By: ABP Desam | Updated at : 20 Jan 2022 09:42 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu January 20 Episode (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంతమనసు జనవరి 20 గురువారం ఎపిసోడ్
మహేంద్ర దగ్గర్నుంచి బయటకు వచ్చిన రిషి బాధపడడం చూసి.. అంకుల్ కి ఏంకాదని డాక్టర్ చెప్పారు కదా అంటాడు గౌతమ్. డాడ్ ని ఇలాంటి పరిస్థితుల్లో చూడడం ఇదే మొదటిసారి అన్న రిషితో అంకుల్ కి ఏంకాదంటాడు గౌతమ్. నాకు ఈ లోకంలో డాడ్ ఒక్కరే ఉన్నారు..నాకు అన్నీ ఆయనే అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. పెద్దమ్మకి ఈ విషయం చెప్పావా అని గౌతమ్ అడిగితే లేదు నువ్వే చెప్పు దగ్గరుండి నువ్వే తీసుకురా అని గౌతమ్ ని పంపిస్తాడు. ఓ దగ్గర కూర్చుని తండ్రి జ్ఞాపకాల్లో ఉండగా కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది వసుధార. మహేంద్ర సార్ కి ఏం కాదు, ప్రమాదం లేదని కూడా అన్నారు డాక్టర్స్ అని చెబుతుంది. మహేంద్ర సార్ ని బాగా చూసుకోవాలి అంటే మీరు మంచిగా ఉండాలి కదా ఇలా ఏమీ తినకుండా ఉంటే కష్టం కదా..కాఫీ అయినా తీసుకోండి అని చెబుతుంది. డాడ్ ని ఆసుపత్రిలో చేర్పిస్తే నాకు కాల్ చేయాలి కానీ గౌతమ్ కి కాల్ చేయడం ఏంటని అడుగుతాడు..మీ మేడంకి కూడా గుర్తు రాలేదా అని అడుగుతాడు. పాత పగలన్నీ ఇలా తీర్చుకుంటున్నారా అంటే.. నేను మేడం , నేను కాల్ చేశాం మీరు తీయలేదు..వెయిట్ చేసే టైం లేదు కదా అందుకే గౌతమ్ సార్ కి కాల్ చేశాను.. మహేంద్ర సార్ కి ఏమీ కాదు బాగవుతారు మీరు దిగులు పడకండి అని చెబుతుంది.
Also Read: రుద్రాణి ఆగడాలకి సౌందర్య చెక్ పెట్టనుందా.. దీప-కార్తీక్ ఇప్పుడేం చేయబోతున్నారు
సడెన్ గా వసు చేతులు పట్టుకున్న రిషి.. డాడ్ తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నా వసుధార, నాక్కూడా డాడ్ తప్ప ఎవ్వరున్నారు చెప్పు..నా చుట్టూ ఓ సర్కిల్ గీసుకుని నేను బయటకు రాను, ఎవ్వర్నీ రానివ్వను..నేనున్న సర్కిల్లో నాకు తోడుండేది డాడ్ ఒక్కరే ఆయన్ని ఇలా చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నా అంటాడు. డాక్టర్ తో జగతి మాట్లాడుతుండగా రిషి అక్కడకు వెళతాడు. బయటకు బాగానే ఉన్నా ఆయన దేనిగురించో ఎక్కువ ఆలోచిస్తున్నారని చెబుతాడు వైద్యుడు. నాకు తెలిసి తనని బాధించే సమస్యలు ఏవీ లేవని రిషి అంటాడు. సమస్య అనేది ఒక్కొక్కరి దృష్టిని బట్టి తీవ్రత మారుతుంది..మీకు చిన్నగా అనిపించిన సమస్య , ఎదుటివారికి పెద్దగా అనిపించొచ్చు..వారు దానిని భారంగా మొస్తుండొచ్చు..మీరు చేయాల్సిందల్లా తన మనసు తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళితే తన మనసు ప్రశాంతంగా ఉండొచ్చు. మనసులో భారం తగ్గితే కానీ మామూలు మనిషి కాలేరని డాక్టర్ క్లారిటీ ఇస్తాడు.
Also Read: వసుకి మరోసారి బాధ్యత గుర్తుచేసిన మహేంద్ర, జగతి-రిషి మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
ఏడుస్తూ కూర్చున్న వసుని చూసి.. ఏమన్నారు మా ఎండీగారు అని నవ్వుతూ అడుగుతాడు మహేంద్ర. హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో ఉన్నారు ఎందుకు నవ్వెలా వస్తోందని అడుగుతుంది వసుధార. నాకు స్ట్రోక్ ఎందుకు వచ్చిందో తెలియదు వసుధార.. నాలో ఉన్న బాధలన్నీ ఒక్కసారి బయటకు వచ్చాయేమో అంటాడు. ఫస్ట్ టైమ్ రిషి కళ్లలో కన్నీళ్లు చూశానని వసు అంటే.. ఎన్నాళ్ల నుంచో కన్నీళ్లు దాచుకున్నాడు బయటకు రానీ అంటాడు. రిషి బాధని మొస్తూ కోపాన్ని, నేను బాధని మోస్తూ చిరునవ్వుని ముసుగుగా వేసుకున్నాం... దేవయాని వదిన చేసిన పనికి మా ముగ్గురి జీవితాలు ఇలా అయిపోయాయి...ఇన్నాళ్లూ మనసులో దాచుకున్న కన్నీళ్లు బయటకు వచ్చి ఆబాధంతా పోవాలి అంటాడు. జగతి కన్నీళ్లు చూడలేకపోతున్నా నువ్వే ఓదార్చాలి అంటాడు మహేంద్ర. ఇది సందర్భం కాకపోయినా నీకు మళ్లీ గుర్తుచేస్తున్నా...రిషి-జగతిని కలిపాల్సిన బాధ్యత నీదే అంటాడు. నీ మాట నిలబెట్టుకునే వరకూ నేను ఉంటానో లేదో కూడా తెలియదు అంటాడు మహేంద్ర.
Also Read: సౌందర్య, ఆనందరావు దగ్గరకు కార్తీక్.. దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
డాక్టర్ రూమ్ లోంచి బయటకు వచ్చిన రిషి వెనుకే జగతి వస్తుంది. సార్.. మాట్లాడాలి..మహేంద్ర గురించి మాట్లాడాలి అంటుంది. ఫ్యాకల్టీ హెడ్ గా కాదు మహేంద్ర మనసు తెలుసుకున్న మనిషిగా మాట్లాడుతున్నా, తనతో జీవితం పంచుకోలేకపోయినా జీవిత భాగస్వామిగా మాట్లాడాలి, తన మనసులో ఏదో బాధ, మనకు తెలియనిది ఏదో దాగుందని నా అనుమానం లేకపోతే మహేంద్రకి ఇలా జరిగేది కాదేమో.. డాడ్ క్షేమం కోసం మాత్రమే మీరు ఆలోచిస్తే మాట్లాడండి వింటాను..కానీ.. మర్చిపోయిన బంధాలను ఇందులోకి తీసుకురాకండి అంటాడు రిషి. మహేంద్ర మనసులో ఏదో తెలియని బరువు మొస్తున్నాడు, ఆ బరువు మోయలేని ఫలితమే ఇలా అయ్యాడనిపిస్తోంది అంటుంది జగతి. జరిగిందేంటో నాకు తెలియదు కానీ డాడ్ తన మనసులో ఏదో టెన్షన్ పడుతున్నాడని నాకు అనిపించింది..కానీ ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయకండి అన్న రిషి మాట విని జగతి షాక్ లో ఉండిపోతుంది. డాడ్ మనసు గురించి మీరు విశ్లేషణ చేస్తున్నారు కానీ మీకన్నా ఎక్కువ రోజులు డాడ్ తో నా ప్రయాణం ఉందని మర్చిపోవద్దు అంటాడు. మీరు దూరంగా ఉన్నన్ని రోజులు డాడ్ లో నాకు ఎలాంటి బాధా లేదు..మళ్లీ మీరొచ్చాక ఆయన బాధ తిరిగి మొదలైంది..మీతో ప్రయాణం కొనసాగించలేక..ఇంట్లో సమాధానం చెప్పలేక డాడ్ ఇబ్బంది పడ్డారు. మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదనే ఉద్దేశంతో నేను ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు.. అది నేను ఆయనకి ఇచ్చిన గౌరవం అంటాడు రిషి.
Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
మీరు వెళ్లండి మేడం అని రిషి అంటే.. అవును జగతి వచ్చినప్పటి నుంచీ ఇక్కడే ఉన్నావ్ వెళ్లు అంటాడు మహేంద్ర. ఇప్పటికే అందరకీ దూరంగా వెళ్లపోయాను మహేంద్ర అంటూ....నీ చిరునవ్వుల వెనుక విషాదం నాకు మాత్రమే తెలుసు.. నలిగిపోతున్న మనసుతో మొహం వెలిగిపోతున్నట్టు పెడుతున్న నీ బాధ ఎవరికి తెలుసు అంటుంది జగతి. నాకోసమే జగతి మేడంకి దూరమయ్యారు.. ఇప్పుడు నాకోసం కాకపోయినా డాడ్ కోసమైనా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన టైమొచ్చిందా అనుకుంటాడు రిషి...
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని ... వసు మాటలకి ఉప్పొంగిన రిషి మనసు.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nindu Noorella Saavasam November 29th Episode: చిత్రగుప్తుడి మాటలకు కంటతడి పెట్టుకున్న అరుంధతి.. మనోహరికి చీవాట్లు పెట్టిన అమరేంద్ర!
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Naga panchami November 28th Episode : నన్ను కాటేసి చంపేది నువ్వే.. పంచమికి షాక్ ఇచ్చిన మోక్ష!
Animal: 'యానిమల్'లో మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్ - ఆ మెషీన్ గన్ కాస్ట్ ఎంతో తెలుసా?
Krishna Mukunda Murari promo: కృష్ణని పేరు పెట్టి పిలిచిన మురారి.. గతం గుర్తుకురావడంతో టెన్షన్ పడుతున్న ముకుంద!
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
IND Vs AUS, Match Highlights: మాక్స్ వెల్ మెరుపు శతకం, మూడో టీ20లో టీమిండియాకు తప్పని ఓటమి
/body>