Guppedantha Manasu జనవరి 14 ఎపిసోడ్: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఆకలేస్తోందన్న రిషికి రోడ్డుపక్కనున్న టీ షాపులో టీ-బన్నులు కొనిచ్చి మరో జ్ఞాపకాన్నిచ్చింది వసుధార . జనవరి 14 శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
'గుప్పెడంత మనసు' జనవరి 14 శుక్రవారం ఎపిసోడ్
ఊహించని విధంగా దేవయానికి సారీ చెప్పి షాకిచ్చిన వసుధార..రిషితో కలసి బయటకు వెళ్లిపోతుంది. అదంతా తలుచుకుని దేవయాని రగిలిపోతుంది. కోపంతో దిండు విసిరేసిన దేవయాని అక్కడకు మహేంద్ర వచ్చిన విషయం చూడదు. ఈ విసిరి కొట్టడాలు, దూరంగా విసిరేయడాలు ఇంకా మీరు తగ్గించలేదా వదినా అంటాడు మహేంద్ర, నాకు నచ్చనివి విసిరేస్తుంటాను అవి వస్తువులైనా, మనుషులైనా అని సమాధానం చెబుతుంది దేవయాని. భూమి గుడ్రంగా ఉంటుంది వదినా.. మనం వద్దనుకున్నా అవి తిరిగి తిరిగి మన దగ్గరకే చేరుతాయి...మీరు విసిరేసినప్పుడు బలహీనంగా ఉన్నవాళ్లు మరింత బలంగా తయారవుతారు అన్న మహేంద్రతో..ఏంటి బెదిరిస్తున్నావా అంటే..వాస్తవాలు చెబుతున్నా...దౌర్జన్యం పనిచేయదు అంటాడు. పుస్తకాలు చదివి నాపై ప్రయోగిస్తున్నావా... ఇంతకీ నా రూమ్ కి ఎందుకొచ్చావ్ అంటే... మీకు నమస్కరించి వెళ్లాలనుకుంటున్నా అంటాడు మహేంద్ర. నాకు నీపై కోపం అంటే..పెద్దవాళ్ల కోపం కారణంగా లోక కళ్యాణం అనదగ్గ మంచి పనులు కూడా జరుగుతుంటాయని కౌంటర్ ఇస్తాడు. నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆశీర్వదించండి వదినగారూ అని సెటైర్ వేయడంతో కోపంగా వెళ్లిపోతుంది దేవయాని.
Also Read: బస్తీవాసుల మనసు గెలుచుకున్న మోనిత, ఆవేదనలో డాక్టర్ బాబు.. కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
ఫీల్డ్ విజిట్ కి వెళ్లిన రిషి-వసు..ఓ కొండపైకి వెళ్లి లొకేషన్లు చూసి ఫైనల్ చేసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఈ వివరాలన్నీ మినిస్టర్ గారికి పంపించాలి..అక్కడకు వెళ్లి సర్వే చేద్దాం అంటాడు. లొకేషన్ చూస్తున్న రిషి ఫేస్ పైకి వసు చున్నీ గాలికి ఎగిరిపడుతుంటే రిషి డిస్టబ్ అవుతూ అలా వెనక్కు అడుగులు వేసుకుంటూ వెళ్లుతుండగా తూలి పడబోతుండగా పట్టుకుంటుంది వసుధార. నువ్వు నన్ను పట్టుకుంటే నాతోపాటూ నువ్వూ పడిపోతావ్ జాగ్రత్త అంటే..ఆ క్షణంలో అన్ని ఆలోచనలు రావుకదా సార్ అంటుంది. గాలికి ఎగురకుండా ఉండే బరువైన చున్నీలు ఉండవా అని అడుగిని రిషి ప్రశ్నకు నవ్వుతుంది వసుధార. చున్నీ చివర గవ్వలు, మువ్వలతో అలంకరిస్తే అవి ఎగరకుండా ఉంటాయన్న రిషితో..ఆలోచన బావుంది సార్..ఈ సారి తీరిక దొరికితే నేను ట్రై చేస్తా అంటుంది.
Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
రోడ్డుపై బైక్ పక్కకు ఆపి రిషికి కాల్ చేసిన గౌతమ్..ఎక్కడున్నావ్ అంటే..నేను బిజీగా ఉన్నా మెసేజ్ చేయి అని కాల్ కట్ చేస్తాడు. వీడు ఏదో మనసులో పెట్టుకుని నాపై పగతీర్చుకోవడం లేదు కదా అనుకున్న గౌతమ్..ఇంతకీ వీడెక్కడున్నట్టు అనే ఆలోచనలో పడతాడు. కట్ చేస్తే ఆకలేస్తోందా అని వసు అడిగితే ఆకలి అనేంత ఆకలి లేదు కానీ అలా అనిపిస్తోందంటాడు రిషి. నాకు మాత్రం బాగా ఆకలేస్తోందని అన్న వసుతో..కారులో బిస్కెట్లు ఏమీలేవని..నీ బ్యాగ్ లో ఉన్నాయా అంటే..లేవని చెబుతుంది. ఈ రోజు ఉపవాసం తప్పేలా లేదులే అనుకుంటాడు. అటు గౌతమ్... రిషి కాల్ కట్ చేశాడు కానీ వసుధార అలా చేయదు కదా అనుకుంటూ ఆమెకు కాల్ చేస్తాడు. వసు కూడా కాల్ లిఫ్ట్ చేసి వర్క్ లో ఉన్నాను..తర్వాత మాట్లాడుతా అని కట్ చేస్తుంది. దీంతో ఇంత అవమానమేంటని గౌతమ్ ఫీలవుతాడు.
Also Read: కాకిఎంగిలి చేసిన చాక్లెట్ వసుతో షేర్ చేసుకున్న రిషి, ఐ యామ్ వెరీ హ్యాపీ అంటూ రోడ్డుపై అరుపులు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్...
కట్ చేస్తే కాలేజీలో ఫణీంద్ర, మహేంద్ర, జగతి సహా టీచర్లంతా కాలేజీలో మీటింగ్ లో ఉంటారు. ఇప్పటి వరకూ నేను చెప్పినదాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అంటుంది..అంతా బావుందని చప్పట్లు కొడతాడు. కాన్సెప్ట్ ఎంత సింపిల్ గా ఉంటే అంత త్వరగా అందరికీ అర్థమవుతుంది..వెరీ గుడ్ మేడం అంటారంతా. మేం కూడా దీనిపై వర్క్ చేసి మాకు తోచిన సలహాలు ఇస్తాం అంటారు. షార్ట్ ఫిలిం చేయడానికి డేట్, ప్లేస్ ఫిక్స్ చేశాం..మినిస్టర్ గారినుంచి మెయిల్ వచ్చాక కన్ఫామ్ చేసుకుందాం అనుకుంటారు. షార్ట్ ఫిలింలో నాకో చిన్న పాత్ర ఫిక్స్ చేయండని అడిగిన గౌతమ్ మాటలు గుర్తుచేసుకున్న మహేంద్ర...తనకి ఓ క్యారెక్టర్ ఇమ్మని అడుగుతాడు. స్పందించిన జగతి ...ఇందులో స్టూడెంట్స్ ఉంటే బావుంటుంది గౌతమ్ ఎందుకు అంటుంది...ఇంతలో అడ్డొచ్చిన ఫణీంద్ర ఏంకాదు ఫిక్స్ చేసుకో మహేంద్ర అంటాడు. అదే విషయం గౌతమ్ కి చెబుతాడు మహేంద్ర. వసుతో పాటూ కలసి నటించే అవకాశం దొరుకుతుందని సంబరపడతాడు గౌతమ్.
Also Read: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
ఓ దగ్గర కారు ఆపిన వసుధారతో ఇక్కడ టీ తప్ప ఏమీలేదుకదా అంటాడు రిషి. ఓ రెండు టీలు, బన్నులు తీసుకెళ్లి రిషికి ఇస్తుంది. ఇది తినాలా అనుకుంటూ వసు చెప్పడంతో తింటాడు. అంతలో ప్రేమ లేఖ సంగతి గుర్తుచేసిన వసుధార..ఎవరు రాశారో తెలుసుకోండి సార్..జీవితంలో అది నాకు మొదటి ప్రేమలేఖ..నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను...మీరంటే నాకు ఇష్టం అంటుంది.. రిషి షాక్ లో ఉండిపోతాడు...ఎపిసోడ్ ముగిసింది..
రేపటి ఎపిసోడ్ లో
హోటల్లో కూర్చున్న గౌతమ్...నీ టేబుల్ ఏది వసుధార అని అడుగుతాడు... ఏ టేబుల్ దగ్గర కూర్చున్నా మీరు ఆర్డర్ చేసిన కాఫీ వస్తుందని చెబుతుంది వసుధార. ఇంతలో అక్కడకు రిషి రావడంతో నువ్వంటి ఇక్కడ అని అడుగుతాడు. నువ్వేంటిరా బాబు నావెంట పడుతున్నావ్ అంటాడు గౌతమ్. ఇంతలో రిషిని పలకరించి కాఫీ తెమ్మంటారా అని అడుగుతుంది....నన్ను చూసి కన్నా రిషిని చూసి బాగా నవ్వుతోంది అనుకుంటాడు గౌతమ్...
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి