(Source: ECI/ABP News/ABP Majha)
Guppedantha Manasu జనవరి 24 ఎపిసోడ్: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. హాస్పిటల్ నుంచి ఇంటికి చేరిన మహేంద్ర..జగతి ఆలోచనల్లో గడుపుతాడు. అటు జగతి కూడా మహేంద్ర ఆలోచనల్లో ఉంటుంది. జనవరి 24 శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు జనవరి 24 సోమవారం ఎపిసోడ్...
మహేంద్రని హాస్పిటల్ నుంచి ఇంటికి చేర్చిన తర్వాత జగతి-వసుధార ఇద్దరూ ఇంటికి వెళుతూ మాట్లాడుకుంటారు. శనివారం ఎపిసోడ్ ఇక్కడే ముగిసి..సోమవారం ఎపిసోడ్ ఇద్దరి మాటలతో మొదలైంది. అవకాశం ఉన్నప్పుడు కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలని..అది గడప కాదు సీతారాముల్ని విడదీసిన లక్ష్మణ రేఖ అని అంటుంది. మనల్ని డ్రాప్ చేసిరమ్మని రిషి కృతజ్ఞత చూపించాడు.. నేను సున్నితంగా తిరస్కరించాను అది అలా ఉంచుకోవడమే మంచిది.. ఆ ఇల్లు నన్ను మర్చిపోయింది వసు అని బాధపడుతుంది.
Also Read: మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మహేంద్ర-రిషి
మరోవైపు మహేంద్రకి సేవలు చేస్తుంటాడు రిషి. డాడ్ నేను మీదగ్గరే ఉంటాను, మీ గదిలోనే పడుకుంటాను అంటే..నేను బాగానే ఉన్నాను కదా అంటే మీరెలా ఉన్నారో మీకన్నా నాకే ఎక్కువ తెలుసు డాడ్ అంటాడు. అందరూ నాపై అలిగినట్టు నా గుండె కూడా అలిగినట్టు ప్రయత్నించిదేమో అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు నవ్వుతున్నారు అంటే.. నవ్వు దేవుడిచ్చిన వరం, ఏడుపు కూడా వరమే... నవ్వలేక ఏడ్చారు అంటారు కానీ అదినిజం కాదు ఏడవలేక ఏడుపు రాక చాలామంది నవ్వు నటిస్తుంటారు అన్న మహేంద్ర మాటలు విని రిషి ఏమోషనల్ అవుతాడు. మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు అంటే.. నాకేం కాదు నువ్వు అనవసరంగా భయపడుతున్నావని ఓదారుస్తాడు మహేంద్ర. నువ్వు చిన్నపిల్లాడివి కాదు కాలేజీకి ఎండీవి.. జీవితంలో అన్నింటినీ సమానంగా స్వీకరించాలి.. పుట్టుక ఎంత సహజమో చావుకూడా అంతే సహజం అంటాడు. ఇలా మాట్లాడొద్దు,నేను కాలేజీకి ఎండీ కావొచ్చు కానీ మీరు నా జీవితానికి ఎండీ..మీముందు నేనింకా చిన్నపిల్లాడినే అంటాడు రిషి. డాడ్ మీరు ఏం భారం మోస్తున్నారు మనసులో మీకు ఎందుకిలా అయింది అన్న రిషి మాటలు విని నవ్వుతాడు మహేంద్ర. నాకేం కాలేదు ఐ యామ్ ఆల్ రైట్..నువ్వు నాకోసం ఇబ్బంది పడకు అంటే.. మీకోసం చేసే ఏ చిన్న పనైనా నాకు ఆనందాన్నిస్తుందని రిషి..ఈ మాట నువ్వు చెప్పాలా నాకు తెలియదా నేను బాగానే ఉన్నాను వెళ్లు పనులు చూసుకో అంటాడు మహేంద్ర. మీకన్నా ముఖ్యమైన పనులు నాకేం లేవు నేను ఇక్కడే ఉంటానని మహేంద్ర ఒళ్లో పడుకుంటాడు.
Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
మీరు తినాలి అని చెప్పిన వసుతో..మహేంద్రకి బాగాలేకపోతే ఎలా తినగలుగుతా అంటుంది జగతి. మహేంద్ర ఎలా ఉన్నాడో , ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ట్యాబ్లెట్స్ వేసుకున్నాడో లేదో అని జగతి ఆలోచిస్తుంటే మహేంద్ర సార్ కాల్ చేస్తే మీరు తినలేదని చెబుతాను అంటుంది వసుధార. వెంటనే జగతి తినేస్తుంది. అటు పాలు తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు రిషి. నువ్వు తిన్నావా అంటే మీ కడుపునిండాకే నేను తింటా అన్న రిషితో.. మానవ సంబంధాలు ఎంత గొప్పవో కదా అంటాడు మహేంద్ర. మనిషి సుఖాల వెంట పరుగులు తీస్తున్నాడు కానీ మానవ సంబంధాల నీడలో ఎంత హాయిగా సేదతీరచ్చో అంటుండగా జగతి సెల్ నుంచి వసు కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రిషితో మహేంద్ర సార్ ఎలా ఉన్నారని అడుగుతుంది. సమాధానం చెప్పకుండానే కాల్ కట్ చేస్తాడు. మీ ఫోన్ స్విచ్చాఫ్ చేస్తానంటాడు...కొన్ని సంతోష పెట్టే కాల్స్ కూడా ఉంటాయి కదా అనగానే.. తన సెల్ నుంచి వసు సెల్ కి వీడియో కాల్ చేస్తాడు రిషి. మహేంద్రని చూపించి, మందులు వేసినట్టు ప్రూఫ్స్ చూపించి.. డాడ్ కి నేనున్నాను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తాడు. మీకు నిద్ర అవసరం పడుకోండి అని రిషి అంటే.. మంచి నిద్ర అవసరం అని సమాధానం చెబుతాడు మహేంద్ర.
Also Read: జగతిని లోపలకు రమ్మని పిలిచి… రిషి దేవయానికి షాకివ్వబోతున్నాడా, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్..
ఫోన్ కాల్ చేసిన రిషి సార్..మహేంద్ర సార్ తో మాట్లాడించవచ్చు కదా అన్న వసుతో... నువ్వు మహేంద్రకి ఫోన్ ఇవ్వకపోవడం గురించి మాత్రమే ఆలోచించావు కానీ ఫోన్ ఎందుకు ఇవ్వడం లేదని నేను ఆలోచించాను. మహేంద్రనే రిషికి తల్లి, తండ్రి,స్నేహితుడు...అందుకే ఫోన్ కాల్స్ లో పరామర్శలు విని బాధపడతాడని రిషి..మహేంద్రతో మాట్లాడించాడు. నా అంచనా నిజమైతే మహేంద్ర ఫోన్ రిషి స్విచ్చాఫ్ చేసి ఉంటాడంటుంది..వెంటనే వసు చెక్ చేసి మీరు ఊహించింది నిజమే అంటుంది. ఎంత కాదన్నా తను నన్ను కాదనుకున్నా నా కొడుకే కదా.. రిషి.. మహేంద్రని అపురూపంగా చూసుకుంటాడు అదే నాకు తృప్తిగా ఉంటుంది అంటుంది జగతి. మనం ప్రేమించే వారిని కన్నా మనల్ని ప్రేమించే వారిని ప్రేమగా చూసుకుంటే మనసుకి ఆనందం... నేను మహేంద్ర దగ్గర లేనేమో కానీ తన మనసులో నేనున్నా అనుకుంటుంది. పొద్దున్నే మహేంద్ర తాను ఇంట్లో అడుగుపెట్టినప్పుడు తన వదిన దేవయాని జగతిని అవమానించిన ఘటన గుర్తుచేసుకుంటాడు. అటు జగతి కూడా.. తనకు జరిగిన అవమానం తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మహేంద్ర నిద్రపోయి ఉంటాడా అని జగతి... జగతి నిద్రపోయి ఉంటుందా అని మహేంద్ర ఆలోచిస్తుంటారు.
రేపటి ఎపిసోడ్ లో
నిద్రపోవచ్చు కదా అని రిషి అంటే.. నిద్రపట్టాలి కదా అంటాడు మహేంద్ర. మీకేం కావాలి అంటే సంతోషం అంటాడు. మిమ్మల్ని సంతోషంగా ఉంచాలంటే నేను ఏం చేయాలి అన్న రిషితో.. జగతి అని సమాధానం చెబుతాడు.. కోరుకున్నంత మాత్రాన అన్నీ చేరవు కదా రిషి అంటాడు మహేంద్ర. వసుని కలసిన రిషి..చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి నా పర్సనల్ మేటర్ అంటాడు.
Also Read: డాక్టర్ బాబుది ఆ సీరియల్ అయిపోయింది, మరి నెక్ట్స్ ఏంటి నిరుపమ్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి