉండగా మిమ్మల్ని ఇలా చూడలేనండీ.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ నేను పోషించుకుంటాను మిమ్మల్ని..మీరొక డాక్టర్ మీరు గర్వంగా బతకాని..ఆనంద్ ని తీసుకుని ఇంటికెళ్లండి..మిమ్మల్ని ఇలా చూస్తూ వీడుకూడా ఏడుస్తున్నాడు తీసుకెళ్లండి అని కార్తీక్ ని పంపించేస్తుంది.
Also Read: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టిందా, డాక్టర్ బాబుపై అలిగిన వంటలక్క … కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
ఇంతలో అక్కడకు వచ్చిన హోటల్ యజమాని కార్తీక్ ని చూపించి ఆయన అనగానే..మా ఆయన అంటుంది. చీటీ ఇచ్చేవాడు సాయంత్రం వస్తాఅన్నాడు అని యజమాని చెప్పడంతో అప్పటి వరకూ ఇక్కడే ఉంటాను..ఎవరూ లేరుకదా పని చూసుకుంటా అంటుంది. మరోవైపు శ్రావ్య ఆదిత్యతో ఏంటి ఇంత లేట్ చేశావ్.. కాల్ చేద్దామంటే నా ఫోన్ రిపేర్ కి ఇచ్చాను అంటుంది. అప్పుడు ఆదిత్యకి తనఫోన్ గుర్తుకురావడంతో ఫోన్ కారుపై పెట్టి మర్చిపోయాను ఎవరు తీసుకెళ్లారో ఏమో, అందులో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెబుతాడు. ప్రకృతి వైద్యశాలలో సిబ్బంది..ఆనందరావు దగ్గరకు వచ్చి.... జరిగిన సంఘటనలతో మీరు, మేము ఇబ్బంది పడుతున్నాం..కొన్నాళ్లు మరో ఆశ్రమంలో ఉండటమే మంచిదని చెబుతాడు. రుద్రాణిని మేడం గారు కొట్టినప్పటి నుంచీ ఎవరెవరో వచ్చి అడిగి వెళుతున్నారు. ప్రశాంతత ఉండదు..అందుకే వేరే మాది వేరే బ్రాంచ్ ఉంది అక్కడకు వెళ్లాలని చెబితే సరే అంటాడు ఆనందరావు.
Also Read: దేవయానికి భారీ షాకిచ్చిన రిషి, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
మరోవైపు దీపతో మాట్లాడేందుకు కార్తీక్ ప్రయత్నించినా కోపంతో వెళ్లిపోతుంది. నీ కోపాన్ని భరించగలను కానీ నీ మౌనాన్ని భరించలేను మాట్లాడు అనడంతో.. మీరు మాటిస్తేనే మాట్లాడతాను అంటుంది. ఏం చేయాలని అడిగిన కార్తీక్ తో..ఈ చేతులు కొన్ని వందలమంది ప్రాణాలు కాపాడాయి,ఈ చేతుల్లో గొప్ప శక్తి ఉంది, భగవంతుడి ప్రతిరూపాల్లాంటి ఈ చేతులు ప్రసాదాలు స్వీకరించాలి కానీ ఎంగిలి మెతుకులు ఎత్తడానికి కాదుకదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. వేరే పని దొరక్క అని కార్తీక్ చెప్పేలోగా..నాలుగు రోజులు పస్తులుంటే పులి గడ్డి తింటుందా అని అడుగుతుంది. దేవుడులాంటి డాక్టర్ బాబు ఇలా చేస్తే అది మీకు కాదు నాకు మంచిది కాదని ఏడుస్తుంది. మరోసారి ఇలాంటి పని చేయనని మాటివ్వమని అడుగుతుంది. మరి నన్నేం చేయమంటావ్ అంటే.. చేస్తే వైద్యం చేయాలి లేదంటే మహారాజులా కూర్చోవాలని చెబుతుంది.
Also Read: ఎందుకిలా చేశారంటూ కార్తీక్ ని కాలర్ పట్టుకుని కన్నీళ్లతో ప్రశ్నించిన దీప.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్….
కొద్దిసేపైన తర్వాత కూడా కార్తీక్ ఒంటరిగా కూర్చోవడం చూసి మళ్లీ దగ్గరకు వస్తుంది దీప. నాపై కోపం మొత్తం పోయిందా అంటే..కోపం ఎందుకుంటుంది, హోటల్లో పనిచేయడం చూసి తట్టుకోలేకపోయా అంటుంది. పసిపిల్లాడిలాంటి మీపై అలకే తప్ప కోపం ఉండదన్న దీపతో..నేను పసిపిల్లాడిని కాదు రాక్షసుడిని అంటాడు. ఏమైంది అంటే..నీ దగ్గర ఓ విషయం దాచానంటూ నాకు మమ్మీ, డాడీ కనిపించారు, ప్రకృతి వైద్యశాలలో ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళితే అక్కడ దిక్కులేనివాళ్లలా మమ్మీ, డాడీ కనిపించారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒకే ఊర్లో ఉన్నాం, వాళ్లిక్కడే ఉన్నారని తెలిసి కూడా చాటుగా చూశానే కానీ పలకరించలేదు, ఇంతకన్నా దుర్మార్గం ఇంకేముంటుందని బాధపడతాడు. ఎన్ని తప్పులు, పొరపాట్లు చేసినా అన్నిటినీ వాళ్లు భరించారు, గొప్ప తల్లిదండ్రులు దీపా వాళ్లు.. హోటల్ నుంచి పార్సిల్ తెప్పించుకుని తింటున్నారు, ఏమైందో ఎందుకొచ్చారో తెలియదు, డాడీ మాట్లాడుతుంటే తలుపుచాటునుంచి వినాల్సి వచ్చిందంటూఆనందరావు చెప్పిన మాటలు దీపకు చెబుతాడు. ఆ మాట వినికూడా నేనిక్కడే ఉన్నానని చెప్పలేకపోయాను..ఇంత రాక్షసుడిగా మారిపోయానేంటి అంటాడు. స్పందించిన దీప ఏదో ఒకరోజు కలుస్తాం కదా అంటుంది. చివరకు వాళ్లను చూసిన విషయం నీ దగ్గర కూడా చెప్పలేదు అనగానే.. దీప కూడా ఆ విషయం నేను కూడా దాచానని అత్తమామల్ని చూసిన విషయం చెబుతుంది. ఎపిసోడ్ ముగిసింది...
Also Read: తండ్రి సంతోషం కోసం ఓ మెట్టుదిగిన రిషి, గుండెల్ని మెలిపెట్టిన గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
స్కిప్పింగ్ చేస్తూ శౌర్య కిందపడిపోతుంది. శౌర్యకి ఏమైందని దీప కంగారుపడుతుంటే తనని అర్జెంట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పి డబ్బులున్నాయా అని అడుగుతాడు కార్తీక్. దీప లేవని చెప్పడంతో వెంటనే సైకిల్ పై ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరుతాడు కార్తీక్. అయితే అక్కడి నుంచి సౌందర్య, ఆనందరావు వెళ్లిపోయారన్న విషయం కార్తీక్ కి ఇంకా తెలియదు.. మరి ఏం జరుగుతుందో చూడాలి...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి