Karthika Deepam జనవరి 19 ఎపిసోడ్: సౌందర్య, ఆనందరావు దగ్గరకు కార్తీక్.. దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనవరి 19 బుధవారం 1253 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం జనవరి 19 బుధవారం ఎపిసోడ్
రుద్రాణిని కొట్టిన ఆ మహానుభావురాలు ఎవరు అనుకుంటూ.. ప్రకృతి వైద్యశాలకు వెళ్లిన దీప ఎంక్వరీ చేస్తుంది. అలా లోపలికి వెళ్లి సౌందర్య, ఆనందరావుని ( అత్తమామని) చూసి షాక్ అవుతుంది. ఒక్కసారిగా తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటుంది. అంటే రుద్రాణిని కొట్టింది అత్తయ్యగారా..ఏం అని ఉంటుంది ...వీళ్లు ఈ ఊర్లో ఉండి నేను చూడలేకపోయానా, అసలు ఎప్పుడొచ్చారు అనే ఆలోచనలో పడుతుంది. ప్రకృతి ఆశ్రమానికి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చి ఆమెను కలిశారా అంటే..లేదు మళ్లీ వస్తాను అనేసి వెళ్లిపోతుంది దీప.
Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
కార్తీక్-రుద్రాణి
పిల్లలకు క్యారియర్ పంపించిందని తెలిసుకున్న కార్తీక్..ఏదేమైన రుద్రాణిని నిలదీయాల్సిందే అంటూ ఆమె ఇంటికి వెళతాడు. రుద్రాణి గారు అని కార్తీక్ పిలుస్తుంటే ఆమె పట్టించుకోనట్టు పక్కోడితో మాట్లాడుతుంటుంది. నా పిల్లలకు భోజనం పంపించడానికి మీరెవరు? అని గట్టిగా అడుగుతాడు. కోటేశ్ ని కొంపలోకి తీసుకురావడానికి మీరెవరు అంటే..అది మానవత్వం అంటాడు కార్తీక్..ఇది రుద్రాణి తత్వం అంటుంది ఆమె. నా పిల్లలకు భోజనం పంపడం మానుకోండి అంటే ఆపేదే లే అంటుంది రుద్రాణి. అదే సమయంలో టైలర్ అక్కడకు రావడంతో ... మంచి సమయానికి వచ్చావ్ అంటూ....నా పుట్టినరోజు వస్తోంది నీ పిల్లలకు బట్టలు కుట్టించాను అని కార్తీక్ కు ఇవ్వబోతోంది. నా బర్త్ డేకి దీప, మీరు అంతా రావాలని చెబుతుంటుంది. నీ పిల్లలకు బట్టలు కుట్టించడానికి కొలతలు ఎలా సంపాదించానంటే నీ ఇంటి బయట ఆరేసిన బట్టల్ని దొంగతనంగా ఎత్తుకొచ్చారు... ఇప్పుడు అర్థమైందా నేను తలుచుకుంటే ఏపనైనా చేయగలను.. వచ్చి అరిచి అనవసరంగా ఆయాసపడకు..నువ్వు ఎంత అరిచినా నేను చేసేది నేను చేస్తాను అంటుంది. అసలు-వడ్డీ ఏమీ లేదు..వాటి సంగతి పక్కనపెట్టి భోజనం గురించి మాట్లాడతారేంటి... మీరు డబ్బులు ఇవ్వకుంటే పిల్లల్నే అని రుద్రాణి అనేలోగా కార్తీక్ గట్టిగా అరుస్తాడు...మరోవైపు దీపేంటి..రంగరాజుని భుజాన వేసుకుని తిరుగుతోంది నేను ఎత్తుకెళతానని భయమా..ఈ మాత్రం భయం ఉండడం కూడా మంచిదే అంటుంది.
Also Read: ఆసుపత్రి పాలైన మహేంద్ర, జగతి-వసుపై రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది.. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
దీప-కార్తీక్
మరోవైపు ప్రకృతి ఆశ్రమం నుంచి బయటకొచ్చిన దీప.. అత్తయ్య, మామయ్యలు ఈ ఊరు ఎందుకొచ్చారు, వాళ్లకేమైంది, వీళ్లు ఇక్కడున్న విషయం డాక్టర్ బాబుకి చెప్పాలా వద్దా, వాళ్లకి అసలు ఏం సమస్య వచ్చింది, డాక్టర్ బాబుకి తెలిస్తే మరింత బాధపడతారేమో, రుద్రాణి అప్పుతీర్చి ఈ ఊరు దాటాక చెబితే బావుంటుందేమో అనుకుంటుంది. ఇప్పుడే చెప్పకపోవడమే మంచిది అనుకుంటుంది. ఇటు కార్తీక్ కూడా అమ్మ నాన్నలకు ఏం బాధ వచ్చింది. ఎందుకు ప్రకృతి వైద్యశాలలో జాయిన్ అయ్యారు. వాళ్ల బాధకు నేనే కారణమా అని మనసులో అనుకుంటూ నడుస్తుంటే.. ఓ టూ వీలర్ ఢీకొట్టబోతుంది. పిచ్చోడిలా నడుస్తున్నావేంటని బండివాడు తిట్టేసి వెళ్లపోతాడు. వాళ్లకి కనిపించకుండా ఎక్కువ రోజులు దాక్కోలేం, ఈ ఊరు వదిలేసి వెళ్లిపోవడమే మంచిది.. అంటే రుద్రాణి అప్పు తీర్చాలి అనుకుంటాడు కార్తీక్. అమ్మా-నాన్ని డబ్బులు అడిగి రుద్రాణి అప్పుతీరిస్తే మంచిదేమో అనుకుంటాడు. ఈ విషయం దీపకు చెప్పకపోవడమే మంచిది అనుకుంటాడు.
Also Read: బస్తీలో జెండా పాతేసిన మోనిత, బాధలో కార్తీక్, దీప కథకు ఇక శుభం కార్డేనా... కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
మరోవైపు మోనిత ఖాళీగా ఉన్న ఉయ్యాలలో బొమ్మను పెట్టి ‘ఆనంద రావ్ గారు త్వరగా పడుకోండి’ అంటూ ఉయ్యాలను ఊపుతుంది. ఉయ్యాల్లో బొమ్మని తీసేద్దా అని పనిమనిషి విన్నీ అంటే.. నా ప్రేమకథ సూపర్ డూపర్ హిట్ చూస్తుండు నాపై జాలిపడకు అంటుంది మోనిత. మరోవైపు కార్తీక్ ఇంటికి కొత్త సిలిండర్ తీసుకొస్తాడు. అమ్మా-నాన్న మనకోసం చాలా కష్టపడుతున్నారు కదా ని అనుకుంటారు పిల్లలిద్దరు. అటు కార్తీక్ కూడా అమ్మా-నాన్న ఎందుకొచ్చారు అనే ఆలోచనలో ఉంటాడు...ఎందరికో వైద్యం చేసిన నేను నా కన్నవారికి హెల్ప్ చేయలేకపోతున్నాను అనుకుంటాడు. నాన్న బయటకు వెళదామా, బోర్ కొడుతోంది, మాతో ఎక్కవ సమయం గడపడం లేదు, కథలు చెప్పడం లేదు అంటారు పిల్లలు. తర్వాత వెళదాం..నా మనసేం బాలేదు అనేసి బయటకు వెళ్లిపోతాడు కార్తీక్. మరోవైపు దీప కూడా అదే ఆలోచనలో ఉంటుంది. కార్తీక్ ప్రకృతి వైద్యశాలకు పయనమవుతాడు...
రేపటి ఎపిసోడ్ లో
అందరం ఒకే ఊర్లో దగ్గరదగ్గరగా ఉండి కూడా దూరం నుంచి చూసుకోవాల్సి వచ్చిందని బాధపడుతుంది దీప...కట్ చేస్తే కార్తీక్ ప్రకృతి వైద్యశాలలో కనిపిస్తాడు.. సౌందర్య మనసులో ఏదో ఫీలింగ్ వస్తుంది.
Also Read: ఐ లవ్ యూ సర్ అన్న వసుధార.. షాక్ లో రిషి, గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
Also Read: తాడికొండలో పోటాపోటీగా సౌందర్య-మోనిత .. కార్తీక్ విషయంలో నెగ్గేదెవరు, కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి