By: ABP Desam | Updated at : 21 Jan 2022 09:44 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu January 21 Episode (Image Credit: Star Maa/Hot Star)
హాస్పిటల్లో ఉన్న మహేంద్ర గురించి రిషికి ఏదో చెబుదాం అని ప్రయత్నించిన జగతి మాటలకు అడ్డకట్ట వేస్తాడు రిషి. మీకన్నా ఆయనతో ఎక్కువ రోజులు ఉన్నది నేనే నాకు మాత్రమే తెలుసు అనేసి ఆమెని మాట్లాడనివ్వడు. తనని అపురూపంగా చూసుకోవాలి అని జగతి అంటే..డాడ్ విషయంలో మీరు నాకు హితబోధ చేయడానికి అస్సలు ప్రయత్నించకండి.. అసలు డాడ్ మనసులో మీరే ఏదైనా కొత్త సమస్యను నింపారేమో అని రివర్సవుతాడు. వసుధారకి సంబంధించిన విషయంలో నా ప్రమేయం ఉందని మీరే డాడ్ కి చెప్పారేమో, వసుని మీ ఇంట్లోంచి వెళ్లిపోవాలని నేను చెప్పింది కూడా ఆమెపై అనవసరమైన ఒత్తిడి పెరగకూడదని మాత్రమే మీపై కోపంతో కాదంటాడు రిషి. ఈ విషయాన్ని డాడ్ కి చెప్పారా లేదా అని రిషి అడుగుతుండగా అక్కడకు వచ్చిన వసుధార..మహేంద్ర సార్ మీ ఇద్దర్నీ రమ్మంటున్నారని చెబుతుంది.
Also Read: మోనిత బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణిపై దీప ఫైర్.. కార్తీక్ ని సౌందర్య చూస్తుందా… కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్..
హమ్మయ్య అంకుల్ కి ఏంకాలేదు అంటాడు గౌతమ్. గండం నుంచి బయటపడ్డాడని ఫణీంద్ర, ధరణి అంటే..గండం నుంచి బయటపడ్డాడు కానీ అసలు ఆ గండం ఎందుకొచ్చిందో ఆలోచించారా అంటుంది దేవయాని. మీరు మహేంద్రని గాలికి వదిలేశారు, పట్టించుకోండని ఎంత చెప్పినా వినలేదు , ఆ ప్రాజెక్ట్ వల్లే ఇలా అయిపోయాడు అంటుంది దేవయాని. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మొదలయ్యాకే ఇంట్లో, కాలేజీలో తలనొప్పులు మొదలయ్యాయంటుంది దేవయాని. అసలే మహేంద్రకి అలా అయిందని నేను బాధపడుతుంటే నువ్వేంటి ఏదేదో చెబుతావ్, కొంచెం సేపు సైలెంట్ గా ఉండు అని తిడతాడు ఫణీంద్ర.
Also Read: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా.. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్..
తన దగ్గర కూర్చున్న కొడుకు రిషి..భార్య జగతితో మాట్లాడతాడు మహేంద్ర. ఇంత వరకూ తెచ్చుకున్నావేంటి అంటే..నాకేం అవుతుంది జగతి..అయితే నీ దగ్గర లేదంటే రిషి దగ్గరుంటా అంటాడు. నేను చాలాసార్లు కాల్ చేశాను సార్ అని జగతి అంటే నేను ఫోన్ దూరంగా పెట్టాను మేడం అంటాడు. రాత్రి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా వెళ్లి కాస్త రెస్టు తీసుకో అంటాడు మహేంద్ర. ఇప్పటికే ఇందరకీ దూరంగా వెళ్లిపోయాను మహేంద్ర, ఇక రెస్ట్ అంటావా.. 22 ఏళ్లకు పైగా ఒంటరిగా రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను..ఇలాంటి పరిస్థితుల్లో నేనుంటే నువ్వు విడిచి వెళ్లగలవా చెప్పు..వెళ్లవు కదా.. నీకు గుర్తుందా మహేంద్ర..నాకు బుల్లెట్ తగిలినప్పుడు నువ్వెంత ఆరాటపడ్డావో , టెన్షన్ పడ్డావో కదా.. ఎవరు వద్దన్నా అందర్నీ ఎదిరించి నన్ను ఆసుపత్రిలో చేర్పించి రాత్రంతా అక్కడే ఉన్నావు కదా మహేంద్ర అప్పుడు నువ్వు నన్ను వదిలి ఎందుకు వెళ్లలేదో..ఇప్పుడు నేనూ అందుకే వదిలి వెళ్లలేను అంటుంది.
Also Read: రుద్రాణి ఆగడాలకి సౌందర్య చెక్ పెట్టనుందా.. దీప-కార్తీక్ ఇప్పుడేం చేయబోతున్నారు
జగతి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావ్ అని మహేంద్ర అంటే..జీవితంలో నువ్వు అలసిపోతున్నావ్ మహేంద్ర.. సమస్యలు,నిందలు, సూటిపోటి మాటలు, ప్రశ్నలు అడిగితే చెప్పలేని పరిస్థితిని అందమైన చిరునవ్వుతో కప్పుకుని నువ్వు అలసిపోతున్నావ్. నీ చిరునవ్వుల వెనుక విషాదం నా ఒక్కదానికే తెలుసు అంటుంది. ఏంటి జగతి నన్నెందుకు సడెన్ గా గొప్పవాడిని చేస్తున్నావ్ అంటే.. నా భుజానికి బుల్లెట్ తగిలితే నీ గుండెకు తగిలినట్టు బాధపడ్డావ్.. మనం దూరమైనందుకు నాకు మాత్రమే అన్యాయం జరిగింది అనుకుంటారు కానీ...నలిగిపోతున్న మనసుతో వెలిగిపోతున్న నీ మొహం వెనుక బాధ ఎవరికి తెలుసు.. నాకు తెలుసు..నా ఒక్కదానికే తెలుసు అంటుంది జగతి. ( గతంలో జగతి విషయంలో ప్రవర్తించిన విధానం గుర్తుచేసుకుంటాడు రిషి). ఇన్నాళ్లూ నేను ఎందుకిలా ఆలోచించలేకపోయాను, నన్ను వదిలి వెళ్లిపోయి శిక్ష నాకు పడిందనుకున్నాను కానీ... డాడ్ అంతకన్నా పెద్ద శిక్ష వేశానా అనుకుంటాడు. నేను శిక్షిస్తోంది డాడ్ నా... నాకోసమే జగతి మేడంకి దూరమయ్యారు.. నాకోసం కాకపోయినా డాడ్ కోసమైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందా అనుకుంటాడు రిషి.
Also Read: వసుకి మరోసారి బాధ్యత గుర్తుచేసిన మహేంద్ర, జగతి-రిషి మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
మహేంద్ర అని అరుచుకుంటూ లోపలకు వచ్చిన దేవయాని..జగతి వైపు గుడ్లు ఉరిమి చూస్తుంది. ఏంటీ ఘోరం , నీ కష్టాలు పోయాయనుకున్నాను, ఇంకా పోలేదన్నమాట అని శోకాలు పెడుతుంది. మహేంద్ర నువ్వు టెన్షన్ పడకు మేం అందరం ఉన్నాం కదా అని ఫణీంద్ర అంటే.. మనమే కదా ఉన్నాం.. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే వెళతారు కదా అంటుంది. కనేసి వదిలెళ్లిపోతే రిషిని కన్నబిడ్డలా చూసుకున్నా కదా అని దొంగ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా-నాన్న అన్నీ నువ్వే కదా ఏంటి మహేంద్ర నువ్వు అని తెగ నటించేస్తుంది. పెద్దమ్మా ఊరుకోండి డాడ్ బాగానే ఉన్నారు కదా..మీరు ఏడిస్తే నేను చూడలేను అంటాడు రిషి. జగతి అక్కడినుంచి బయటకు వెళ్లి వసుధార దగ్గర కూర్చుంటుంది. మీరు బయటకు వచ్చేశారేంటి అని వసు అడిగితే.. వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చేశారు కదా అంటే..మీరు కూడా ఆ కుటంబంలో సభ్యురాలే కదా అంటుంది వసుధార. ఆ కుటుంబం నా సభ్యత్వాన్ని ఎప్పుడో రద్దు చేశారు కదా అని చెబుతుంది. తల్లి స్థానాన్ని, భార్య స్థానాన్ని అడుక్కోలేం కదా అంటే..అది మీ హక్కు అంటుది వసు. సంస్థలోంచి కార్మికుడిని తీసేస్తే అడిగే హక్కు ఉంటుంది కానీ అమ్మ పోస్టులోంచి పొమ్మంటే అడిగే హక్కు లేదంటుంది. నీ ఆరోగ్యం, నీ ఆహారం ఈరోజు నుంచి నేను రిషి చూసుకుంటాం అంటారు దేవయాని,రిషి. వాళ్లిద్దరూ ఫిక్సయ్యాక ఏం చేయలేం నువ్వు పచ్చికూరగాయలకు ఫిక్సైపో అంటాడు ఫణీంద్ర.
Also Read: సౌందర్య, ఆనందరావు దగ్గరకు కార్తీక్.. దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
హాస్పిటల్ నుంచి మహేంద్రని ఇంటికి తీసుకొస్తారు. తూలి పడబోతున్న మహేంద్రని పట్టుకుంటుంది జగతి. నేను మాడాడ్ ని చూసుకుంటానని రిషి అనడంతో చేయి వదిలేస్తుంది. మహేంద్ర లోపలకు వెళుతుంటే జగతి అక్కడి ఆగిపోతుంది. ఈ గడప దాటి ఎప్పుడు లోపలకు వస్తావు అని మహేంద్ర...ఈ గడప దాటి ఎప్పటికీ లోపలకు రాలేనేమో మహేంద్ర అని జగతి అనుకుంటారు. తండ్రిని గమనించిన రిషి...ఒక్క నిముషం అని వెనక్కు తిరిగి జగతివైపు చూస్తాడు...
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని ... వసు మాటలకి ఉప్పొంగిన రిషి మనసు.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Nani: 'సరిపోదా శనివారం' విడుదల ఎప్పుడో చెప్పేసిన నాని!
Redin Kingsley Marriage: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
/body>