Guppedantha Manasu జనవరి 19 ఎపిసోడ్: వసుకి మరోసారి బాధ్యత గుర్తుచేసిన మహేంద్ర, జగతి-రిషి మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆసక్తిగా సాగుతోన్న సమయంలో.. మహేంద్ర ఆసుపత్రి పాలవడంతో కథ మరో మలుపు తిరిగింది.జనవరి 19 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంత మనసు జనవరి 19 బుధవారం ఎపిసోడ్
ఇంట్లో మాట్లాడుతూ గుండె నొప్పితో పడిపోయిన మహేంద్రని ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు జగతి, వసుధార. రిషి ఫోన్ ఎత్తకపోవడంతో గౌతమ్ కి కాల్ చేసి విషయం చెప్పిన వసుధార ఆసుపత్రికి రమ్మని చెబుతుంది. మంగళవారం ఎపిసోడ్ లో హైలెట్ ఇదే. బుధవారం ఎపిసోడ్ ఆసుపత్రి సీన్ తోనే ప్రారంభమైంది. ఎవరికి ఏమైంది, అంతా బాగానే ఉన్నారా అని రిషి వరుస క్వశ్చన్స్ వేస్తాడు. వసుధార నీకేం కాలేదు కదా అంటాడు...తర్వాత మేడం మీరేంటి ఇక్కడ..మేడం ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా క్వశ్చన్స్ వేస్తుంటాడు. రిషి ఎందుకురా అరుస్తావ్ అని గౌతమ్ అంటే రిషి మాత్రం అరుస్తూనే ఉంటాడు. లోపలున్నది మహేంద్ర సార్ అని చెబుతుంది వసు. డాడీకి ఏమైందని అడిగితే.. జగతి మేడం ఇంట్లో ఉన్నప్పుడు సార్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెబుతుంది వసుధార. ఆ మాట విని రిషి చాలా ఏమోషన్ అయిపోతాడు.
Also Read: సౌందర్య, ఆనందరావు దగ్గరకు కార్తీక్.. దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
ఇంతలో మహేంద్రని డాక్టర్స్ బయటకు తీసుకొస్తారు. ఆయన స్పృహలో లేరు..మైల్డ్ స్ట్రోక్ వచ్చిందంతే..కంగారు పడొద్దని చెబుతారు వైద్యులు. రిషి, జగతి ఆగకుండా ఏడుస్తూనే ఉంటారు. కాసేపట్లో స్పృహ వస్తుంది కంగారు పడొద్దని చెబుతారు. వాడికి అంకుల్ అంటే ప్రాణం, నాకు వాడికి పరిచయం అయ్యేసరికి వాళ్ల అమ్మ దూరమైంది, ఆమె గురించి అస్సలు మాట్లాడేవాడు కాదు, వాళ్ల అమ్మ ఫొటో ఇప్పటికీ నేను చూడలేదు, అంకులే వాడికి ప్రపంచం అని వసుధారతో అంటాడు గౌతమ్. ఆ మాటలకు వసు..జగతిని చూస్తూ ఉండిపోతుంది.
Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
బెడ్ పై ఉన్న మహేంద్ర పక్కనే రిషి కూర్చుని ఉంటాడు. జగతి నిలబడి ఉంటుంది. తండ్రితో తాను గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు రిషి. మేడం ఏం జరిగింది అని అడుగుతాడు. ఎందుకో తెలియదు ఎక్కువగా నవ్వేశారు..మాట్లాడుతూ నవ్వుతూ నవ్వుతూ ఒక్కసారిగా పడిపోయారని చెబుతుంది జగతి.. మహేంద్రకి ఇలా స్ట్రోక్ వస్తుందని అనుకోలేదు.. అందరికీ దూరమై ఒంటరిగా ఉన్న నాకు మిగిలిన ఏకైక మిత్రుడు మహేంద్ర మాత్రమే... తనకి ఏమైనా జరిగితే ఈ జగతి మరుక్షణమే తుదిశ్వాస వదులుతుంది అంటుంది. డాడ్..మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నా చలాకీగా నవ్వుతూ తిరిగే మీరు బెడ్ పై ఉండడం నచ్చలేదు డాడ్, అందరిలా ఏడ్చి నా బాధని వ్యక్తపరచలేను నాకు ఏడుపు రాదు..నేను ఏడవను..మీకు తెలుసు కదా.. కళ్లు తెరవండి డాడ్ అంటూనే ఏడుస్తాడు ..ప్రతిసారీ ఏదో ఒక కొటేషన్ చెబుతారు కదా చెప్పండి అంటూనే ఏడుస్తాడు రిషి.
Also Read: ఆసుపత్రి పాలైన మహేంద్ర, జగతి-వసుపై రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది.. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
కళ్లు తెరిచిన మహేంద్రని చూసి..రిషి మీకేం కాదు వీళ్లంతా ఏవేవో చెబుతారు నేను నమ్మను అంటాడు. ఏంటి భయపడ్డారా మహేంద్ర భూషన్ ఇక్కడ ..సన్నాఫ్ దేవేంద్ర భూషన్ నాకేం కాదు అంటాడు. నా పనైపోయింది అనుకున్నారా..నా గుండె ఆగిపోయినంత పనైంది..నువ్వు లేకుండా ఈ జగతి బతకదు అంటుంది. జగతి చావుకి ఎవరం అతీతులం కాదుకదా..మృత్యువు ఎప్పుడో ఓసార పలకరించకమానదు అన్న తండ్రితో రిషి..ఇలా మాట్లాడొద్దు అంటాడు. మీకేమైంది..మీ మనసులో ఏముంది..అంత ఆనందంగా ఉంటారు.. ఏమీ దాచుకోరు మీకు స్ట్రోక్ ఏంటి.. మీ గుండెల నిండా అందరిపైనా ప్రేమే ఉంటుంది మీకు గుండెపోటు ఏంటని అడుగుతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన డాక్టర్స్.. మీరు పక్కన కూర్చుని మాట్లాడుతూ పేషెంట్ ని ఇబ్బంది పెట్టొద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని చెబుతారు. ఆయన్ని సంతోషంగా ఉంచితే తొందరగా కోలుకుంటారని చెబుతాడు డాక్టర్.
రేపటి ఎపిసోడ్ లో
ఫస్ట్ టైం రిషి సార్ కళ్లలో కన్నీళ్లు చూశాను అంటుంది వసుధార. నీకు మళ్లీ గుర్తుచేస్తున్నా జగతి-రిషిని కలిపే బాధ్యత నీదే అంటాడు మహేంద్ర. కట్ చేస్తే సార్ మీతో మహేంద్ర గురించి మాట్లాడాలి అంటుంది... స్పందించిన రిషి.. ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయకండి అంటాడు.
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని ... వసు మాటలకి ఉప్పొంగిన రిషి మనసు.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి