By: ABP Desam | Updated at : 26 Jan 2022 08:25 AM (IST)
Edited By: RamaLakshmibai
karKarthika Deepam 26 January Episode (Image Credit: Star Maa/Hot Star)
కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్
రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప షాక్ అవుతుంది. మంగళవారం ఎపిసోడ్ ఇలా ముగిసి..బుధవారం ఎపిసోడ్ దీప ఆలోచనలతో ప్రారంభమైంది. వాళ్లు అలా అన్నారంటే రుద్రాణి మళ్లీ ఏదైనా చేస్తోందా అనే ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే హోటల్లో యజమానిని కాకా పట్టే పనిలో పడతాడు అప్పారావు. మరోవైపు కార్తీక్ దగ్గరకు వెళ్లి నా పని కూడా నువ్వే చేస్తే నేను సినిమాకు వెళ్లొస్తా అని అడుగుతాడు. కార్తీక్ సరే అనడంతో సంతోషంగా వెళ్లిపోతాడు అప్పారావు.
Also Read: ఎందుకిలా చేశారంటూ కార్తీక్ ని కాలర్ పట్టుకుని కన్నీళ్లతో ప్రశ్నించిన దీప.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్….
వంటలక్క ప్రజావైద్యశాలో మోనిత దగ్గర సీన్ ఓపెన్ అవుతుంది. తన ఫొటో తానే చూసుకుంటూ ఇంత అందంగా ఉన్నావ్, అన్ని మెట్లు దిగావ్ అయినా కార్తీక్ మనసు మెప్పించలేకపోయావ్ ఏంటి , ఎక్కడో లోపం జరిగింది ఆలోచించు అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్ భారతి... మోనితకు క్లాస్ వేస్తుంది. కష్టాలు పడతావు, వాటిని కష్టాలుగా ఫీలవవు, ఇప్పటికే నీ లైఫ్ లో చాలా కోల్పోయావ్, లైఫ్ లో ఏదో ఒక లక్ష్యం ఉండాలికదా అంటే.. ఉన్నాయికదా వన్, టూ, త్రీ అన్నీ కార్తీక్ అని సమాధానం చెబుతుంది మోనిత. అయితే నువ్వు నాపై కన్సర్న్ కన్నా కార్తీక్ పైనే ఎక్కువ ఉన్నట్టుందని ప్రశ్నిస్తుంది. ఎన్నో సర్జరీలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న కార్తీక్ కి అలా అవడం ఏంటని అంటుంది. కాఫీతో కార్తీక్ కథ మారిపోతుందంటూ ప్లాన్ చేసిన విషయం మోనిత గుర్తుచేసుకుంటుంది. అయితే భారతి మాత్రం నువ్వే ఏదో చేసి ఉంటాయని అడిగితే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది మోనిత.
Also Read: తండ్రి సంతోషం కోసం ఓ మెట్టుదిగిన రిషి, గుండెల్ని మెలిపెట్టిన గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
ఆ బంగరామ్మ చీటీ ఇచ్చేట్టులేదు అందుకే హోటల్ ఓనర్ కి తెలిసిన వాళ్ల దగ్గర చీటీవేయించి మొదటి నెల ఇప్పిస్తానన్నారు అంటూ బాబు ఆనంద్ తో మాట్లాడుతూ హోటల్ కి వెళుతుంది దీప. నువ్వు కూడా మీ నాన్నలా తెల్లకోటులో కనిపిస్తే చాలా బావుంటారు కదా అంటుంది. దారిలో ఎదురైన అప్పారావుని ఎక్కడికి వెళుతున్నావ్ అని దీప అడిగితే సినిమాకు వెళుతున్నా.. నా పని నా జూనియర్ చూసుకుంటాడులే, నా అసిస్టెంట్ అక్కా అని చెబుతాడు. ఫొటో చూపించేందుకు ప్రయత్నించినా వద్దులే అప్పారావ్ అనేసి వెళ్లిపోతుంది దీప.
Also Read: మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మరోవైపు బయటకు వెళ్లిన మోనిత..ఆదిత్యను చూసి బావున్నావా.. వదినా బావున్నావా అని అడగవేంటి అంటుంది. నువ్వు నా వదినవేంటి అని చిరాకు పడతాడు. అత్తయ్య, మావయ్యలు ఎలా ఉన్నారు, నా చెల్లెలు శ్రావ్యను అడిగానని చెప్పు... ఇంతకీ కార్తీక్ వాళ్లు ఎక్కడున్నారో చెప్పవా అంటుంది. నాపై జాలివేయడం లేదా అని అడిగిన మోనితతో.. అన్నయ్య వాళ్లు వెళ్లారన్న బాధలో నాన్న అనారోగ్యం పాలయ్యారు, నీ కారణంగా అందరం దూరమయ్యాం..నీకు వంద నమస్కారాలు చేస్తాం నా ఫ్యామిలీ జోలికి రాకు అంటాడు. నీకే వంద దండాలు పెడతా నా కార్తీక్ ఎక్కడున్నాడో చెప్పు అంటుంది. మనిషికో మాట అనేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు ఆదిత్య. ఫోన్ మర్చిపోయిన విషయం గమనించిన మోనిత శాడిజం చూపిస్తూ కారు చక్రాల కింద పెట్టి తొక్కించేస్తుంది..
Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
పార్సిల్ ఇచ్చివస్తానని కార్తీక్ బయలుదేరుతుంటే అప్పారావు లేడుకదా ఇక్కడెవరు చూసుకుంటారు ఆ పార్సిన్ నేను ఇచ్చేసి వస్తానని యజమాని తీసుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన దీప యజమాని చేతిలో పార్సిల్ చూసి నేను ఇచ్చేసి వస్తానంటుంది. ఆ తర్వాత లోపలకు వెళ్లిన దీప..టేబుల్ తుడుస్తున్న కార్తీక్ ని చూసి షాక్ అవుతుంది. డాక్టర్ గా తాను పొందిన సన్మానాలు తల్చుకుని ఎవండీ మీరు చేస్తున్న పనేంటని ఒక్కసారిగా అరుస్తుంది. ఎపిసోడ్ ముగిసింది..
రేపటి ఎపిసోడ్ లో
ఇంటికి వెళ్లిన కార్తీక్... దీపతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే దీప తప్పించుకుని వెళ్లిపోతుంటుంది...
Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Mahesh Babu Proud Of Gautam: పదో తరగతి పూర్తి చేసిన కుమారుడు, జర్మనీలో మహేష్ అండ్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్
Pawan Kalyan In F3 Movie: 'ఎఫ్ 3'లో పవర్ స్టార్ - పవన్ సహా టాలీవుడ్ టాప్ హీరోలను వాడేసిన అనిల్
Suriya 41 Not Shelved: సినిమా ఆగలేదు - పుకార్లకు చెక్ పెట్టిన హీరో సూర్య
Vikram Movie Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో కమల్ హాసన్ 'విక్రమ్' ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందంటే?
Pakka Commercial 2nd Single: రాశి, అందాల రాశి - హీరోయిన్ పేరు మీద 'పక్కా కమర్షియల్' సినిమాలో సాంగ్, రిలీజ్ ఎప్పుడు అంటే?
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Bengal Cabinet: మొన్న తమిళనాడు, నేడు బంగాల్- కేంద్రానికి షాక్లు, గవర్నర్ అధికారాల్లో కోతలు!
MK Stalin With PM : తమిళాన్ని అధికార భాషగా గుర్తించాలి - మోదీని స్టేజ్పైనే అడిగిన స్టాలిన్ !
PM Modi Hyderabad Tour: కేసీఆర్పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం