Guppedantha Manasu జనవరి 17 ఎపిసోడ్: ఆసుపత్రి పాలైన మహేంద్ర, జగతి-వసుపై రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది.. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆసక్తిగా సాగుతోన్న సమయంలో.. మహేంద్ర ఆసుపత్రి పాలవడంతో కథ మరో మలుపు తిరిగేలా ఉంది..జనవరి 17 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంత మనసు జనవరి 17 సోమవారం ఎపిసోడ్
రిషితో రాయించిన లవ్ లెటర్ జగతి చింపేసిన విషయం గుర్తుచేసుకున్న గౌతమ్.. నా ప్రేమలేఖ ఇచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది అనుకుంటాడు గౌతమ్. రిషి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనుకునే లోగా.. వసు గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు రిషి. కట్ చేస్తే షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ రిషిసార్ కి మెయిల్ చేశాకదా కాల్ చేసి చెప్పనా అనుకుంటుంది. మెయిల్ చేశావు కదా కాల్ చేయాలా అంటారు..చేయకపోతే మెయిల్ చేశావు కదా కాల్ చేయాల్సిన అవసరం లేదా అంటారనుకుని కాల్ చేసేందుకు సిద్ధమవుతుంది వసుధార. అటు రిషి ఏదారెదురైనా అనే పాట పాడుకుంటూ ఉంటాడు...వసు కాల్ కట్ చేస్తాడు. రిషి కాల్ కట్ చేయడంతో మహేంద్రకి కాల్ చేసిన వసుధార.. సార్..రిషి సార్ తో మాట్లాడాలి ఆయన కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంటుంది. మరోవైపు రిషి పాటపాడుతుంటే అక్కడకు వెళతారు గౌతమ్, మహేంద్ర షాక్ లో చూస్తుంటారు. చుట్టూ నిల్చున్న వారిని కూడా పట్టించుకోకుండా కళ్లుమూసుకుని పాటపాడుకుంటూ ఉంటాడు. అటు వసుధార ఆ పాట రికార్డ్ చేసుకుంటుంది.
Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు... మూడింటిలో మొదటి అక్షరాలు కలిపితే 'సూచన'.. మిషన్ ఎడ్యుకేషన్లో మూడో లెవెల్ సూచన అంటుంది జగతి. సూర్య-చంద్ర నక్షత్రాలకు లింకేంటని అడిగిన వసుధారతో... విద్యార్థి జీవితంలో కూడా మూడు ఎపిసోడ్స్ ఉంటాయి. స్టడీ, ధృడ సంకల్పం, విజయం....సూర్య, చంద్రులు, నక్షత్రాలు అందరవీ..అలాగే మిషన్ ఎడ్యుకేషన్ కూడా అందరిదీ అని ఎక్స్ ప్లైన్ చేస్తుంది జగతి. కట్ చేస్తే ఇంట్లో కూర్చున్న రిషి...ఈ పొగరు కాల్ చేసింది ఎందుకో అనుకుని రిటన్ కాల్ చేస్తాడు. ఆ ఫోన్ రూమ్ లో వదిలేసిన వసుధార... రిషి కాల్ చూసుకోదు. అదే టైమ్ కి రూమ్ లోకి వచ్చిన గౌతమ్...నువ్వు కాల్ మాట్లాడుతున్నావా అంటూ వసుధార ఫొటో దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ చెబుతాడు...
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని ... వసు మాటలకి ఉప్పొంగిన రిషి మనసు.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
కాలేజీలో పెట్టిన నోటీస్ బోర్డు చూసి షార్ట్ ఫిలిం ఆలోచన కచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటుంది వసుధార. రిషి సార్ ఉంటే సక్సెస్ అవుతుందా అన్న పుష్పతో... జగతి మేడం ఉన్నారు కదా అందుకే సక్సెస్ అవుతుంది అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..మిషన్ ఎడ్యుకేషన్ సక్సెస్ లో నా వాటా లేదా అంటాడు..అది చెప్పబోతుంటేనే మీరు వచ్చారంటుంది. రాత్రి పెట్టిన మెయిల్ చూశా గుడ్ అనేసి వెళ్లిపోతాడు. ఆలోచన మేడంది ఆచరణ రిషి సార్ ది..ఆ విషయం చెప్పకముందే సార్ వచ్చారు అంటుంది... ఆమాటలు కూడా వింటాడు రిషి.
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
దేవయాని-మహేంద్ర-గౌతమ్
పెద్దమ్మా వీడేంటి ఇంత పొద్దున్నేబయటకు వెళ్లాడు అని గౌతమ్...దేవయానితో అంటాడు. నా బాధ ఎవ్వరకీ అర్థం కావడం లేదు..ఈ మధ్య రిషి ఎటు వెళుతున్నాడో అర్థం కావడం లేదు.. బుద్ధిగా ఉన్న రిషిని చాలామంది చెడగొడుతున్నారు, వేళాపాళా లేకుండా తిరుగుతున్నాడు అంటుంది దేవయాని...ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర వేళా-పాళా లేకుండా కష్టపడుతున్నాడు కాబట్టే కాలేజీకి అంత పేరు వచ్చింది వదినా అంటూ వస్తాడు. అంతేలే వాడొక్కడు కష్టపడుతుంటే పేరు మాత్రం అందరకీ వస్తుంది అన్న దేవయానికి..యుద్ధం సైనికులు చేస్తారు, గెలిచింది మాత్రం రాజు పేరే చెబుతారు..అంతమాత్రాన రాజు కష్టం లేదని కాదు కదా అని క్లారిటీ ఇస్తాడు. సైనికులు కష్టపడతారు, త్యాగాలు చేస్తారు కానీ గెలిచింది రాజు అంటారు అంతేకదా పెద్దమ్మా అంటాడు గౌతమ్.
Also Read: బస్తీలో జెండా పాతేసిన మోనిత, బాధలో కార్తీక్, దీప కథకు ఇక శుభం కార్డేనా... కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
దేవయాని-మహేంద్ర
నువ్వు అసలు రిషిని పట్టించుకోవడంలేదు, రిషిని గాలికి వదిలేశావ్, నేనేమైనా చెబితే నీకు తోచిన సమాధానాలు చెబుతావ్ అంటూ మళ్లీ డిస్కషన్ మొదలుపెడుతుంది దేవయాని.... వదినా వాడు చిన్న పిల్లాడు కాదు ఇలాంటి సలహాలు ఇవ్వలేం కదా..మీకేమైనా సలహాలు ఇవ్వాలని అనిపిస్తే ఇవ్వండి..నేను కాదని అనడం లేదుకదా అంటాడు మహేంద్ర. నా మాటగా చెప్పు పెద్దమ్మని బాధపెట్టకు అని దేవయాని అంటే...ఈ మాట రిషికి చెప్పొచ్చుకదా అంటాడు. చెప్పి మీరు బ్యాడ్ అవకూడదని అనుకుంటున్నారు కదూ నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. కొత్త మనుషులు ఉన్నారన్న ఇంగితం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా గౌతమ్ ముందు అంటుంది దేవయాని. మీరు అలా అనుకున్నారా నన్ను క్షమించండి... టాపిక్ మీరు తీశారు..నేను సమాధానం చెప్పాను.. రిషి గురించి గౌతమ్ వేరేలా అనుకోకూడదు కదా అన్న మహేంద్రతో... నీకన్నీ తెలిసే కావాలని చేస్తున్నావ్ అంటుంది దేవయాని. పెద్ద నాగలి ఎటుపోతే చిన్న నాగరి కూడా అటే పోతుంది అంటారు కదా..నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నా అని కౌంటర్ ఇస్తాడు మహేంద్ర.
Also Read: బస్తీవాసుల మనసు గెలుచుకున్న మోనిత, ఆవేదనలో డాక్టర్ బాబు.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
రిషిసార్ ఏం చేస్తున్నారో అనే ఆలోచనలో పడుతుంది వసుధార...మరోవైపు అదే చెట్టుకి అటువైపు రిషి నిల్చుని చూస్తుంటాడు. వసుధార సమ్ థింగ్ స్పెషల్ తను ప్రత్యేకమైన స్టూడెంట్ అనుకుంటాడు రిషి. ఇంతలో గౌతమ్..రిషికి కాల్ చేయడంతో వసు వెనక్కు చూసి మీరిక్కడ ఉన్నారా అని లేచి నిల్చుంటుంది. గౌతమ్ కాల్ రిసీవ్ చేసుకున్న రిషి...నాకోసం వెతక్కుండా నా క్యాబిన్లో కూర్చో అని కాల్ కట్ చేస్తాడు. నీ ఫ్రెండ్ పుష్పతో ఏదో చెబుతున్నావ్ అని ఆ టాపిక్ లేవనెత్తుతాడు రిషి. షార్ట్ ఫిలిం విజయం సాధించడంలో అని వసు మొదలెట్టగానే... నా ప్రమేయం ఉండదు అంతా మీ మేడందే అంటావ్ అంతే కదా అంటాడు. అదేంటి అలా అంటారు మీరు ఎంత గొప్పగా పాడారో తెలుసా అనగానే..నీకెలా తెలుసు అన్న రిషికి రికార్డ్ చేసిన పాట వినిపిస్తుంది. మహేంద్రసార్ కి కాల్ చేసి మీతో మాట్లాడాలి అని అడిగాను..సార్ మీ దగ్గరకు వచ్చేసరికి మీరు ఈ పాటపాడుతున్నారని చెబుతుంది... ఎపిసోడ్ ముగిసింది..
రేపటి ఎపిసోడ్ లో
జగతితో మాట్లాడుతూ, ఏదో చెబుతూ మహేంద్ర నవ్వుతూ కిందపడిపోతాడు...ఆసుపత్రికి తీసుకెళతారు...వసుధార ఆసుపత్రికి ఎందుకొచ్చాం..ఎవరికి ఏమైందని రిషి అడుగుతూ ఉంటాడు... వసు-జగతి ఏడుస్తుంటారు...
Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి