By: ABP Desam | Updated at : 15 Jan 2022 10:21 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu January 15th Episode (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు జనవరి 15 శనివారం ఎపిసోడ్
ప్రేమలేఖని తలుచుకుని మురిసిపోయిన వసుధార...అది నా మొదటి ప్రేమలేఖ..నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను-మీరంటే నాకు చాలా ఇష్టం (రిషి షాకింగ్ గా చూస్తుంటాడు) అని ఎవరైనా అంటే వాళ్లెవరో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది కదా అంటుంది. తనపై నీకు కోపం లేదా అన్న ప్రశ్నకు...నా జీవితంలో నా లక్ష్యం వేరు అంటూనే..ఆ అక్షరాల్లో ఏదో స్నేహం కనిపిస్తోంది ఈ ఒక్క కారణంతో తనని చూడాలని ఉంది వీలైనతే ఎవరో తెలుసుకోండి అంటుంది. బన్ తిన్నాక కడుపునిండింది సార్ అని వసుధార అంటే నాకు మనసు నిండింది అనుకుంటాడు రిషి. కాలేజీ మెట్లు దిగి వస్తున్న జగతి-మహేంద్ర...రిషి-వసు ని చూసి వీళ్లిద్దరూ నవ్వుతూ వస్తున్నారంటే ఇద్దరి మధ్యా గొడవ జరగలేదని అర్థం అంటుంది. ప్రేమలేఖ విషయాన్ని పట్టించుకోవడం లేదెందుకు.. ఇది చిన్న విషయం కాదు సీరియస్ గా తీసుకోవాలి నువ్వు చెప్పకపోతే నేనైనా రిషికి చెబుతా అంటుంది జగతి.
Also Read: బస్తీలో జెండా పాతేసిన మోనిత, బాధలో కార్తీక్, దీప కథకు ఇక శుభం కార్డేనా... కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..ఏంటి డాడ్ అంటే.. నేను చెబుతా అన్న జగతి .. ప్రేమలేఖ ఎవరు రాశారో తెలుసుకోవాలి సార్ అంటుంది. జగతి మేడం డాడ్ కి ఈ విషయం మొత్తం చెప్పేసినట్టుంది అనుకుంటూ చూద్దాం అంటాడు. చూద్దాం కాదు..ఇది మన కాలేజీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా భావించండి...ఎవరో వెధవ ప్రేమలేఖ రాస్తే మనం పట్టించుకోకుండా ఉండడం సరికాదంటుంది. స్పందించిన రిషి...కాలేజీలో రకరకాల మనస్తత్వాలున్న వారు ఉంటారు.. వారి ఆలోచనా విధానం వేర్వేరు ఉంటుంది..అందర్నీ ఒకేలా చూడలేం కదా అని సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు. అలా అని వదిలేస్తామా.. రాసిన వాడు నాకు దొరికితే కాలర్ పట్టుకుని కడిగేస్తా అంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్..ఇదే మంచి అవకాశం చెప్పేద్దామా అంటే నోర్ముయ్ అని తిడతాడు రిషి. మళ్లీ స్పందించిన జగతి..ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన వియం, మీరంత తేలిగ్గా తీసుకోవద్దు అని జగతి అనడంతో..ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం..దీని గురించి రిషిసార్-నేను డిసైడ్ చేసుకుంటాం అంటుంది వసుధార. వసు గురించి నేను మాట్లాడుతుంటే వసు...మేం ఇద్దరం డిసైడ్ చేసుకుంటాం అంటోందని మహేంద్రతో చెబుతుంది.
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
తన రూమ్ లో కి గౌతమ్ ని తీసుకెళ్లి కడిగేస్తాడు రిషి. వసుధార పేరు ఎలా రాస్తావ్ అంటే..ఇదో ఇంటర్నేషనల్ సమస్యలా చూడొద్దని చెబుతాడు గౌతమ్. మేడం ముందు నా పరువు పోయేది కదా అంటే.. ఈ కాలేజీ నీదు కదా నువ్వెందుకు భయపడుతున్నావ్ అంటే..అందుకే భయపడాలని చెబుతాడు రిషి. నువ్వెందుకు తెగ ఇబ్బంది పడుతున్నావో నాకు ఇప్పటకీ అర్థం కావడం లేదురా అంటాడు గౌతమ్. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దని రిషి చెబుతున్నప్పటికీ..నా ప్రయత్నాలు నేను చేసుకుంటా అంటాడు. కాంపిటేషన్స్ కి అని చెప్పి మోసం చేశావ్ అంటే..ఈ టాపిక్ ఇంతటితో వదిలెయ్ ప్లీజ్ అనేసి గౌతమ్ వెళ్లిపోతాడు.
Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
కట్ చేస్తే హోటల్ కి వెళ్లిన గౌతమ్.. వసుధారని పిలిచి నీ టేబుల్ ఎక్కడ అని అడుగుతాడు. మీరెక్కడ కూర్చున్నా ఆర్డర్ చేసిన కాఫీ వస్తుందని చెబుతుంది. ఏంటీ మనం ఊహించని ఆన్సర్ ఇచ్చింది.. కాఫీ కోసమే వచ్చానని ఎందుకు అనుకోవాలి..నీతో కబుర్ల కోసం అనుకోవచ్చు కదా అంటే..కస్టమర్స్ ఉన్నారు కదా కంపెనీ ఇవ్వలేనంటుంది. వసుధారకి నా మాటల ద్వారా నా మనసు అర్థం కావడం లేదా..అనుకున్నా కానీ వసుధారని ఇంప్రెస్ చేయడం అంత ఈజీకాదు అనుకుంటాడు. అయినా ఎవ్వరు వచ్చినా గౌతమ్ గాడు తగ్గడుగా..ఏరా రిషి ఇప్పుడు రారా అని అనుకోగానే రిషి అక్కడకు ఎంట్రీ ఇస్తాడు. నువ్వెంటి ఇక్కడ అని గౌతమ్ అంటే ఇదేమాట నేను నిన్ను అడగాలి అంటాడు రిషి. మనసంతా ఏదోలా ఉందని చెప్పి..కవర్ చేస్తూ..తలంతా నొప్పి కాఫీ తాగుదామని వచ్చానంటాడు. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ అంటే..నాక్కూడా తలనొప్పే అందుకే వచ్చానంటాడు. అబద్ధం చెప్పకురా అంటే నువ్వేం చెబితే నేను అదే చెప్పాఅనుకో అంటాడు. నువ్వేంట్రా బాబూ నేను ఎక్కడికి వెళితే అక్కడకు వస్తున్నావ్ అంటే..నువ్వు జోరు పెంచావ్ కదా అందుకే అంటాడు. నీడలా వెంటాడుతున్నావ్ అంటే..మంచి పనులు చేయి సపోర్ట్ చేస్తా అంటాడు. నా బాడీలో చిప్ కానీ సిమ్ కార్డ్ కానీ పెట్టావా..సరిగ్గా ఎక్కడుంటే అక్కడకే వస్తున్నావ్ అంటాడు.
Also Read: కాకిఎంగిలి చేసిన చాక్లెట్ వసుతో షేర్ చేసుకున్న రిషి, ఐ యామ్ వెరీ హ్యాపీ అంటూ రోడ్డుపై అరుపులు.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్...
రిషిని చూసి పలకరించిన వసుధార కాఫీ తెమ్మంటారా అని అడుగుతుంది. అదేంటి నన్ను చూసి నవ్వినప్పటి కన్నా రిషిని చూసి బాగా నవ్వుతోంది అనుకున్న గౌతమ్.. నాకు హార్ట్ సింబల్ ఉన్న కాఫీ కావాలని అడుగుతాడు. నా కళ్లముందు వసుధార వీడీకి హార్ట్ సింబల్ ఉన్న కాఫీ ఇవ్వకూడదు అనుకుంటాడు రిషి. వసు చేతిలో కాఫీ చూసి రిషి టెన్షన్ పడిపోతుంటాడు. ఇంతలో రిషికి కాఫీ ఇస్తుంది వసుధార...మరో కప్పు కాఫీ తీసుకొస్తుండగా చూసి మరింత టెన్షన్ పడతాడు...ఇంతలో మరో సర్వర్ ని పిలిచి గౌతమ్ కి కాఫీ పంపించడంతో రిషి రిలాక్సైపోతాడు. గౌతమ్ ఫీలైపోతాడు. నీ హార్ట్ కాఫీకి కూడా బిల్లిచ్చాను...నిదానంగా కాఫీ తాగి వచ్చేయ్ అని రిషి అంటే..నాకు కాఫీ అవసరం లేదు వస్తాను పద అంటాడు గౌతమ్...
Also Read: ప్రేమని అక్షరాలుగా మలిచిన రిషి, చాలా బాగా రాశారన్న వసు... గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్..
Also Read: కళ్లలో దాగి ఉన్న కలలు అద్భుతం, పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం.. నెక్ట్స్ లెవెల్ కి చేరిన గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్...
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!
Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!
Nani: 'సరిపోదా శనివారం' విడుదల ఎప్పుడో చెప్పేసిన నాని!
Redin Kingsley Marriage: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?
Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం
Chhattisgarh CM: ఛత్తీస్‌గఢ్ సీఎంగా మాజీ కేంద్రమంత్రి విష్ణుదేవ సాయి - మొత్తానికి క్లారిటీ ఇచ్చిన పార్టీ
/body>