By: ABP Desam | Updated at : 20 Jan 2022 09:07 AM (IST)
Edited By: RamaLakshmibai
karKarthika Deepam 20 January Episode (Image Credit: Star Maa/Hot Star)
ప్రకృతి ఆశ్రమంలో అత్తమామల్ని చూసిన దీప అదే ఆలోచనతో ఇంటికి చేరుకుంటుంది. ఎదురొచ్చిన పిల్లలు ఎందుకమ్మా ఇంత ఆలస్యం అయిందని అడుగుతారు. కట్ చేస్తే రుద్రాణిని కొట్టావ్ పదింతలు పగ తీర్చుకుంటా అన్న మాటలు గుర్తుచేసుకుని.. మన గురించి ఆరా తీసింది ఆమె అయిఉంటుందని డిస్కస్ చేసుకుంటారు సౌందర్య, ఆనందరావు. ప్రశాంతతని వెతుక్కుని ఇక్కడకు వచ్చాం అయినా ప్రశాంతత మనసులో ఉండాలి కదా అన్న ఆనందరావు.. అక్కడా టైమ్ కి తిన్నాం, ఇక్కడా తింటున్నాం అంటాడు. కార్తీక్ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆనందరావు ప్రశ్నకి...ఆ ఆలోచన వద్దు దీప వాళ్లని ఓడిపోనివ్వదని మీరన్నారు కదా అంటే మరి దీపకు సపోర్ట్ ఎవరిస్తారని ప్రశ్నిస్తాడు ఆనందరావు....
Also Read: వసుకి మరోసారి బాధ్యత గుర్తుచేసిన మహేంద్ర, జగతి-రిషి మధ్య దూరం తగ్గుతుందా పెరుగుతుందా.. గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్
కట్ చేస్తే ఇంటికి చేరుకున్న దీప..అత్తయ్య, మామయ్య ఇక్కడే ఉన్న విషయం పిల్లలకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంది. వచ్చినప్పటి నుంచి ఏమీ మాట్లాడటం లేదేంటమ్మా అని అడుగుతారు పిల్లలు. నీకు పని ఎక్కువ అవుతోంది కదా అలసిపోయావా అంటారు. ఏమైంది..డాడీ కూడా డల్ గానే కనిపించారని చెబుతారు. వచ్చి సిలిండర్ ఫిక్స్ చేసి మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటారు. మీరు తమ్ముడితో ఆడుకోండి అని చెప్పి పంపించేస్తుంది. అత్తయ్య, మామయ్య, మేము అంతా ఒకే ఊర్లో ఉన్నప్పటికీ దూరం నుంచి చూసుకోవాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటుంది దీప. మీ నానమ్మ తాతయ్యలు ఇక్కడే ఉన్నారని పిల్లలతో చెప్పలేను, మీ అమ్మా-నాన్నలు ఇక్కడే ఉన్నారని డాక్టర్ బాబుతో చెప్పలేను...వాళ్లెందుకు వచ్చారో అనే ఆలోచనలో పడుతుంది దీప. అదే సమయంలో డాక్టర్ బాబు సిలిండర్ తీసుకొచ్చారని అన్నారు..ఎక్కడినుంచి తెచ్చారు..ఇప్పుడెక్కడికి వెళ్లారని అనుకుంటుంది..
Also Read: సౌందర్య, ఆనందరావు దగ్గరకు కార్తీక్.. దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్
కట్ చేస్తే..ప్రకృతి ఆశ్రమంలో ప్రత్యక్ష మవుతాడు కార్తీక్. మహారాజు, మహారాణిలా ఉండే మమ్మీ,డాడీ ఇలా అవ్వడానికి కారణం నేనే అనుకుంటాడు. ప్రకృతి ఆశ్రమంలో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి వాళ్లెందుకు వచ్చారని అడుగుతాడు. మీరెవరు అంటే తెలిసిన వాళ్లు అని అబద్ధం చెప్పేస్తాడు. ఆ పెద్దాయనకు ప్రాబ్లెం ఏంటి అని అడిగితే... మీరు కలుస్తానంటే మీ పేరు చెప్పండి, లేదంటే వెళ్లిపోండి అంటాడు. మాటిమాటికీ వచ్చి ఇబ్బంది పెడితే బాగోదంటాడు. చేసేదిలేక కార్తీక్ వెనుతిరుగుతాడు.
Also Read: సౌందర్య-ఆనందరావుని ఆ పరిస్థితుల్లో చూసిన దీప-కార్తీక్ ఏం చేయబోతున్నారు .. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
మోనిత ఫోన్లో బాబుని ఎత్తుకెళ్లిన కోటేష్ ఫొటో చూస్తూ..ఎవడ్రా నువ్వు నా ఆనందరావుని ఎత్తుకెళ్లావ్ అనుకుంటుంది. సౌందర్య ఆంటీ ఇంట్లో ఏం జరుగుతోంది... మావయ్యగారికి ఆరోగ్యం ఎందుకు బాగాలేదు..ఒకవేళ ఏదైనా జరిగి ఆయన పైకి పోతే..కార్తీక్ రాక తప్పదు. అప్పుడు కార్తీక్ ని నేను కలవకా తప్పదు. ఈ లోగా బుల్లి ఆనందరావుని వెతకక తప్పదు. ఇందుకు నా ఆస్తి మొత్తం ఖర్చైనా పర్వాలేదు అనుకుంటుంది.
Also Read: బస్తీలో జెండా పాతేసిన మోనిత, బాధలో కార్తీక్, దీప కథకు ఇక శుభం కార్డేనా... కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ప్రకృతి ఆశ్రమంలో ఉన్న ఆనందరావు...కాసేపు బయటకు వెళ్లి నడుద్దామా అని అడిగితే..వాతావరణం చల్లగా ఉంది వద్దులెండి అంటుంది సౌందర్య. దురదృష్టం అంటే చాలామంది ఏదేదో చెబుతుంటారు..కానీ..పిల్లల్ని దూరం చేసుకోవడం కన్నా దురదృష్టం ఏముంటుంది అనుకుంటారు. ఈలోగా ఆశ్రమానికి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చి మీగురించి అడిగిన ఆవిడ మళ్లీ ఏమైనా వచ్చిందా అని అడిగి..మీరు కొట్టినావిడ అంత మంచిదేం కాదని చెప్పి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఇంట్లో అన్నం తింటూ...మమ్మీ-డాడీ విషయం దీపకు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. దీప కూడా సేమ్ ఆలోచిస్తుంది. మీరు పిల్లలతో మనసు బాలేదు అన్నారట అన్న దీప ప్రశ్నకు..నా మనసు ఎప్పుడు బావుందిలే అనేసి..ఇందాక రుద్రాణి దగ్గరకు వెళ్లి పిల్లలకు భోజనం పంపించొద్దని వార్నింగ్ ఇవ్వడానికి వెళ్లాను అని చెప్పి పిల్లలకు బట్టలు కుట్టించిన విషయం చెబుతాడు. ఇది నాకు ముందే తెలుసు అన్న దీప.. రుద్రాణిని ఆశ్రమంలో ఎవరో కొట్టారంట తెలుసా అంటుంది. నువ్వు ఆశ్రమానికి వెళ్లావా..నీకేం పని అంటాడు కార్తీక్. రుద్రాణిని కొట్టిందని తెలిసి ఆ మహానుభావురాలిని చూసేందుకు వెళ్లాను అంటుంది. చూశావా అని కార్తీక్ అడిగితే లేదని సమాధానం చెబుతుంది. దీప ఆశ్రమానికి వెళ్లిందంటే అమ్మా,నాన్న కనిపించి ఉంటారా అనుకుంటాడు కార్తీక్. గ్యాస్ సిలిండర్ గురించి ఇద్దరూ అబద్ధాలు చెప్పుకుని బాధపడతారు.
Also Read: రుద్రాణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దీప , మోనిత నుంచి తప్పించుకున్న కార్తీక్.. కార్తీకదీపం జనవరి 13 గురువారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్ లో
బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణి ఇంటికి కోపంగా వెళుతుంది దీప. తప్పుచేశావ్ అని అరిస్తే..ముందు డబ్బులిచ్చి ఆ తర్వాత బాబుని తీసుకెళ్లమని చెబుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే నీ పిల్లలు ఇద్దర్నీ ఎత్తుకొస్తా అంటుంది. రుద్రాణి గొడవ నెమ్మదిగా ముగింపు దశకు వచ్చేట్టే ఉంది...చూడాలి...
Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని ... వసు మాటలకి ఉప్పొంగిన రిషి మనసు.. గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్
Also Read: ఎదను తాకేటి ప్రణయమా - కనుల కదలికలు తెలుపమా.. ప్రేమలో మరో మెట్టెక్కిన రిషి-వసు... గుప్పెడంత మనసు శుక్రవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Ashoka Vanamlo Arjuna Kalyanam: 'అశోకవనంలో అర్జున కళ్యాణం' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Bigg Boss Sunny New Movie: 'సన్నాఫ్ ఇండియా' దర్శకుడితో 'బిగ్ బాస్' విన్నర్ సన్నీ హీరోగా సినిమా
Major Ticket Prices: కరోనా తర్వాత తక్కువ టికెట్ రేట్స్ వసూలు చేస్తున్న సినిమా అడివి శేష్ మేజర్
Karate Kalyani: యూట్యూబ్ ఛానెల్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు!
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?