By: ABP Desam | Updated at : 22 Jan 2022 09:55 AM (IST)
Edited By: RamaLakshmibai
Guppedantha Manasu January 22 Episode (Image Credit: Star Maa/Hot Star)
గుప్పెడంత మనసు జనవరి 22 శనివారం ఎపిసోడ్
గుప్పెడంతమనసు శనివారం ఎపిసోడ్ కూడా హాస్పిటల్లోనే ప్రారంభమైంది. మీరంతా ఇంటికి వెళ్లండి నేను డాడ్ ని తీసుకొస్తా అని చెప్పి రిషి..దేవయాని, ఫణీంద్ర,ధరణిని పంపించేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ పనులు ఎంతవరకూ వచ్చాయని మహేంద్ర అనడంతో..నువ్వు హాస్పిటల్ లోఉన్నావ్ ఇప్పడా టాపిక్ ఎందుకు అంటుంది జగతి. నాకు కాఫీ తాగాలని ఉందని అంటే.. నువ్వేం తినాలో నేను డిసైడ్ చేస్తాను అని జగతి అంటే..ఇదే మాట మన పుత్రరత్రం అన్నాడు తెలుసా అంటాడు. బావగారు వాళ్లు కనిపించడం లేదంటే..వాళ్లు ఇప్పుడే వెళ్లారని చెప్పిన మహేంద్ర మా వదిన నాపై తెగ ప్రేమ చూపిస్తోందిలే అంటాడు. మిమ్మల్ని ఏమైనా అన్నదా అంటే ఆ అవకాశం ఇవ్వలేదు అంటుంది వసుధార. జగతి నువ్వుకూడా వెళ్లిపోతావా అంటే.. తప్పదు కదా మహేంద్ర.... నువ్వు మీ ఇంటికి నేను మాఇంటికి వెళతాను అంటుంది. నాతోరావొచ్చు కదా..ఇంటి వరకూ వచ్చి నన్ను వదిలేసి వెళ్లిపో అంటే..బావుండదు మహేంద్ర అన్న జగతితో నువ్వు ఇంటివరకూ రా నాకు బావుంటుందని అడుగుతాడు. ఇదంతా రిషి చూసి బయటకు వెళ్లిపోతాడు.
Also Read: వంటలక్క కాఫీని గుర్తుపట్టిన సౌందర్య, ఆనందరావు, రుద్రాణికి టైమ్ దగ్గరపడిందా .. కార్తీకదీపం శనివారం ఎపిసోడ్
ఆ తర్వాత కారు డ్రైవ్ చేస్తున్న గౌతమ్..వసుధార నీకు నా మనసులో మాట చెప్పాలి..ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా కుదర్లేదు అనుకుంటాడు. మరోవైపు రిషి కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కనే వసు, వెనుక సీట్లో జగతి-మహేంద్ర కూర్చుంటారు. గౌతమ్ ఆ కారు పక్కకే వెళ్లి హారన్ కొట్టి వసు తనవైపు చూసేలా చేసుకుంటాడు. మీరంతా ఒకటై నన్ను మీ కారు తీసుకురావడానికి వాడుకుననారా ఇదేం న్యాయం అనుకుంటాడు గౌతమ్. అంతా ఇంటి దగ్గరకు వస్తారు. ముందు కార్లోంచి జగతి దిగడం చూసి దేవయాని షాక్ అవుతుంది. జగతి లోపలకు వస్తుందా ఏంటి అస్సలు అడుగు పెట్టనిచ్చేదే లేదని మనసులో అనుకుంటుంది దేవయాని. కార్లోంచి దిగిన మహేంద్ర తూలిపడబోతుంటే జగతి పట్టుకుంటుంది. మా డాడ్ ని నేను చూసుకుంటాను అని రిషి మాటలు విని జగతి చేయి వదిలేస్తుంది.
Also Read: జగతిని లోపలకు రమ్మని పిలిచి… రిషి దేవయానికి షాకివ్వబోతున్నాడా, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్..
ఇంటి లోపలకు వెళ్లేముందు ధరణి వచ్చి దిష్టి తీస్తుంటే ఆ పళ్లెం తీసుకున్న దేవయాని జగతిని తిట్టేలా దిష్టి తీస్తుంది. మహేంద్ర వెనక్కు తిరిగి జగతిని చూసి నువ్వెప్పుడు ఈ గడప దాటి వస్తావు జగతి అని మహేంద్ర...నేను ఆ గడప దాటి ఎప్పటికీ లోపలకు రాలేనేమో మహేంద్ర అని జగతి అనుకుంటారు. ఇంతలో దేవయానికి వచ్చి మహేంద్రకి జగతి కనిపించకుండా అడ్డుగా నిల్చుంటుంది. అదృష్టం బావుండి ఇక్కడి వరకూ వచ్చావ్.. ఈ గడప దాటి లోపలకు రానివ్వను నేనుండగా అది జరగదు అనుకుంటుంది దేవయాని. ఇంతలో గౌతమ్ బయట కారు దిగివస్తాడు. ధరణి లోపలకు వచ్చి తలుపు వేసేయండి అన్న దేవయానితో రిషి ఒక్క నిముషం అని జగతి దగ్గరకు వెళ్లి నమస్కారం పెడతాడు. మీరిద్దరూ లేకపోతే ఈరోజు మా డాడీ ఉండేవారే కాదు.. థ్యాంక్యూ అని చెప్పి..గౌతమ్ తీసుకెళ్లి డ్రాప్ చేసిరా అని చెప్పి లోపలకు వెళ్లిపోతాడు. ఇదంతా చూసి మహేంద్ర సంతోషిస్తే.. దేవయాని కుళ్లుకుంటుంది. లోపలకు వెళ్లి తలుపులు మూసేస్తుంది.
Also Read: తండ్రిని తల్లి దగ్గరకు పంపించేసి రిషి ఒంటరి కానున్నాడా.. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్..
వసుతో జగతి
ఇంటికి తిరిగి వెళుతూ దేవయాని, రిషి మాటలు అన్నీ గుర్తుచేసుకుంటుంది జగతి. మేడం మీరుకూడా ఇంట్లోకి వెళ్లాల్సింది కదా అన్న వసుతో..ఏ అర్హతతో వెళ్లాలి... మహేంద్ర భార్యగానా దేవయాని ఒప్పుకోదు, రిషి తల్లిగానా రిషి ఒప్పుకోడు...ఆ ఇంటి కోడలిగానా అప్పుడు అందరూ ఒప్పుకోవాలి...ఎలా వెళ్లాలి..మిషన్ ఎడ్యుకేషన్ రూపకర్తగా మాత్రమే వాళ్ల దృష్టిలో ఉన్నాను అంటుంది. మీరు వెళితే మహేంద్ర సార్ సంతోషపడేవారు కదా అంటే.. ఆయన సంతోష పడితే బాధపడేవారు కూడా అక్కడున్నారు కదా అంటూ..ఆ రోజు నన్ను బయటకు పంపించింది..ఈ రోజు నేను లోపలకు వెళతానేమో అని తలుపులు మూసేసింది...లోపలకు వెళ్లాలంటే తలుపులు తీసిఉంటే సరిపోదు..వాళ్లంతా స్వాగతించాలి.. నా రాకకోసం ఆ ఇల్లు, ఆమనుషులు ఎదురుచూడాలి... అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి అప్పుడే ఆ గడప తొక్కుతాను...అప్పుడే ఆ గడపకి మొక్కుతాను...అది గడపకాదు సీతారాముల్ని విడదీసిన లక్ష్మణరేఖ.. గౌరవంగా పిలిచిన రోజే ఆ గడప దాటి లోపలకు వెళతాను..వెళతానో లేదో...ఇలాగే ఒంటరిగా రాలిపోయి అనాధ శవంలా కాటికి వెళతానేమో అన్న జగతి మాటలు విని వసు షాక్ అవుతుంది...
Also Read: మోనిత బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణిపై దీప ఫైర్.. కార్తీక్ ని సౌందర్య చూస్తుందా… కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్..
Also Read: రుద్రాణి ఆగడాలకి సౌందర్య చెక్ పెట్టనుందా.. దీప-కార్తీక్ ఇప్పుడేం చేయబోతున్నారు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Jr NTR: నెట్ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
/body>