Guppedantha Manasu జనవరి 25 ఎపిసోడ్: తండ్రి సంతోషం కోసం ఓ మెట్టుదిగిన రిషి, గుండెల్ని మెలిపెట్టిన గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తండ్రి సంతోషం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమైన రిషి...తల్లి జగతిని ఇంటికి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతాడు. జనవరి 25 మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
గుప్పెడంతమనసు జనవరి 25 మంగళవారం ఎపిసోడ్
కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న రిషిని చూసి నిద్రలేపాలా వద్దా అని ఆలోచించి వద్దులే అని ఊరుకుంటాడు మహేంద్ర. జగతి ఇంటి వరకూ వచ్చి వెళ్లిపోయింది..ఎంత బాధపడిందో ఏమో అనుకుంటూ రిషి చూడకుండా మొబైల్ తీసి మెసేజ్ చేస్తాడు. మహేంద్ర ఈ టైమ్ లో మెసేజ్ చేశాడంటే ఇంకా పడుకోలేదా అనుకుంటూ 'ఐ యామ్ ఓకే' అన్న మహేంద్ర మెసేజ్ కి' ఐ యామ్ నాట్ ఓకే' అని రిప్లై ఇస్తుంది. కాల్ చేయనా అని అడిగితే... సారీ జగతి..పక్కనే రిషి ఉన్నాడని రిప్లై ఇస్తాడు. నా కొడుకు ఎంత మంచివాడో తండ్రి పక్కనే ఉన్నాడని గుడ్ నైట్ చెబుతుంది. గుడ్ నైటా.. ఇంకాసేపు చాటింగ్ చేయ్యొచ్చు కదా అని మెసేజ్ పెట్టేలోగా దగ్గురాగానే రిషి లేచి వాటర్ ఇస్తాడు. పక్కనే మొబైల్ చూసి సెల్ ఫోన్ ఆన్ చేశారు కదూ అని రిషి అంటే..నిద్ర పట్టడం లేదు అంటాడు మహేంద్ర. ఏమైనా టెన్షన్ ఫీలవుతున్నారా..సంతోషంగా ఉండాలి మీరు అన్న రిషితో...సంతోషం అంటే ఏంటి అని అడుగుతాడు. కంఫర్ట్ గా ఉండడం అని సమాధానం ఇస్తాడు రిషి. కంఫర్ట్ వేరు సంతోషం వేరు అని రిప్లై ఇచ్చిన మహేంద్ర... కారు, బ్యాంక్ బ్యాలెన్స్, విలాసాలు ఇవన్నీ సౌకర్యాలు మాత్రమే సంతోషాలు కాదని క్లారిటీ ఇస్తాడు. గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం ఆ మార్నింగ్ గుడ్ అవ్వాలని లేదు కదా... అంటే మర్నింగ్ గుడ్ గా ఉండాలని అనుకోవడం తప్పులేదు కదా అంటాడు రిషి.
Also Read: ఎందుకిలా చేశారంటూ కార్తీక్ ని కాలర్ పట్టుకుని కన్నీళ్లతో ప్రశ్నించిన దీప.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్….
ఇల్లంటే ఖరీదైన ప్లాస్టిక్ పూలు ఓ మూల ఉండటం కాదు..ఇల్లంతా సందడిగా ఉండాలి.. మనిషైనా,మనసైనా నిశ్సబ్దాన్ని ఎక్కువ సేపు ఆశ్రయిస్తే సంతోషానికి రెక్కలొచ్చి ఎగిరిపోతుంది రిషి అంటాడు మహేంద్ర. మీరేదో సంతోషాన్ని మిస్సైనట్టుగా,మీ మనసేదో కోరుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది అన్న రిషితో... ఇరవైఏళ్లుగా పడుతూనే ఉన్నా నా మనసుకి అర్థమైంది తట్టుకుంది.. కానీ నా గుండె తట్టుకోలేకపోయింది అంటాడు. మీ సంతోషం కోసం ఏం చేయాలి అని అడిగిన రిషికి...జగతి అనే మూడక్షరాలతో సమాధానం ఇస్తాడు మహేంద్ర. నా భార్య ,నా జీవితం ,నా అర్థాంగి ... మాట్లాడవేంటి రిషి..సంతోషం అంటే పొద్దున్నే లేవగానే కోటి రూపాయల ఖరీదైన కారుని చూసుకోవడం కాదు..చిరునవ్వుతో కాఫీ అందించే తన భార్యని చూడడం .. మీ ఇద్దరూ అల్లరి చేయాలి, మీ ఇద్దరూ గొడవపడాలి, ఎవరిది న్యాయం అంటూ నా దగ్గరకు రావాలి ..ఎంత బావుంటుందో కదా..నేను పెసరట్టు చేయమంటాను, నాకు ఇడ్లీ ఇష్టమంటావ్.. నా కొడుకు చెప్పిందే చేస్తానంటుంది.. నేను సరదాగా టిఫిన్ తిననని అలుగుతాను...మీ ఇద్దరూ నా దగ్గరకు వచ్చి బుజ్జగిస్తారు...ఎంత బావుంటుందో కదా రిషి..ఇదీ సంతోషం అంటే... ఇలాంటిది ఎప్పుడైనా ఈ ఇంట్లో జరిగిందా లేదు కదా అన్న మహేంద్ర మాటలు విని అక్కడి నుంచి ఏమోషనల్ గా వెళ్లిపోతాడు రిషి. సంతోషం అంటే నాకు ఇంతకన్నా ఇంకేం ఉంటుంది...ఇదే అనుకుంటాడు మహేంద్ర.
Also Read: నాన్నకు ప్రేమతో రిషి.. జగతిని ఇంటికి తీసుకొస్తాడా, మధ్యలో వసు రాయబారమా .. గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్
సీరియల్ లో సంక్రాంతి సంబరాలు ఇప్పుడొచ్చాయి. ఇంటి ముందుకి వచ్చిన హరిదాసుకి బియ్యం, కూరగాయలు వేస్తుంది జగతి. సంక్రాంతి పండుగ గురించి గురుశిష్యులు జగతి-వసుధార మాట్లాడుకుంటారు. పండుగలన్నీ నాకు క్యాలెండర్ మీదే కనిపిస్తాయి వసు...జీవితంలోంచి అన్ని పండుగలు అలిగి వెళ్లిపోయాయి, సంప్రదాయాలు పాటిస్తాను కానీ పండుగలు వస్తే సంతోషం పడదాం అన్నా నాకు తోడెవరున్నారు వసు..అందరిలా దీపావళి,దసరా,సంక్రాంతి అన్ని పండుగలు చేసుకోవాలని ఉంటుంది...కానీ.. ఒంటరిగా ఒక్కరు చేసుకునే పండుగ లేదుకదా... పండుగ అంటేనే అంతా కలసి ఒకేచోట సంతోషంగా ఉండడం కదా...అందరూ ఉన్నా ఎవ్వరూ లేని ఏకాకిని... అందరికీ చాలా పండుగలు ఉంటాయి..నాకు రెండే రెండు పండుగలు... ఒక పండుగ పేరు మహేంద్ర, మరో పండుగ పేరు రిషి... మహేంద్ర ఎలా ఉన్నాడో ఏమో..చీటికి మాటికి ఫోన్ చేయలేను, చేయకుండా స్థిమితంగా ఉండలేను అంటూ లోపలకు వెళ్లిపోతుంది.
Also Read: మోనిత కొడుకు కోసం కార్తీక్-దీప తాపత్రయం, నెల రోజులు గడువిచ్చిన రుద్రాణి.. కార్తీకదీపం సోమవారం ఎపిసోడ్
కట్ చేస్తే ఇంటి బయట కూర్చున్న రిషి...తండ్రి మహేంద్ర మాటలు గుర్తుచేసుకుంటాడు. కోరుకున్నంత మాత్రాన అన్నీ చేరవు కదా అన్న మహేంద్ర మాట గుర్తుచేసి..ఆయన సంతోషం కోసం నేను తనకు కావాల్సింది ఇవ్వాలి కదా అనుకుంటాడు. తన ఆనందం ముందు ఎంత విలువైంది అయిన గడ్డిపరకతో సమానం అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్.. అంకుల్ బావున్నారు కదా ఇంకా ఎందుకు డల్ గా ఉన్నావ్ ..నువ్వు డల్ గా ఉంటే చూడ్డానికి నాకు బాలేదంటాడు గౌతమ్. బయటకు వెళదమా, పెయింటింగ్ వేద్దామా అని మాట్లాడిస్తాడు గౌతమ్. నువ్వు నిజంగా ఫ్రెండ్ వి అయితే పది నిముషాలు నన్ను ఒంటరిగా వదిలెయ్ ప్లీజ్ అనగానే గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. డాడ్ ఆనందంగా ఉండాలంటే పర్మినెంట్ పరిష్కారం ఆలోచించాలి.. ఏం చేయాలి అనుకుంటూ వసుధారకి కాల్ చేసి ఎక్కడున్నావ్ అంటాడు. రెస్టారెంట్ డ్యూటీకి బయలుదేరుతున్నా అన్న వసు మాట విని కాల్ కట్ చేసి వెంటనే బయలుదేరి వసు దగ్గర ప్రత్యక్షమవుతాడు.
Also Read: అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి.. గుండెల్ని పిండేసిన గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్...
చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి.. నీ రెస్టారెంట్ డ్యూటీ కన్నా వందరెట్లు ఇంపార్టెంట్.. అన్నిసార్లూ అన్ని వివరాలు అడగొద్దు కారెక్కు వెళదాం అంటాడు. నా పర్సనల్ మేటర్.. వస్తున్నావ్ కదా అంటే పదండి సార్ అని కారెక్కుతుంది వసు. మరోవైపు క్యారెట్ జ్యూస్, బీన్స్, ఉడకబెట్టిన మొలకలు అని ధరణి మాట్లాడుతుంటే.. గౌతమ్ విని అటువైపు డాక్టర్ ఉండి ఉంటారు అనుకుంటాడు గౌతమ్. కానీ అఠువైపు నుంచి మాట్లాడుతున్న జగతి..నేను ఇక్కడ ఉండి బాధపడడం తప్ప ఇంకేం చేయలేనంటుంది.
రేపటి ఎపిసోడ్ లో
ఇంటికి వచ్చిన రిషిని చూసి జగతి షాక్ అవుతుంది. మా డాడ్ సంతోషం కోసం ఇంటికి రావాలని పిలుస్తాడు. నన్ను ఇంటికి పిలుస్తున్నారా అని జగతి ఆనందంతో ఉప్పొంగిపోతుంటే... వసు నువ్వు కూడా రావాలని అడుగుతాడు రిషి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి